Wednesday, June 02, 2010

చాణక్యచంద్రగుప్త--1977

సంగీతం:::పెండ్యాల
రచన:::C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల

హా హా హా హా హా హా హా

చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో
చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో
పలికేనులే హృదయాలే
పలికేనులే హృదయాలే
తొలి వలపుల కలయికలో

చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో

చరణం::1

వసంతాలు దోసిట దూసి విసిరెను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాదిగా...నీవే నా జీవనాదిగా
ఎగసేను గగనాల అంచులలో...
విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో

చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో

చరణం::2

ఉరికే సెలయేరులన్నీ ఒదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘాలన్నీ ఉలికిపడును నీ పలుకులలో
నీవే నా పుణ్య మూర్తిగా...నీవే నా పుణ్య మూర్తిగా
ధ్యానింతు నా మధుర భావనలో
మెరియునులే ఆ భావనలే ఇరు మేనుల అల్లికలో

చిరునవ్వుల తొలకరిలో.....
సిరిమల్లెల చినుకులలో

ఆ ఆహా...
పలికేనులే హృదయాలే
తొలి వలపుల కలయికలో

చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో

చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో

తులాభారం--1974


సంగీతం::సత్యం 
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::చలం, శారద,పద్మనాభం,కాంతారావు,రమణారెడ్డి,నిర్మల,రమాప్రభ,శాంతకుమారి

పల్లవి::

చేరువలోనే దూరములేలా 
రాధమ్మా..నా చెంత రావేలనే
రాధమ్మా..ఈ చింత నీ కోసమే  
దూరములోనే చేరువ వుంది
ఓ రాజా..ఉన్నాను నీ నీడగా
ఓ రాజా..ఉంటాను నీ తోడుగా  

చరణం::1

విరహాలు నన్ను..దహియించు వేళ
కురిపించవేల..అనురాగ ధార
విరహాలు నన్ను..దహియించు వేళ
కురిపించవేల..అనురాగ ధార
కులుకుల చినుకులె..పన్నీటి జల్లు
రాధమ్మా..నా చెంత రావేలనే
రాధమ్మా..ఈ చింత నీ కోసమే  
దూరములోనే చేరువ వుంది
ఓ రాజా..ఉన్నాను నీ నీడగా
ఓ రాజా..ఉంటాను నీ తోడుగా   

చరణం::2

ఆనాటి నుంచీ..నీ దాననేగా
ఈనాడు నీలో..ఈ తొందరేలా
ఆనాటి నుంచీ..నీ దాననేగా
ఈనాడు నీలో..ఈ తొందరేలా
మనసున మమతలు..నీ పూజకేలే  
ఓ రాజా..ఉన్నాను నీ నీడగా
ఓ రాజా..ఉంటాను నీ తోడుగా 
చేరువలోనే దూరములేలా
రాధమ్మా..నా చెంత రావేలనే
రాధమ్మా..ఈ చింత నీ కోసమే
ఓ రాజా..ఉంటాను నీ తోడుగా