Friday, February 18, 2011

పెద్దమనుషులు--1954























సంగీతం::ఓగిరాల రామచంద్రరావు,మరియు అద్దేపల్లి రామారావు
రచన::ఊటుకూరి సత్యనారాయణరావు?? 
గానం::పి.లీల బృందం

(రాష్ట్రపతి పురస్కారం పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం)

తారాగణం::గౌరీనాధ శాస్త్రి, లింగమూర్తి, రేలంగి, శ్రీరంజని, రామచంద్ర కశ్యప
చదలవాడ,హేమలత,శేషమాంబ

(మహానటి శ్రీరంజని (జూనియర్) 84వ జయంతి (ఫిబ్రవరి 22, 2011) సంధర్భంగా ఈ ప్రార్థనాగీతం. తెలుగులో లతా మంగేష్కర్ పాట పాడిన మొట్టమొదటి నటి ఆమె. ఆమె అసలు పేరు మహాలక్ష్మి. ఆమె ఘంటసాల గతించిన రెండు నెలలు పదహారు రోజుల తర్వాత మరణించింది. 1974 సంవత్సరం తెలుగు సినిమా స్వర్ణయుగానికి చెందిన గొప్పవారెందరినో తీసుకెళ్ళిపోయింది. ఆమె 47 ఏళ్ళ వయస్సుకే గతించింది. రాష్ట్రపతి పురస్కారం పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం పెద్ద మనుషులు (౧౯౫౪/1954) లోనిది ఈ పాట.)

పల్లవి::

ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార 
ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార 

చరణం::1

ఏ పాపమెరుగని పసిపాపలమురా 
ఏ పాపమెరుగని పసిపాపలమురా
మన్నించి ముందుండి మమ్ము నడిపించు 
ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార  

చరణం::2


సంకుచిత భావాలు సమసిపోవంగ
స్వాతంత్ర్య విజ్ఞాన జ్యోతి వెలగాలి
సంకుచిత భావాలు సమసిపోవంగ
స్వాతంత్ర్య విజ్ఞాన జ్యోతి వెలగాలి 
ఏ అధర్మమమునైన ఎదిరించి నిలిచి 
ఏ అధర్మమమునైన ఎదిరించి నిలిచి 
నిర్భయముగ మేము నిజమె పలకాలి 
ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార 

చరణం::3 

పేదలు ధనికులు భేదాలు మాని
చెలిమియే బలమంచు కలిసి బ్రతకాలి 
పేదలు ధనికులు భేదాలు మాని
చెలిమియే బలమంచు కలిసి బ్రతకాలి
ఏ కష్టమొచ్చినా ఎవరడ్డుపడినా
ఏ కష్టమొచ్చినా ఎవరడ్డుపడినా
దీక్షతో ధర్మమే ఆచరించాలి
ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందార