Thursday, March 14, 2013

గురు--1980

సంగీతం::ఇళయరాజ
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.జానకి
తారాగణం::కమల్‌హాసన్,శ్రీదేవి,సత్యనారాయణ,జయమాలిని,మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి

పల్లవి::

నా వందనము సరసుల రసికుల సదసుకు..ఊ 
నా వందనము సరసుల రసికుల సదసుకు 
నా పాట మీరు..మెచ్చేందుకు
మీ దీవెనలను..ఇచ్చేందుకు 
శుభము అందరుకు..ఊ ఊ ఊ 
నా వందనము సరసుల రసికుల సదసుకు..ఊ

చరణం::1

తేట తేనియ తెలుగుంది 
తీయ తీయని తలపుంది
తేట తేనియ తెలుగుంది 
తీయ తీయని తలపుంది
రాగం ఉందీ..ఈ ఈ ఈ
నాలో వేదం ఉంది.ఈ..లలలా
మాటే పాటై..పాటే ఆటై
నీకు తానులోకం ఎదుటనాట్యమాడనా ప్రియా
నా వందనము సరసుల రసికుల సదసుకు..ఊ

చరణం::2

లలలా..హోయ్ హోయ్ హోయ్
లలలా..హోయ్ హోయ్ హోయ్
లలలా..లలలా..లా

పాడమన్నది..అనురాగం
ఆడమన్నది..ఆనందం
పాడమన్నది..అనురాగం
ఆడమన్నది..ఆనందం
అందాలన్నీ..నీకే ఇవ్వాలనీ
లలలా..లలలా
దాచి దాచి..వేచే నన్ను 
వేల చూసి వేగ వచ్చేస్తే వరించనా ప్రియా 
నా వందనము సరసుల రసికుల సదసుకు 
నా పాట మీరు..మెచ్చేందుకు
మీ దీవెనలను..ఇచ్చేందుకు 
శుభము..అందరుకు..ఊ
నా వందనము సరసుల రసికుల సదసుకు 

జీవితరంగము--1974

సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::రాజశ్రీ 
గానం::P.సుశీల 
తారాగణం::గుమ్మడి,చంద్రమోహన్,ఎస్.వి.రంగారావు,సావిత్రి,ప్రమీల,రమాప్రభ,జయసుధ

పల్లవి::

యీ నాటి నా పాట నీకు అంకితం..అందించావూ మాకు కొత్త జీవితం   
యీ నాటి నా పాట నీకు అంకితం..అందించావూ మాకు కొత్త జీవితం   

కని పెంచిన వారి కన్న మిన్నగా..మా కలలన్నీ తీర్చావు నిండుగా..ఆ  
కనిపించే దైవానివి నీవూ..కనిపించని త్యాగానివి నీవూ..ఆ        
యీ నాటి నా పాట నీకు అంకితం..అందించావూ మాకు కొత్త జీవితం   

చరణం::1

ఎందరికో నీడను తానిచ్చుటకూ..ఎండలోన చెట్టు మాడిపోతుంది
ఎందరికో నీడను తానిచ్చుటకూ..ఎండలోన చెట్టు మాడిపోతుంది
నలుగురికీ వెలుగును అందించుటకు..నిలువున క్రొవ్వొత్తి కరిగిపోతుంది           
నీడవు నీవై వెలుగువు నీవై..మా అందరినీ మునుముందుకు నడిపించావూ  
యీ నాటి నా పాట నీకు అంకితం..అందించావూ మాకు కొత్త జీవితం   

చరణం::2

మూడుముళ్ళు పడవలసిన వయసులో..తోడులేని బ్రతుకు గడుపుతున్నావూ   
మూడుముళ్ళు పడవలసిన వయసులో..తోడులేని బ్రతుకు గడుపుతున్నావూ   
తాడి పాడి తిరిగే యీ వేళలో..అంతులేని బాధ్యతలో మునిగావూ
నిద్దురలోన మెలుకువలోన..మా కోసమే నీవు కలలు కంటున్నావూ
మా కోసమే నీవు కలలు కంటున్నావూ           
యీ నాటి నా పాట నీకు అంకితం..అందించావూ మాకు కొత్త జీవితం   
యీ నాటి నా పాట నీకు అంకితం..అందించావూ మాకు కొత్త జీవితం