Wednesday, June 29, 2011

శివమెత్తినసత్యం--1980





సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు


నిన్న మొన్నటి చిన్నారివే
చిన్నారి పలుకుల చెల్లమ్మవే
నిన్న మొన్నటి చిన్నారివే
చిన్నారి పలుకుల చెల్లమ్మవే
నిన్న మొన్నటి చిన్నారివే

ఆఆఆఆఆ
ఈ పెళ్ళిచూపుతో..ఈ చీరకట్టుతో
ఈ పెళ్ళిచూపుతో..చీరకట్టుతో
ఎంత ఎదిగినవే...ఏ...

నిన్న మొన్నటి చిన్నారివే
చిన్నారి పలుకుల చెల్లమ్మవే
నిన్న మొన్నటి చిన్నారివే

పెళ్ళీడు వచ్చింది అమ్మాయికీ
పిల్లాణ్ణి చూడరా నీ చెల్లికీ
అని పెద్దోళ్ళు పదిసార్లు అన్నారనీ
ఉబలాట పడ్డాను చూస్తామనీ
ఈ ముస్తాబులో..ఆ నగుమోములో
ఈ ముస్తాబులో..ఆ నగుమోములో
చూసాను చెల్లీ..మన తల్లినీ

నిన్న మొన్నటి చిన్నారివే
చిన్నారి పలుకుల చెల్లమ్మవే
నిన్న మొన్నటి చిన్నారివే

ఒకరికి ఒకరం..ఇక ఎవరికి ఎవరం
ఓపనిదైనా..తప్పని దూరం
ఒకరికి ఒకరం..ఇక ఎవరికి ఎవరం
ఓపనిదైనా..తప్పని దూరం
ఏ ఆడపిల్లా..కానీడుపిల్లా
ఏనాటికైనా..అది ఆడపిల్లా
చేసానమ్మా..ఆ..చేసానమ్మా
నే చేయగలది..ఈ ఇంటి పేరింక
ఆ ఇంట పెరగాలీ..

నిన్న మొన్నటి చిన్నారివే
చిన్నారి పలుకుల చెల్లమ్మవే
నిన్న మొన్నటి చిన్నారివే

శివమెత్తినసత్యం--1980



సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆరుద్ర
గానం::K.J.ఏసుదాస్,వాణీజయరాం


గీతా..ఓ..గీతా..డార్లింగ్..మై డార్లింగ్
మనసార నీతో..ఓ..ఓ..ఓ..మాటాడుకోనీ
మనసార నీతో..ఓ..ఓ..ఓ..మాటాడుకోనీ

రాజా..ఓ..రాజా..డార్లింగ్..మై డార్లింగ్
మనసార నీతో..ఓ..ఓ..ఓ..మాటాడుకోనీ
మనసార నీతో..ఓ..ఓ..ఓ..మాటాడుకోనీ

పరదేశంలో ఆవేశంలో..ప్రేమించిన మనకనుమతి
"బహుమతీ"
ఈ దేశంలో సంతోషంలో..మనువాడినచో అనుబంధం
"ఆనందం"
వెచ్చనీ వలపులా..ముచ్చట తీరునూ
అనురాగ బంధం..మ్మ్..ముడివేసుకోనీ
అనురాగ బంధం..మ్మ్..ముడివేసుకోనీ

రాజా...ఓ..రాజా..
డార్లింగ్...మై..దార్లింగ్...
మనసార నీతో..ఓ..ఓ..ఓ..మాటాడుకోనీ
మనసార నీతో..ఓ..ఓ..ఓ..మాటాడుకోనీ

చిరునవ్వులతోపులకింతలతో..వికసించిన ఒక మధువనం
"యవ్వనం"
ఈ భంగిమలో నీ పోంగులతో..మురిపించే బిగి కౌగిలీ
"జిలిబిలీ"
ఊహలే రేగితే..మోహమే ఆగునా..ఆ..ఆ..ఆ..
ఒడిలోన నన్నూ..ఊ..వొదిగొదిగిపోనీ..
ఒడిలోన నన్నూ..ఊ..వొదిగొదిగిపోనీ..

గీతా..ఓ..గీతా..డార్లింగ్..మై డార్లింగ్
ఒడిలోన నన్నూ..ఊ..వొదిగొదిగిపోనీ..
ఒడిలోన నన్నూ..ఊ..వొదిగొదిగిపోనీ..

శివమెత్తినసత్యం--1980




సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆరుద్ర
గానం::k.j.ఏసుదాస్,వాణిజయరాం

నీవు నాపక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా
ఎన్నో..ఎన్నో..ఎన్నో..కిరణాలు మెరిసాయి

నీవు నాపక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా..
ఎన్నో..ఎన్నో..ఎన్నో..కిరణాలు మెరిసాయి
నీవు నాపక్కనుంటే హా...యీ

కొండలలో కోనలలో ఏకాంతవేళ
గుండెలలో రేగింది సరసాల లీల
కొండలలో కోనలలో ఏకాంతవేళ
గుండెలలో రేగింది సరసాల లీల
అనురాగ శిఖరాన అందాల తోట
అనురాగ శిఖరాన అందాల తోట
ఆ చోట కోనేట సయ్యటలాడాలీ..

నీవు నాపక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా..
ఎన్నో..ఎన్నో..ఎన్నో..కిరణాలు మెరిసాయి
నీవు నాపక్కనుంటే హా...యీ

కొనగోట మీటిన మాణిక్య వీణ
కొసరే మమతల తొలకరి వాన..ఆ..ఆ..
కొనగోట మీటిన మాణిక్య వీణ
కొసరే మమతల తొలకరి వాన
కన్ను సైగల కౌగిలింతల సన్నజాజి తావీ

ఎన్ని మారులు నిన్ను చూసినా దేవ రంభ ఠీవీ
మువ్వల రవళీ మోహన మురళీ..ఈ..
మువ్వల రవళీ మోహన మురళీ
మధురం మధురం మానస కేళీ..ఈ..ఈ..

నీవు నాపక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా..
ఎన్నో..ఎన్నో..ఎన్నో..కిరణాలు మెరిసాయి
నీవు నాపక్కనుంటే హా...యీ..