Monday, March 09, 2015

శ్రీరామాంజనేయ యుద్ధం--1975



సంగీతం::K.V..మహాదేవన్  
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,B.వసంత
తారాగణం::N.T.రామారావు,అర్జా జనార్ధనరావు,కాంతారావు,B.సరోజాదేవి,జయంతి,రాజశ్రీ.

పల్లవి::

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

చరణం::1

దధిక్షీరమ్ములకన్నా ఎంతో
మధుర మధుర నామం
సదా శివుడు ఆ రజతాచలమున
సదా జపించే నామం
కరకుబోయ తిరగేసి పలికినా
కవిగా మలచిన నామం
రా..మరా..మరామ..రామ
రామ..రామ..రామ..రామ
కరకుబోయ తిరగేసి పలికినా
కవిగా మలచిన నామం
రాళ్లు నీళ్లపై చీల్చిన నామం
రక్కసి గుండెల శూల..మ్మ్

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

చరణం::2

వేయి జపాల కోటి తపస్సుల
విలువ..ఒక్కనామం..మ్మ్
నిండుగ దండిగ వరములొసంగే
రెండక్షరముల..నామం
ఎక్కడ రాముని భజన జరుగునో
అక్కడ హనుమకు స్థానం
చల్లని నామం మ్రోగే చోట
చెల్లదు..మాయాజాలం
రామ..రామ..రామ..సీతా
రామ..రామ..రామ..రామ 
రామ..రామ..రామ..సీతా
రామ..రామ..రామ..రామ

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం..మ్మ్
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం..మ్మ్


పల్లవి::
శ్రీయుతమౌ శ్రీరామ పాదం
శ్రీతజన మందారం
పావనమీ రఘురామ పాదం
పాపవినాశకరం
కలుషమ్ముల ప్రక్షాళన చేసే
గంగ చలించిన పాదం
అసురమదమ్మును పాతాళానికి
అణచివేసిన పాదం
రాతిని నాతిని చేసిన పాదం
అడవికి అందం పోసిన పాదం
నీ చరణమ్మే శరణమ్మనగా
ఇచ్చును పెన్నిధానం॥

చరణం::1

అవలీలగ జలధిని దాటిన మేటి
పవనకుమారుడు పట్టే పాదం
బ్రహ్మేంద్రాదులు కొలిచే పాదం
పరబ్రహ్మ పదానికి మూలం
తాను ధరించిన పాదుకలకు
దర పట్టము కట్టిన పాదం
తమ్ముడు భరతుని తరతరాలకు

ధన్యుని చేసిన పాదం..మ్మ్