Monday, May 21, 2007

రాజు వెడలె-1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::శోభన్ బాబు,జయసుధ,మురళీ మోహన్,జయప్రద,పండరీబాయి

పల్లవి::

తోడేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు 
సొగసులతో ఆ సొగసుల నిగనిగతో 
పరువంతో ఆ పరువం మిసమిసతో 
తోడేస్తున్నావు అబ్బా ప్రాణం తోడేస్తున్నావు
తొలిచేస్తున్నావు గుండెను తొలిచేస్తున్నావు 
చూపులతో ఆ చూపుల బాకులతో
నవ్వులతో ఆ నవ్వుల రవ్వలతో 
తొలిచేస్తున్నావు గుండెను తొలిచేస్తున్నావు

చరణం::1

మల్లెపువ్వులు అగరువత్తులు అబ్బ మతిపోగొట్టినవి
కమ్మని తావి చల్లని గాలి కలవరపెట్టినవి
నీలి నింగిలో నిండు జాబిలి నిప్పులు చెరిగింది
చల్లచల్లని వెన్నెల సూదుల జల్లే కురిసింది
నీలి నింగిలో నిండు జాబిలి నిప్పులు చెరిగింది
చల్లచల్లని వెన్నెల సూదుల జల్లే కురిసింది
అబ్బబ్బబ్బతోడేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు
తొలిచేస్తున్నావు గుండెను తొలిచేస్తున్నావు

చరణం::2

వయసు పొంకము వగల బింకము వదలొద్దని పిలిచింది 
గుండె విరిచి నిండుమగసిరి వుండలేనని వురికింది
పెదవీ పెదవీ తనువూ తనువూ ఒకటైపోవాలి
ఉదయం నుంచీ వుదయం వరకూ క్షణమే అనిపించాలి 
పెదవీ పెదవీ తనువూ తనువూ ఒకటైపోవాలి
ఉదయం నుంచీ వుదయం వరకూ క్షణమే అనిపించాలి 
అమ్మమ్మమ్మతొలిచేస్తున్నావు గుండెను తొలిచేస్తున్నావు
తోడేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు
చూపులతో ఆ చూపుల బాకులతో
సొగసులతో ఆ సొగసుల నిగనిగతో
తొలిచేస్తున్నావు గుండెను తొలిచేస్తున్నావు అబ్బ 
తొలిచేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు