సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
పల్లవి::
వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
చరణం::1
చినుకు మీద చినుకు పడ్దదీ
చిన్నదాని సొగసు మీద మనసు పడ్డది
వణుకుతున్న వయసు చెడ్దదీ
చిన్నవాడి వలపు నన్ను కలుపుతున్నది
ఈ పులకరింత చూడబోతే చిటికెంత
ఆ జలదరింత చూడబోతె జన్మంతా
నాకు నువ్వెంతో..నీకు నేనంతా
నీకు వయసెంతో..నాకు మనసంతా
వరస కలసి జంట లాయనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే
అహ వరస కలసి జంట లాయనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే
వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
ఆఁవయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
చరణం::2
చినుకు ముల్లు గుచ్చుకున్నదీ
చిన్నదాని వలపు ఒళ్ళు విరుచుకున్నది
వానజల్లు వెచ్చకున్నదీ
చిన్నవాడి వయసు తేనె వెల్లువైనది
కురిసి వెలసిన వాన వరదంటా
మనసు కలసిన జంట వలపంటా
నీకు మెరుపెంతో..నాకు ఉరుమంతా
వయసు వయసంతా..వలపు గిలిసెంతా
వరస కలసి జంటలాయెనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే
వరస కలసి జంటలాయెనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే
వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
అర్రెరెర్రె వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే