ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ రసమయం జగతి
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ రసమయం జగతి
చరణం::1
నీ ప్రణయ భావం నా జీవ రాగం నీ ప్రణయ భావం.. నా జీవ రాగం రాగాలూ తెలిపే భావాలూ నిజమైనవి లోకాలూ మురిసే స్నేహాలు రుజువైనవి అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ రసమయం జగతి
చరణం::2
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నా పేద హృదయం.. నీ ప్రేమ నిలయం.. నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది నీవన్న మనిషే ఈనాడు నాదైనది ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
సంగీత::P.భానుమతి,సత్యం రచన::దాశరథి గానం::P.భానుమతి తారాగణం::కృష్ణ,P.భానుమతి,నాగభూషణం,కృష్ణంరాజు, నాగయ్య,సూర్యకాంతం పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీవేరా...నా మదిలో నీవేరా..నా మదిలో..దేవా తిరుమలవాసా..ఓ శ్రీనివాసా నీ పద దాసిని..నే నే రా..ఆ నీవేరా..నా మదిలో..దేవా తిరుమలవాసా..ఓ శ్రీనివాసా నీ పదదాసిని..నే నే రా..ఆ నీవేరా నా మదిలో..నీవేరా నా మదిలో చరణం::1 యెంతో మధురం...నీ శుభనామం జగతికి దీపం...నీ దివ్యరూపం యెంతో మధురం...నీ శుభనామం జగతికి దీపం...నీ దివ్యరూపం ఆశలపూలే...దోసిట నింపే వేచే భాగ్యము...నాదే వేచే భాగ్యము..నాదేరా..ఆ నీవేరా నా మదిలో..నీవేరా నా మదిలో గమ ప ప గమ ద ద గమ నీ నీ నీ ఆ ఆ ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ చరణం::2 నీ మెడలోన...కాంతులు చిందే కాంచన హారము...కాలేను నేను నీ మెడలోన...కాంతులు చిందే కాంచన హారము...కాలేను నేను నీ పదములపై...వాలిన సుమమై నిలిచే భాగ్యము...నాదే నిలిచే భాగ్యము..నాదేరా..ఆ నీవేరా నా మదిలో..నీవేరా నా మదిలో గమ ప ప గమ ద ద గమ నీ నీ నీ ఆ ఆ ఆ ఆ ఆ హా హా ఆ ఆ ఆ ఆ చరణం::3 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా నా జీవితమే...హారతి చేసి నీ గుడి వాకిట..నిలిచాను స్వామీ నా జీవతమే...హారతి చేసి నీ గుడి వాకిట..నిలిచాను స్వామీ నీ సన్నిథియే...నా పెన్నిధిగా మురిసే భాగ్యము...నాదే మురిసే భాగ్యము..నాదేరా..ఆ నీవేరా నా మదిలో...దేవా తిరుమలవాసా..ఓ శ్రీనివాసా నీ పద దాసిని..నేనేరా..ఆ నీవేరా నా మదిలో..నీవేరా నా మదిలో
సంగీత::S.P.కోదండపాణి రచన::దాశరథి గానం::P.సుశీల,S.P.బాలు తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,రాజబాబు,శారద,అంజలీదేవి, రమాప్రభ పల్లవి:: ఓ మనసు దోచిన చెలికాడా..మమత పెంచిన చినవాడా ఎన్నిజన్మల పుణ్యఫలమో..నిన్ను నన్నూ కలిపెలే ఓ చిలిపి నవ్యుల చిలకమ్మా..వన్నె చిన్నెల చిన్నమ్మా నీకు నాప్తె ఇంతప్రేమ..ఎందుకోసమొ చెప్పవా చరణం::1 చందమామ చెలిమి కోరును..కలువభామ ఎందుకోసం గోరువంకను రామచిలకా..కోరుకుందీ ఎందుకోసం చందమామ చెలిమి కోరును..కలువభామ ఎందుకోసం గోరువంకను రామచిలకా..కోరుకుందీ ఎందుకోసం మనలోని అనురాగం..పెనవేసింది అందుకే ఓ మనసుదోచిన చెలికాడా..మమత పెంచిన చినవాడా ఎన్నిజన్మల పుణ్యఫలమో..నిన్ను నన్నూ కలిపెలే చరణం::2 వలపుకోరీ కన్నవారికి..దూరమైన చిన్నదానా నీవు నన్ను వలచినపుడే..జీవితంలో పూలవాన నీ మనసే నాదైతే నీ మనసే నాదైతే..లేనిది ఎదీ లేదులే ఓ చిలిపినవ్యుల చిలకమ్మా..వన్నె చిన్నెల చిన్నమ్మా ఎన్నిజన్మల పుణ్యఫలమో..నిన్ను నన్నూ కలిపెలే ఆ ఆ ఆ ఆ ఆహా..ఓ ఓ ఓ ఓ మ్మ్ మ్మ్ మ్మ్
సంగీత::S.P.కోదండపాణి రచన::కొసరాజు రాఘవయ్య గానం::P.సుశీల,S.P.బాలు,నవకాంత్,కౌసల్య తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,రాజబాబు,శారద,అంజలీదేవి, రమాప్రభ పల్లవి:: చేయి కలిపి మనసు నిలిపీ చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా చేయి కలిపి మనసు..నిలిపీ చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా చరణం::1 చెమటదీసీ వళ్ళు వంచీ..చాకిరి చెయ్యాలిరా వీటుబోయిన బీటినేలను..పాటుకు తేవాలిరా కన్నతల్లిగా కల్పవల్లిగా..కన్నతల్లిగా కల్పవల్లిగా ఏ ప్రొద్దు భూమాత..వెన్నాని నిలవాలిరా హేయ్...చేయి కలిపి మనసు నిలిపీ చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా
చరణం::2 ఇంటి ఇల్లాలు జంటగా వుండి..వెంట రావాలిరా కంటి సైగతో గట్టుపై నుండి..కలకల నవ్వాలిరా పచ్చపచ్చగా ప్రజలు మెచ్చగా..పచ్చపచ్చగా ప్రజలు మెచ్చగా సంసారం ముందడుగు..వెయ్యాలిరా చేయి కలిపి మనసు..నిలిపీ చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా చరణం::3 మనిషిని నమ్మితే..ఫలితం లేదురా మట్టిని నమ్మాలిరా..కడవల పాలూ కమ్మగ పిండే గోవును..నమ్మాలిరా కరువు తీరగా..ఆశలూరగా కరువు తీరగా..ఆశలూరగా సరదాగ మన బ్రతుకు..జరిగేనురా చేయి కలిపి మనసు..నిలిపీ చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా ఓహో..ఓహో..ఓహో..హో..ఓహోహో..ఓఓఓ..ఓహోహో