Monday, March 23, 2015

రాక్షసుడు--1991





















సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంత తుళ్లింతలై
వాటేసుకున్నంతలై
జపించి నీ పేరే నే తపించిపోతున్నా 
తెలుసా హే పురుషోత్తమా
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా

చరణం::1

వయసే నడినెత్తికెక్కింది ఈ పూట 
పైటే చలిపుట్టి జారిందయ్యో
వలపే కుడికన్ను కొట్టింది రమ్మంటా
పెదవే తడిచేసుకుందామమ్మో
ఒదిగీ ఒకటైతే ఒకటే గొడవైతే 
ఇంకా ప్రేమకథా ముదిరేనయ్యా

పసుపు చెక్కిళ్లో ఎరుపు దుమారం
చిలిపి చూపులకే వణికే వయ్యారం
పగలే కోరికలు పడుచు అల్లికలు
ముదిరి ముదిరి మనువు కుదిరి
మనసు మనసు కలిసిన సిరిలో 
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంతతుళ్లింతలై..వాటేసుకున్నంతలై

జపించి నీ పేరే నే తపించిపోతున్నా
తెలుసా హే పురుషోత్తమా
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా

చరణం::2

ఎండా వానల్లో నీళ్లాడే అందాలు  
ఎదలో చప్పట్లే వేసేనమ్మా
మసక చీకట్లో చిగురేసే పరువాలు 
మతినే పోగొడితే ఎట్టాగయ్యో
నిదరే కరువైతే కలలే బరువైతే 
వయసు గుప్పిళ్లే తెరవాలమ్మో

సొగసు తోటల్లో పడుచు వయారం  
వడిసి పట్టగనే ఎంత సుతారం
అడిగే కానుకలు కరిగే కాటుకలు 
చిలిపి చిలిపి వలపు లిపిని  
కలికి చిలుక గిలికిన సడిలో

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా 
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంతతుళ్లింతలై..వాటేసుకున్నంతలై

జపించి నీ పేరే నే తపించిపోతున్నా
తెలుసా హే పురుషోత్తమా
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా 
కసిగా కసికసిగా కవ్వింతగా

రాక్షసుడు--1991


సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్
నీ ప్రేమలేఖ నేనందుకున్నా..ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి

నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ
నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ

చరణం::1

ప్రేమల్లో అ ఆ లు..సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు..సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
హే..ప్రేమల్లో అ ఆ లు..సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు..సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను

వరించి వస్తున్నా..వయ్యారమింక
తపించిపోతున్నా చెలాకి పిల్లా
కలగా మెరిసి కథలే తెలిసి సొదలే విరిసే

నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ
నీ ప్రేమలేఖ నేనందుకున్నా..ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి
హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్
హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్

చరణం::2

కళ్ళల్లో నాట్యాలు గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పత్యాలు బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు
కళ్ళల్లో నాట్యాలు గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పత్యాలు బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు

వయస్సు నీతోనే వసంతమాడే
సుగంధరాగాల ఉగాది నేడే
ఎదలో మెదిలే సొదలే కథలే ముదిరి మనసే కుదిరే

హెయ్ నాటీ లవ్ బాయ్..ఐ లవ్ యూ బేబీ
నీ ప్రేమలేఖ నేనందుకున్నా..ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి
హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్
నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ

కొండవీటి సింహం--1981


సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల  

పల్లవి:: 

పిల్ల ఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది 
దానికెట్టా పంపేది గుట్టు కబురు దానికెట్టా తెలిపేది గుండే గుబులు 
పూతపట్టి కూతకొచ్చె పిట్ట వగలు 

హోయ్..వేటాగాడు పేటాకంతా నీటుగాడు వాటమైన వన్నెకాడు 
వాడికెట్టా పంపేది గాలి కబురు పంపలేక వేగింది 
చింత చిగురు పాడు ఈడు గోడదిగే పట్టపగలు 
పిల్లఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది 

చరణం::1

నిబ్బరంగ ఉన్నాది కన్నె చుక్క 
ఉబ్బరాల మీదుంది జున్ను ముక్క 
నిబ్బరంగ ఉన్నాది కన్నె చుక్క
ఉబ్బరాల మీదుంది జున్ను ముక్క 
దాన్ని చూసి..దాని సోకు చూసి 
దాన్ని చూసి..దాని సోకు చూసి 
చిటుకుమంటు కొట్టుకుంది చిలిపి కన్ను 
చిటుకుమంటు కొట్టుకుంది చిలిపి కన్ను 
పుటక దాటి పట్టుకుంది వలపు నన్ను..అర్రర్రే 

ఒంటిగున్న ఒంటిబాధ ఓపలేను..అయ్యో 
ఓపరాల ఈడునింక ఆపలేను 
ఒంటిగున్న ఒంటిబాధ ఓపలేను..ఆహ 
ఓపరాల ఈడునింక ఆపలేను 
వాడికెట్ట చెప్పేది ఒంటి గుట్టు వాడికెట్ట చెప్పేది ఒంటి గుట్టు 
ఎట్ట నేను ఆపేది ఇంత పట్టు 

పిల్లఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది 
వేటాగాడు పేటాకంతా నీటుగాడు వాటమైన వన్నెకాడు 

జంట లేని ఇంటి పట్టునుండలేను..అయ్యో 
కొంటె టేనే తీపరాలు టాపలేను..పాపం 
జంటా లేని ఇంటి పట్టునుండలేను..అహా
కొటె టేనే తీపరాలు టాపలేను..చొచ్చో 
డికెట్ట సెప్పేది గుండె గుట్టు  
వాడికెట్ట సెప్పేది గుండె గుట్టు
ఏట్టా నాకు తప్పేది గుట్టుమట్టు

చరణం::2 

చెంప గిల్లి పోతాది వాడి చూపు
చెమ్మగిల్లి పోతాది వేడి నాకు 
చెంప గిల్లి పోతాది వాడి చూపు
చెమ్మగిల్లి పోతాది వేడి నాకు 
వాడ్ని చూసి..వాడి రాక చూసి 
వాడ్ని చూసి..వాడి రాక చూసి 
లటుకుమంటు కొట్టుకొంది చిలక ముక్కు 
లటుకుమంటు కొట్టుకొంది చిలక ముక్కు 
పండు దోచుకోనులేదు నాకు దిక్కు 

గొగ్గిలాల గుమ్మసోకు సూడకుంటే అగ్గిలాంటి ఈడు నాకు భగ్గుమంటే 
గొగ్గిలాల గుమ్మసోకు సూడకుంటే అగ్గిలాంటి ఈడు నాకు భగ్గుమంటే 
దానికెట్టా సెప్పేది లోని గుట్టు  
దానికెట్టా సెప్పేది లోని గుట్టు..ఎట్టా నాకు దక్కేది తేనెపట్టు 

హోయ్..వేటాగాడు పేటాకంతా నీటుగాడు వాటమైన వన్నెకాడు 
వాడికెట్టా పంపేది గాలి కబురు పంపలేక వేగింది 
చింత చిగురు పాడు ఈడు గోడదిగే పట్టపగలు 
పిల్లఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది 
దానికెట్టా పంపేది గుట్టు కబురు దానికెట్టా తెలిపేది గుండే గుబులు 
పూతపట్టి కూతకొచ్చె పిట్ట వగలు

అమెరికా అమ్మాయి--1976

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5512
సంగీతం::G.K.వెంకటేశ్
రచన::ఆరుద్ర 
గానం::S.P.బాలు,S.జానకి  

పల్లవి:: 

ఓ టెల్ మి..టెల్ మి..టెల్ మి..వాట్
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి..అఫ్ కోస్
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్..కమాన్ 

ఓ..టెల్ మి..టెల్ మి..టెల్ మి..అస్క్ మి బేబీ
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి..  సర్టె న్లీ స్వీట్ హార్ట్
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్

చరణం::1

చాటు చేయ వద్దు నీ అందాలు..వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు
చాటు చేయ వద్దు నీ అందాలు..వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు  
చేయి చేయి కలుపు..నీ హయి ఏమొ తెలుపు
నీ మానసంతా..నా మీదే నిలుపు
కలసి చిందు లేద్దా౦..కవ్వించి నవ్వుకుందా౦
ఈ రేయి మనం..ఒళ్ళు మరచిపోదాం

ఓ టెల్ మి..టెల్ మి..టెల్ మి..ఊహు
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి..నో
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్  బేబి..కమాన్

చరణం::2

వేయలేవు గాలికేమొ సంకేళ్ళు..ఆపలేవు పడుచుదనం పరువళ్ళు 
వేయలేవు గాలికేమొ సంకేళ్ళు..ఆపలేవు పడుచుదనం పరువళ్ళు 
ఈ సిగ్గు నీకు వాద్దు..అహ లేదు మనకు హద్దు
ప్రతి వలపు జంట..లోకానికి ముద్దు
ఈ వయసు మరల రాదు..ఈ సుఖము తప్పుకాదు
ఈ సరదాలకు సరిసాటే లేదు

ఓ..టెల్ మి..టెల్ మి..టెల్ మి
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి..విత్ ప్లెషర్
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్..కమాన్

ఓ..టెల్ మి..టెల్ మి..టెల్ మి
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి 
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్..కమాన్