Sunday, November 13, 2011

జీవనతీరాలు--1977



చిమ్మట లోని ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్యా ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

Film Directed By::G.V.Shekhar
తారాగణం::శివాజీ గణేశన్,కృష్ణంరాజు,వాణిశ్రీ,కొంగర జగ్గయ్య,జయసుధ,గుమ్మడి వెంకటేశ్వరరావు,కాంతారావు,నిర్మల,రావి కొండలరావు

పల్లవి::

లలా..హ్హా..లాలలలలా
అహా..హో..లాలలలా

నీ కన్నులలో కలనై..నీ కౌగిలిలో కలినై
నీ కన్నులలో కలనై..నీ కౌగిలిలో కలినై
ఉండిపోనీ..ఓడిపోనీ..ఉండిపోనీ ఓడిపోనీ

నీ సిరిమెడలో మణినై..నీ సిగముడిలో విరినై
నీ సిరిమెడలో మణినై..నీ సిగముడిలో విరినై
వెలిగిపోనీ నలిగిపోనీ..వెలిగిపోనీ నలిగిపోనీ

నీ గుడియలో సవ్వడిగా..నన్ను మోగనీ
నా కోర్కెలకు వరవడిగా..నిన్ను చూడనీ

నీ సొగసులన్ని తనివితీర..జుర్రుకోనీ
నీ సొగసులన్ని తనివితీర..జుర్రుకోనీ
నా పొగరు నీ పరువానికి..కానుకివ్వనీ


నీ కౌగిలిలో కలినై
ఉండిపోనీ..ఓడిపోనీ..ఉండిపోనీ ఓడిపోనీ

చరణం::2

వద్దు వద్దు వద్దు వద్దూ..వద్దని ఈ..ఈ..
నన్ను వదలవద్దనీ..
ఆపు ఆపు ఆపూ..ఆపమన్నది ఏదీ..ఈ..
ఆగలేని కాలాన్ని..రేయి ముద్దు ముద్రవేయనీ
హద్దు రద్దు చేయనీ..హద్దు రద్దు చేయనీ
ఆ ఆ ఆ...

చరణం::3

మొగ్గవిరిసి పూవుగా పారడం సహజమనీ
సిగ్గు విడిన ఈ క్షణం..సిగ్గుపడకతప్పని
కలిసింది తానేనని వలపుసాక్ష్యమివ్వనీ
కలిసింది తానేనని వలపుసాక్ష్యమివ్వనీ
మరపురాని ఈ క్షణం..మనుగడగా మారనీ
మరపురాని ఈ క్షణం..మనుగడగా మారనీ

నీ కౌగిలిలో కలినై..ఉండిపోనీ..ఓడిపోనీ..
నీ సిరిమెడలో మణినై..నీ సిగముడిలో విరినై
వెలిగిపోనీ..నలిగిపోనీ..

జీవన తీరాలు--1977



చిమ్మట లోని ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల

Film Directed By::G.V.Shekhar
తారాగణం::శివాజీ గణేశన్,కృష్ణంరాజు,వాణిశ్రీ,కొంగర జగ్గయ్య,జయసుధ,గుమ్మడి వెంకటేశ్వరరావు,కాంతారావు,నిర్మల,రావి కొండలరావు


పల్లవి::

ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..
ఏ రాగమనే పాడను..ఏ తీగ నే మీటను
ఏ రాగమనే పాడను..ఏ తీగ నే మీటను
ఎదుట రూపమే..ఎదను దీపమై
నుదుట తిలకమై..మెరిసిన వేళా
నవరస..కన్నడ..వసంత..వరాళి
మోహన..కల్యాణి..ఆనందభైరవి..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఏ రాగమనే పాడను..ఏ తీగ నే మీటను

చరణం::1

మోగవేదనకు రాగాలన్నీ..ముద్దుమాటలని తెలుసు
రాగమేదినే ఆలపించినా..యోగమిదేనని తెలుసు
మోగవేదనకు రాగాలన్నీ..ముద్దుమాటలని తెలుసు
రాగమేదినే ఆలపించినా..యోగమిదేనని తెలుసు

తెలిసి తెలిసి ఏ తీగమీటినా..తెల్లవారదా నా బ్రతుకు
తెలిసి తెలిసి ఏ తీగమీటినా..తెల్లవారదా నా బ్రతుకు
నీ చల్లని నవ్వుల వెన్నెలలే..నా సిగను పూవులై విరిసినవేళా

నవరస..కన్నడ..వసంత..వరాళి..
మోహన..కల్యాణి..ఆనందభైరవి..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఏ రాగమనే పాడను..ఏ తీగ నే మీటను

చరణం::2

వయసు వసంతాలాడిన నాడు..మనసు మోడుగా మిగిలింది
ఎడారి దారుల నడచిన నాడు..ఎదలో కోయిల పలికింది
వయసు వసంతాలాడిన నాడు..మనసు మోడుగా మిగిలింది
ఎడారి దారుల నడచిన నాడు..ఎదలో కోయిల పలికింది

గతము తలచి నా గతికి వగచి..నే నున్న వేళ నాకున్నావు
గతము తలచి నా గతికి వగచి..నే నున్న వేళ నాకున్నావు
నీ చల్లని చూపుల పల్లవితో..నా బ్రతుకు పాటగా మారిన వేళా

ఏ రాగమనే పాడను..ఏ తీగనే మీటను
ఎదుట రూపమే ఎదను దీపమై
నుదిటి తిలకమై మెరిసిఉన వేళా

నవరస కన్నడ..వసంత..వరాళి
మోహన..కల్యాణి..ఆనందభైరవి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జీవన తీరాలు--1977



చిమ్మట లోని ఈ పాట ఇక్కడ వినండి
Suseela would be 'Viswa Vikhyata Sangeeta Kala Saraswati'
13-ii-1935---75th సుశీలమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు
సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::G.V.Shekhar
తారాగణం::శివాజీ గణేశన్,కృష్ణంరాజు,వాణిశ్రీ,కొంగర జగ్గయ్య,జయసుధ,గుమ్మడి వెంకటేశ్వరరావు,కాంతారావు,నిర్మల,రావి కొండలరావు.


పల్లవి::

కెరటానికి ఆరాటం..తీరం చేరాలనీ

తీరానికి ఉబలాటం..ఆ కెరటం కావాలనీ
కెరటానికి ఆరాటం..తీరం చేరాలనీ
తీరానికి ఉబలాటం..ఆ కెరటం కావాలనీ
ఎందుకో ఆ ఆరాటం..అందుకే..అందుకే..ఆ ఉబలాటం

కెరటానికి ఆరాటం..తీరం చేరాలనీ..

చరణం::1

కురులపై మెరిసే చినుకులు..ఆణిముత్యాలై
తనువుపై కురిసే చినుకులు..తడితడి ముచ్చటలై
మదిలోపల తెరతీసి..మారాము చేస్తుంటే
మదిలోపల తెరతీసి..మారాము చేస్తుంటే
పదునైన కోరిక ఏదో..పెదవినే గురి చూస్తుంది

ఎందుకో ఈ ఆరాటం..అందుకే..అందుకే..ఆ ఉబలాటం

చరణం::2

ఏమి వెన్నెల ఎంతకూ మన ఇద్దరిపైనే పడుతున్నది
తనకు దాహం వేసిందేమో..మనల్ని అల్లరి పెడుతున్నది
ఎంతెంత దగ్గరగా..ఆ..ఆ..ఇద్దరమూ ఉన్నా..
మరికాస్తా..ఇంకాస్తా..ఒదిగిపొమ్మని..
మౌనంగా ఉరుముతున్నది..వెన్నెల ఉరుముతున్నది

ఎందుకో ఈ ఆరాటం..అందుకే..అందుకే..ఆ ఉబలాటం

చరణం::3

ఇది వసంతమని తెలుసూ..కోయిల పాటలకు
ఇదే మూలమని తెలుసు..తీయని పంటలకు
లలిత లలిత యువ..పవన చలిత పల్లవ దళాలలోనా
నవనవలాడే అనుభవమేదో..నన్నే అలగ మలచుకొన్నది
నన్నే అలగా మలచుకొన్నది

ఎందుకో ఈ ఆరాటం..అందుకే..అందుకే..ఆ ఉబలాటం


కెరటానికి ఆరాటం..అహహహా..
తీరం చేరాలనీ
తీరానికి ఉబలాటం..అహహహా
ఆ కెరటం కావాలనీ

లలలాలలలా..లాలలలలలాలా
లలలాలలలా..లాలలలలలాలా
లలలాలలలా..లాలలలలలాలా
లలలాలలలా..లాలలలలలాలా