సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::K.Raghavendra Rao
Cast::Chandramohan,Sreedevi,Mohanbabu,Nirmalamma
:::::::::::::::::
పంట చేలో పాలకంకి నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేత పచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
::::1
శివ గంగ తిరణాళ్ళలో
నెలవంక తానాలు చెయ్యాలా
చిలకమ్మ పిడికళ్లతో
గొరవంక గుడి గంట కొట్టాలా
నువ్వు కంటి సైగ చెయ్యాలా
నే కొండ పిండికొట్టాలా
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
ఓహోహోయ్
::::2
గోదారి పరవళ్ళలో
మా పైరు బంగారు పండాలా
ఈ కుప్ప నూర్పిళ్ళకూ
మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా
నీ మాట బాట కావాల
నా పాట ఊరు దాటాల
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
ఆ పొద్దులో మా పల్లే నిద్దుర లేవాలా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాలకంకి నవ్విందీ..అహహా..
పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ..అహహా..
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా..ఓహోహోయ్
లేత పచ్చ కోనసీమ ఎండల్లా..అహాహ్హా..
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే