Sunday, May 23, 2010

భలే దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::S.P.బాలు 
తారాగణం::కృష్ణ,నాగభూషణం,పద్మనాభం,మంజుల,జయమాలిని,మోహన్‌బాబు,త్యాగరాజు,మిక్కిలినేని

పల్లవి::

అదీ..పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పైట జారవేసింది చూడరా నే ఓపలేకున్నారా చిన్నా
అబ్బబ్బ..ఆపలేకున్నారా గున్నా..హేయ్ 

చరణం::1

ఆ..తియ్యని బందరు..తొక్కుడు లడ్డురా..ఆఆఆ 
మాంచి బంగినపల్లి..మామిడి పండురా..ఆఆఆ 
బంగారు బొమ్మల్లె..మెరిసిందిరా..ఆఆఆ
ఆ అందచందాలు..ఏమందురా..ఆఆఆ 
అందాల వలవేసి..లాగేస్తుంది..ఈ
మోజుల్లో ముంచేసి..మసిబూస్తుంది
అందాల వలవేసి లాగేస్తుంది..ఈ
మోజుల్లో ముంచేసి మసిబూస్తుంది
ఇంతా మంది శిశువులమూ ఇక్కడలేమా
కడివెడు నీళ్ళూ మోసుకవచ్చి కడిగెయ్యమా
అరె..పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పైట జారవేసింది చూడరా..రేయ్ 
నే ఓపలేకున్నారా చిన్నా
అబ్బబ్బ..ఆపలేకున్నారా గున్నా చిన్నా అబ్బా

చరణం::2

ఆ..సరసాల మురిపించు సిరిసిరిమువ్వ
పింగ్ పాంగ్ పింగ్ పాంగ్ 
చిరునవ్వులెగజిమ్ము చెకుముకి 
రవ్వ రవ్వ అబ్భబ్భా రవ్వ 
ముద్దులు గురిపించు మోహినిరా..ఆ
కనుసైగతో నన్ను కవ్వించెరా..ఆఆ
కనుసైగతో కాటు..వేస్తుందిరా
చిరునవ్వుతో..గొంతు కోస్తుందిరా
కనుసైగతో కాటు..వేస్తుందిరా
చిరునవ్వుతో..గొంతు కోస్తుందిరా
అరె..చస్తేనేమి స్వర్గంలోనా రంభ వున్నదీ
మన గురువుగారికి అక్కడకూడా ఛాన్సు ఉన్నది
పండంటి చిన్నదిరా పసరుమీద ఉన్నదిరా
పైట జారవేసింది చూడరా..రే.. 
నే ఓపలేకున్నారా చిన్నా
అబ్బబ్బ..ఆపలేకున్నారా గున్నా..రేయ్

కుమారరాజ --1978



సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు
Film Directed By::P.Saambasiva  
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,నాగభూషణం,రాజబాబు,మోహన్‌బాబు,గిరిబాబు,అల్లురామలింగయ్య,జగ్గారావు,భీమరాజు,జయప్రద,లత,జయంతి,పుష్పకుమారి,సరోజ,మణిమాల.

పల్లవి::

అనురాగ దేవత నీవే..నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే..నీ తోడుగా ఉండ నీవే ఉండి పోవే
అనురాగ దేవత నీవే..నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే..నీ తోడుగా ఉండ నీవే ఉండి పోవే

చరణం::1

ఏనాటిదో ఈ అనుబంధం..ఊఉ..ఎదచాలనీ మధురానందం..ఊ 
ఏనాటిదో ఈ అనుబంధం..ఎదచాలనీ మధురానందం..ఊ 

నేనేడు జన్మలు ఎత్తితే..ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం..మమతానురాగ బంధం
అనురాగ దేవత నీవే..ఏ..

చరణం::2

నన్ను నన్నుగా ప్రేమించవే..నీ పాపగా లాలించవే
నన్ను నన్నుగా ప్రేమించవే..నీ పాపగా లాలించవే

నా దేవివై దీవించు..నా కోసమే జీవించు
నీ దివ్య సుందర రూపమే..నా గుండె గుడిలో వెలిగే దీపం
నా జీవితం నీ గీతం..మన సంగమం సంగీతం

అనురాగ దేవత నీవే..నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే..నీ తోడుగా ఉండ నీవే ఉండి పోవే

Kumaar Raajaa--1978
Music::K.V.Mahadevan
Lyrics::Vetoori 
Singer's::S.P.Balu
Film Director::P.Sambasiva Rao 

:::

anuraaga devata neeve..naa aamani pulakinta neeve
naa needagaa undi neeve..nee todugaa unda neeve undi pove

anuraaga devata neeve..naa aamani pulakinta neeve
naa needagaa undi neeve..nee todugaa unda neeve undi pove

:::1

Enaatido ee anubandham..uu..edachaalanee madhuraanandan..oo 
aenaatido ee anubandham..edachaalanee madhuraanandam..oo 

nenedu janmalu ettite..Ededu janmalaku edige bandham
idi veedaraani bandham..mamataanuraaga bandham
anuraaga devata neeve..ee..

:::2

nannu nannugaa preminchave..nee paapagaa laalinchave
nannu nannugaa praeminchave..nee paapagaa laaliMchave

naa daevivai deevinchu..naa kosame jeevinchu
nee divya sundara roopame..naa gunde guDilO velige deepaM
naa jeevitam nee geetam..mana sangamam sangeetam

anuraaga devata neeve..naa aamani pulakinta neeve
naa needagaa undi neeve..nee todugaa unda neeve undi pove

మా దైవం--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::వాణీజయరాం 
తారాగణం::N.T.రామారావు,జయచిత్ర,నాగభూషణం,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,పండరీబాయి

పల్లవి::

మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు 
పాల్గుణమాసం..శుక్రవారం  
పాల్గుణమాసం శుక్రవారం బాగుందన్నాడు
ముహూర్తం..బాగుందన్నాడు

చరణం::1

ఏటికి అవతల తోటకు ఇవతల కలవాలన్నాడు
మరి ఏడీ లేడని ఇటు ఆటు చూస్తే ఎదురుగ వున్నాడు
నా ఒళ్ళంతా కళ్ళతోనే మెల్లగ కొలిచాడు
చలచల్లగ అల్లరిచేతులు సాచి అల్లుకుపోయాడు
అమ్మమ్మో..ఓ..అల్లుకుపోయాడు
పెదవులతో చూశాడు..అదోలా నవ్వేశాడు   
ఆ..మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు 
పాల్గుణమాసం శుక్రవారం బాగుందన్నాడు
ముహూర్తం..బాగుందన్నాడు..ఊఊఊ 

చరణం::2

సిగ్గుకు రూపం వచ్చిందంటూ బుగ్గలు నిమిరాడు..ఊ
పైటకు ప్రాణం వచ్చిందంటూ పట్టుకులాగాడు
ఎందుకు మావా తొందర అంటే ఇదిగా చూశాడు
ఏమనుకోకు ఒకటే ఒక ముద్దిమ్మని అడిగాడు
అమ్మమ్మో..ఓ..అడిగాడు ఇచ్చింది ఒకటే గాని 
ఎన్నో రుచులు నేర్పాడు      
మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు 
పాల్గుణమాసం శుక్రవారం బాగుందన్నాడు
ముహూర్తం..బాగుందన్నాడు..ఓఓఓఓఓఓఓఓఓఓఓ 

ప్రేమ బంధం--1976




సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు.P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,వాణిశ్రీ,సత్యనారాయణ,రావికొండలరావు,జయమాలిని,జానకి 

పల్లవి::

పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే 
గువ్వలా ఒదిగితే రవ్వలా పొదిగితే 
నిన్ను నేను నవ్విస్తే నన్ను నువ్వు కవ్విస్తే 
అదే ప్రేమంటే..అదే..అదే..అదే..అదే          

చరణం::1

అంతలోనే మాట ఆగిపోతుంటే 
తనకు తానే పైట జారిపోతుంటే 
అంతలోనే మాట ఆగిపోతుంటే 
తనకు తానే పైట జారిపోతుంటే 
గుండెలో చల్లని ఆవిరి గుస గుస 
పెడుతుంటే గుండెలో చల్లని ఆవిరి 
గుస..గుస..పెడుతుంటే 
తడవ తడవకూ పెదవుల తడియారి పోతుంటే
ఎండలో చలివేస్తే వెన్నెల్లో చెమరిస్తే 
అదే అదే అదే అదే..ప్రేమంటే..అదే అదే అదే అదే 

చరణం::2

కందిన చెక్కిలి కధలేవో చెబుతుంటే 
అందని కౌగిలి ఆరాటపెడుతుంటే 
కందిన చెక్కిలి కధలేవో చెబుతుంటే 
అందని కౌగిలి ఆరాటపెడుతుంటే
కాటేసిన వయసేమో కంటి కునుకునే 
కాజేస్తుంటే కాటేసిన వయసేమో 
కంటి కునుకునే కాజేస్తుంటే
మాటేసిన కోరికలే వేటాడుతూ వుంటే 
ఇద్దరూ ఒకరైతే ఆ ఒక్కరూ మనమైతే 
అదే ప్రేమంటే..అదే అదే అదే 
అదే అదే అదే లల లల లల