Thursday, November 03, 2011

వాడేవీడు--1973













సంగీతం::సత్యం
రచన::దేవులపల్లికృష్ణశాస్రీ
గానం::ఘంటసాల,P.సుశీల,S.జానకి
తారాగణం::N.T.R.,మంజుళ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,పండరీబాయ్,లీలారాణి.

పల్లవి::

నేటికి మళ్ళీ మా యింట్లో ఎంచక్కా పండుగా 
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా
తొలిదీపం వెలిగించిన...రోజు 
ఇలవేలుపు దిగివచ్చిన...రోజు
నేటికి మళ్ళీ మా యింట్లో ఎంచక్కా పండుగా 
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా

చరణం::1

ముంగిట్లో మందారం మురిసి మురిసి నవ్విందీ
ముంగిట్లో మందారం మురిసి మురిసి నవ్విందీ 
నట్టింట్లో యీ మోడు తిరిగి చిగురు తొడిగింది
నట్టింట్లో యీ మోడు తిరిగి చిగురు తొడిగింది 
నినుచూసి నన్ను చూసి...నినుచూసి 
నన్ను చూసి...మనభాగ్యం చూసిచూసి 
నేటికి మళ్ళీ మా యింట్లో ఎంచక్కా పండుగా 
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా 

చరణం::2

ఆఆఆఆఆఆఆఆఆఆ..ఆఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆ..ఆఆఆఆఆఆఆఆఆఆ
ఇన్నాళ్ళకు..కనుగొన్నాను కన్నతల్లి 
కారుణ్యం..మా చిన్నచెల్లి అనురాగం
యీ గుడిలో దివ్వెగనైనా యీ గూటిలో గువ్వగనైనా 
ఇల్లువిడిచి పోలేను..యీ వరం వదులుకోలేను 
నేటికి మళ్ళీ మా యింట్లో ఎంచక్కా పండుగా 
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా

అమాయకుడు--1968



చిమ్మట ఖజానా లో ని ఈ పాట ఇక్కడ వినండి
రచన::D.C. నారాయణ రెడ్డి
సంగీతం::B. శంకర్
గానం::ఘంటసాల, P.సుశీల


Film Directed By::Addala NarayanaRao
తారాగణం::కృష్ణ,జమున,గుమ్మడి,జి.వరలక్ష్మి,విజయలలిత,ముక్కామల


ఆమె::చందమామ రమ్మంది చూడు చల్లగాలి రమ్మంది నేడు
ఆ పైన ఇంక ఆ పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు

అతడు::చందమామ బాగుంది నేడు చల్లగాలి బాగుంది నేడు
ఏముంది ఇంక ఏముంది అది ఇంతే కదా ఏ నాడు
చందమామ బాగుంది నేడు

ఆమె::పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు
తెలుసుకోలేవు నీవు పలకగాలేను నేను
చందమామ రమ్మంది చూడు

అతడు::పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు
నీది నా దారి కాదు నాది నీ దారి కాదు
చందమామ బాగుంది నేడు

ఆమె::చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
ఆమె::చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు

అతడు::చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు
ఆమె::అడవి మనిషివి నీవు
అతడు::ఆమాటె తగదన్నాను

ఆమె::చందమామ రమ్మంది చూడు చల్లగాలి రమ్మంది నేడు
ఆ పైన ఇంక ఆ పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు
చందమామ రమ్మంది చూడు

అమాయకుడు--1968



సంగీతం::B.శంకర్
రచన::దేవులపల్లి
గానం::ఘంటసాల

Film Directed By::Addala NarayanaRao
తారాగణం::కృష్ణ,జమున,గుమ్మడి,జి.వరలక్ష్మి,విజయలలిత,ముక్కామల

పల్లవి::

మనిషైతే..మనసుంటే..
మనిషైతే మనసుంటే..కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా..కురిసి జగతి నిండాలిరా

చరణం::1

ఆగి ఆగి సాగి పోరా..సాగిపోతూ చూడరా..ఆ..
ఆగి ఆగి సాగి పోరా..సాగిపోతూ చూడరా..ఆ..
వేగిపోయే ఎన్నెన్ని బ్రతుకులో..వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో
వేచి ఉన్నాయిరా..

మనిషైతే మనసుంటే
మనిషైతే మనసుంటే..కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా..కురిసి జగతి నిండాలిరా

చరణం::2

తూలిపోతు నీలి మేఘం..జాలి జాలిగ కరిగెరా
తూలిపోతు నీలి మేఘం..జాలి జాలిగ కరిగెరా
కేలు చాపి ఆ దైవమే తన..కేలు చాపి ఆకాశమే
ఈ నేల పై ఒరిగెరా

మనిషైతే..మనసుంటే
మనసుంటే వైకుంఠమే ఒరుగురా
నీకోసమే కరుగురా..
నీకోసమే కరుగురా..
నీకోసమే కరుగురా..