http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9367
సంగీతం::చక్త్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి
Film Directed By::KodandaRaami Reddi
తారాగణం::చిరంజీవి,రాధ,కైకాల.సత్యనారాయణ,గుమ్మడి,శారద.
పల్లవి::
అది సరిగమ పాడిన స్వరవీణ
యిది సరసాలాడిన చలి వీణ
యిది చూపులు కలిసిన సుఖవీణ
యిది ముసి ముసి నవ్వుల ముఖ వీణ
ఝుమ్మని పలికిన ఎద వీణ
నను రమ్మని పిలిచిన రస వీణ
అది సరిగమ పాడిన స్వరవీణ
యిది సరసాలాడిన చలి వీణ
చరణం::1
ముట్టుకుంటే ముద్దువీణ
హత్తుకుంటే హాయి వీణ
పడుచుగుండే కు పల్లవి తానై
పడతి నడకకు చరణం తానై
జాణలో వీనలే..జావళీ పాడనీ
చందమామ మీద వాలి సన్నజాజి తేనే తాగి
హత్తుకు పోయే వేళా..నా మత్తులు పెరిగే వేళల్లో
వీణలో తేనెనే..దోచుకో తీయగా
అది సరిగమ పాడిన స్వరవీణ
యిది సరసాలాడిన చలి వీణ
యిది చూపులు కలిసిన సుఖవీణ
యిది ముసి ముసి నవ్వుల ముఖ వీణ
ఝుమ్మని పలికిన ఎద వీణ
నను రమ్మని పిలిచిన రస వీణ
అది సరిగమ పాడిన స్వరవీణ
యిది సరసాలాడిన చలి వీణ
చరణం::2
చీర చాటు సిగ్గువీణ
చేతికొస్తే చెంగు వీణ
జిలుగు నవ్వుల కీర్తనతానై
వలపు మల్లెల వంతెన తానై
నీలినింగి నింగి పక్క మీదా..తారకొక్క ముద్దు పెట్టి
అల్లరి చేసే వేలా..నిన్నల్లుకుపోయే వేళల్లో
రాగమై..భావమై..బంధమై పాడనా
అది సరిగమ పాడిన స్వరవీణ
యిది సరసాలాడిన చలి వీణ
యిది చూపులు కలిసిన సుఖవీణ
యిది ముసి ముసి నవ్వుల ముఖ వీణ
ఝుమ్మని పలికిన ఎద వీణ
నను రమ్మని పిలిచిన రస వీణ
అది సరిగమ పాడిన స్వరవీణ
యిది సరసాలాడిన చలి వీణ