Monday, April 30, 2012

శ్రీ శ్రీ గారి జన్మదిన స్మృత్యర్ధం:





































































శ్రీ శ్రీ గారి జన్మదిన స్మృత్యర్ధం:

"మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం" అని ఎలుగెత్తి చాటిన మాహాకవి శ్రీశ్రీ ఏప్రిల్ 30న, 1910లో విశాఖపట్నంలో జన్మించారు.

1931 లో బి ఏ. పూర్తిచేసిన శ్రీశ్రీ, ఏ.వి.యన్. కాలేజీలో డెమాన్స్ట్రేటర్ గా, మద్రాసు ఆంధ్రప్రభలో లేబరేటరీ అసిస్టెంట్ గా వివిధ ఉద్యోగాలు చేసినా, తన స్వంత భావాల కారణంగా దేనిలోనూ ఇమడలేక 'సినీరంగం'లో స్థిరపడ్డారు.

తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ "మహాప్రస్థానం" 1950లో పుస్తక రూపం ధరించింది. 1955లో అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నారు.

ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా 'ఖడ్గసృష్టి' కావ్యానికి 1966లో సోవియెట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు.

తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన మాహాకవి శ్రీశ్రీ జూన్ 15, 1983లో మహా ప్రస్తానమొందారు