Friday, December 26, 2008

భక్త కన్నప్ప--1976

చిమ్మటలోని ఈ ఆణి ముత్యం వింటూ--సాహిత్యాన్ని చూస్తూ పాడుకొందామా





సంగీతం::ఆదినారాయణ రావ్,సత్యం
రచన::ఆరుద్ర
గానం::SP.బాలు,P.సుశీల

ఉయ్..ఉయ్..ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
ఉయ్..చిన్నదాని మనవుసెయ్యి సందమామ
అరే,,సిన్నోడా..ఆ..ఆ..ఆ..ఆ
ఆకు సాటున పిందె వుంది
సెట్టు సాటున సిన్నాదుంది
సక్కని సుక్కనిటక్కున ఎతికి
దక్కించుకోరా...దక్కించుకోరా..
ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
ఉయ్..చిన్నదాని మనవుసెయ్యి సందమామ


అరె..సిన్నమ్మీ....
మబ్బుఎనకమెరుపుతీగ
దుబ్బు ఎనక మల్లెతీగ
ఏడనున్న దాగోలేవే
మల్లెమొగ్గా..అబ్బోసిగ్గా..
ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
ఉయ్..చిన్నదాని మనవుసెయ్యి సందమామ


అహ...అత్తారింటికి దారేదమ్మా సందామామా
అరెరెరె....ఆమడ దూరం వుందోలమ్మా సందామామ
ఆమడదోరం వున్నాగాని ఎళ్ళాలమ్మా
ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
ఉయ్..చిన్నదాని మనవుసెయ్యి సందమామ


హోయ్...హోయ్...సీకటింట్లో సిక్కుతీసా
ఎలుతురింట్లో కొప్పు ముడిసా
కొప్పులోని మొగలిపూవ్వు గుప్పుమందే..ఒప్పులకుప్పా
ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
ఉయ్..చిన్నదాని మనవుసెయ్యి సందమామ


చందమామ రేకలెన్ని
కలువపువ్వు రేకులెన్ని
దానికి దీనికి ఎన్నెన్ని వున్నా
నాకు నీవే...నీకు నేనే...
ఎన్నియలో ఎన్నియల్లో సందమామ
ఉయ్..చిన్నదాని మనవుసెయ్యి సందమామ