Thursday, November 26, 2009

చీకటి వెలుగులు--1975


ఇక్కడ పాట వినండి




సంగీతం::చక్రవర్తి
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::S.P.బాలు,P.సుశీల


చీకటి వెలుగుల కౌగిటిలో..చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో..చిందే కుంకుమ వన్నెలూ
ఏకమైనా హృదయాలలో..ఏకమైనా హృదయాలలో ..
పాకే బంగరు రంగులూ

ఈ మెడ చుట్టూ గులాబీలూ..ఈ సిగపాయల మందారాలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ..ఈ సిగపాయల మందారాలూ

ఎక్కడివీ రాగాలూ..చిక్కని ఈ అరుణ రాగాలు
అందీ అందని సత్యాలా..సుందర మధుర స్వప్నాలా !

తేట నీటి ఈ ఏటి ఒడ్డునా..నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా..నాటిన పువ్వుల తోటా
నిండు కడవలా నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ
ప్రతి తీగకు చేయూత నిచ్చీ
ప్రతి మానూ పులకింపజేసీ

మనమే పెంచిందీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా
మనమే పెంచిందీ తోటా..మరి ఎన్నడు వాడనిదీ తోటా

మరచిపోకుమా తోటమాలీ..పొరపడి అయినా మతిమాలీ
మరచిపోకుమా తోటమాలీ..పొరపడి అయినా మతిమాలీ

ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో

మల్లెలతో వసంతం
చేమంతులతో హేమంతం
వెన్నల పారిజాతాలూ
వానకారు సంపెంగలూ

అన్నీ మనకు చుట్టాలే
వచ్చీ పోయే అతిధులే

ఈ మెడ చుట్టూ గులాబీలూ..ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ..చిక్కని ఈ అరుణ రాగాలూ

ష్ .....
గలగలమనకూడదూ..ఆకులలో గాలీ
గలగలమనరాదూ..అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ ..
నిదరోయే కొలను నీరూ..కదపకూడదూ
ఒరిగుండే పూలతీగా..ఊపరాదూ

కొమ్మపై నిట జంటపూలూ
గూటిలో ఇట రెండు గువ్వలూ

ఈ మెడ చుట్టూ గులాబీలూ..ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ..చిక్కని ఈ అరుణ రాగాలూ
మరచిపోకుమా తోటమాలీ..పొరపడి అయినా మతిమాలీ !

స్నేహ బంధం--1973



















ఈ పాట ఇక్కడ వినవచ్చు

సంగీతం::సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల,జి ఆనంద్ 

తారాగణం::కృష్ణ,జమున,కృష్ణం రాజు,గుమ్మడి,రమాప్రభ,రాజబాబు,సత్యనారాయణ 



స్నేహబంధమూ ఎంతమధురమూ
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతమూ

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో
ఒకటే దొరుకుతుంది జీవితంలో
అది ఓడిపోదు వాడిపోదు కష్టసుఖాల్లో

స్నేహబంధమూ ఎంత మధురమూ
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

మల్లెపూవు నల్లగ మాయవచ్చును
మంచు కూడ వేడి సెగలు ఎగయవచ్చును
పువ్వు బట్టి తెనె రుచె మారవచ్చును
చెక్కుచెదరందె స్నేహమని నమ్మవచ్చును

స్నేహబంధమూ ఎంత మధురమూ
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

సంపూర్ణ రామాయణం--1973::యదుకుల కాంభోజి::రాగం






సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు
గానం::ఘంటసాల


రాగం:::యదుకుల కాంభోజి
పహడి..హిందుస్తానీ రాగం)


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: 


రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ్య తండ్రి 


రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ్య తండ్రి

చరణం::1


తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిసావంట
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిసావంట
పరశురాముడంతవోణ్ణి పార తరిమినావంట
ఆ కతలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట

రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ్య తండ్రి


చరణం::2

ఆగు బాబు ఆగు
అయ్యా నే వస్తుండా బాబూ నే వస్తుండా 

అయ్యా నే వస్తుండా బాబూ నే వస్తుండా
నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట
మాకు తెలుసులే
నా నావ మీద కాలు బెడితే ఏమౌతాదో తంటా 

నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట
నా నావ మీద కాలు బెడితే ఏమౌతాదో తంటా
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణమూర్తివంట

రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ్య తండ్రి


చరణం::3

అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే

అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే
నువ్వు దాటలేక కాదులే తామయ్య తండ్రి 

నువ్వు దాటలేక కాదులే తామయ్య తండ్రి
నన్ను దయచూడగ వచ్చావూ రామయ్య తండ్రి

హైలేస్సా....రేలో హైలేస్సా
హైలేస్సా....రేలో హైలేస్సా
హైలేస్సా....రేలో హైలేస్సా
హైలేస్సా....రేలో హైలేస్సా

హైలేస్సా....రేలో హైలేస్సా
హైలేస్సా....రేలో హైలేస్సా


teepi gnapakaalu


















:((((( జయ....విజయ... వీరిద్దరు నాకు చాలా close friends

వీళ్ళతో నేను చేసిన enjoy అంతా ఇంతా కాదు .

మేము మోత్తం నలుగురం (Friends) కవిత,నేను,విజయ,జయశ్రీ.

కలిసి shopping చేసేవాళ్ళం ,కలిసే films చూసేవాళ్ళం,

ఒక్కటేమిటి అన్నిట్లో నలుగురం వుండే వాళ్ళం.

కాని....ఇవాళ..జయ,విజయలు, నాకింక లేరు :((

వారి తీపి గురుతులుతప్ప:((((

నన్ను , కవితను , వదిలి , ఇద్దరు , దేవుడి దగ్గర వెళ్ళిపోయారు.

స్నేహానికి నిదర్సనం మేమేనేమో అనిపించెలా వుండేవాళ్ళం.

వారి గుర్తుగా ఇందులో వారి photo వేస్తున్నాను .

నా friends, మరియు జయ,విజయ కు తెలిసిన వారు వీరిద్దర్ని

గుర్తుంచుకొవాలని అప్పుడప్పుడు వీరి photo చుసైన వీరిని

మరువకూడదని ఆశిస్తు.....మీ....శక్తి :((