Sunday, July 06, 2014

స్వర్ణ కమలం--1988



సంగీతం::ఇళయరాజ
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు,వాణిజయరాం 
తారాగణం::వేంకటేష్,భానుప్రియ,సుమలత. 

పల్లవి::

గురు బ్రహ్మః..గురు విష్ణుః..గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మః..ఆ..ఆ
గురు సాక్షాత్ పరబ్రహ్మః..ఆ..ఆ
తస్మై శ్రీ గురవే నమ:
ఓం నమో నమో నమశ్శివాయ
మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమశ్శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ
అందెల రవమిది పదములదా..ఆ..ఆ
అందెల రవమిది..పదములదా
అంబరమంటిన..హృదయముదా
అందెల రవమిది..పదములదా
అంబరమంటిన..హృదయముదా
సాగిన సాధన..సార్ధకమందగ
యోగ బలముగా..యాగ ఫలముగా
సాగిన సాధన..సార్ధకమందగ
యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై..మ్రోగు కదా
అందెల రవమిది పదములదా..ఆ..ఆ

చరణం::1

మువ్వలు ఉరుముల..సవ్వడులై
మెలికలు మెరుపుల..మెలకువలై
మువ్వలు ఉరుముల..సవ్వడులై
మెలికలు మెరుపుల..మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై..ఆ..ఆ 
వేణి విసురు వాయు వేగమై..ఆ..ఆ
అంగ భంగిమలు..గంగ పొంగులై
హావభావములు..నింగి రంగులై
లాస్యం సాగే లీల..రస ఝరులు జాలువారేలా
జంగమమై..జడమాడగా
జలపాత గీతముల..తోడుగా
పర్వతాలు..ప్రసవించిన 
పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా..ఆ..ఆ

చరణం::2 

నయన తేజమే..నకారమై
మనో నిశ్చయం..మకారమై
శ్వాస చలనమే..శికారమై
వాంచితార్ధమే..వకారమై
యోచన సకలము..యకారమై
నాదం..నకారం
మంత్రం..మకారం
స్తోత్రం..శికారం 
వేదం..వకారం
యజ్ఞం..యకారం 
భావమె భవునకు..భావ్యము కాగా
భరతమె నిరతము..భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా..తాండవమాడే వేళా
ప్రాణ పంచమమె పంచాక్షరిగా..పరమపధము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై..పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా..అంబరమంటిన హృదయముదా 
అమృత గానమిది పెదవులదా..అమితానందపు ఎద సడిదా 
అందెల రవమిది పదములదా..ఆ..ఆ

మనుషుల్లో దేవుడు--1974



సంగీతం::సాలూరు హనుమంతరావు,T. V.రాజు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::ఘంటసాల 
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,గుమ్మడి,B.సరోజాదేవి,కృష్ణంరాజు,విజయలలిత,అంజలిదేవి,

పల్లవి::

హల్లో మేడం..హల్లో మేడం 
హల్లో మేడం మిష్టర్ రావ్ ఇప్పుడె వచ్చారూ
నీ పుట్టిన రోజు పండుగవేళకు ఇదిగో వచ్చారూ..హల్లో మేడం  . 
హల్లో మేడం మిష్టర్ రావ్ ఇప్పుడె వచ్చారూ
నీ పుట్టిన రోజు పండుగవేళకు ఇదిగో వచ్చారూ
హల్లో మేడం..హల్లో మేడం 

 చరణం::1

మదరాసు నుండి మాస్కోదాకా డెన్మార్క్ నుండి న్యుయార్కుదాకా 
బెజవాడ నుండి బెర్లిందాకా పంజాబునుండి ప్యారిస్ దాకా  
దేశాలన్నీ తిరిగాను మోసాలెన్నో చూశాను 
దేశాలన్నీ తిరిగాను మోసాలెన్నో చూశాను 
జనరల్ నాలెడ్జిలో నేను డాక్టరేటు కొట్టేశాను
హల్లో మేడం..హల్లో మేడం 

చరణం::2

డబ్బులేకపోతే ఎవడు డుబ్బుకైన కొరగాడు
గడ్డి తినైన సంపాదిస్తే వాడే బహు మొనగాడు కాబట్టి
స్మగులింగుచేసి సాయంత్రానికి లక్షాధికారి కావచ్చు
దొంగనోట్లను అచ్చునగుద్ది కోటీశ్వరుడై కులుకొచ్చు 
స్మగులింగుచేసి సాయంత్రానికి లక్షాధికారి కావచ్చు
దొంగనోట్లను అచ్చునగుద్ది కోటీశ్వరుడై కులుకొచ్చు 
అసలు విషయం  అది గుట్టుగ మేనేజ్ చెయ్యకపోతే
డేంజరులో పడిపోవచ్చు హల్లో మేడం హల్లో మేడం 

చరణం::3

వేషాలు మార్చి మోసాలు చేయుట అలవాటైపోయిందీ
ఛెప్పేవన్నీ శ్రీరంగనీతులు ఛేసేవన్నీ తప్పుడు పనులు 
ఎన్నాళ్ళో ఇవి సాగవూ బైట పడకుండా మానవూ 
By the by here is your birth day gift
ఏమిటో తెలుసా  
రవ్వల గాజులు తెచ్చాను నీ రెండు చేతులకు తగిలిస్తాను
రవ్వల గాజులు తెచ్చాను రెండు చేతులకు తగిలిస్తాను
ఏమిటలా చూస్తావు ఎందుకలా బిత్తరపోతావు హల్లో మేడం