Wednesday, May 28, 2008

సోగ్గాడు--1975



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు  
తారాగణం::శోభన్ బాబు,జయచిత్ర,జయసుధ,అంజలీదేవి,రమాప్రభ,సత్యనారాయణ, రాజబాబు,నగేష్

పల్లవి::

ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా
ఎంత పనిచేశావు తిరుమలేశ
చెట్టు మీద కాయను సముద్రంలో వుప్పును 
కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా
ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా
ఎంత పనిచేశావు తిరుమలేశ
చెట్టు మీద కాయను సముద్రంలో వుప్పును
కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా

చరణం::1

నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు 
నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు
నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు 
నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు
అన్యాయం అన్యాయం అంటే వెళ్ళి దేవుడితో 
చెప్పుకో పొమ్మన్నాడు పో పొమ్మన్నాడు  
ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా
ఎంత పనిచేశావు తిరుమలేశ శ్రీనివాసా
      
చరణం::2
  
చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు 
చట్టం ఒప్పుకుని యిద్దరం కలవలేదు
చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు 
చట్టం ఒప్పుకుని యిద్దరం కలవలేదు
మనిషి చేసింది చట్టము మాకు జరిగింది ద్రోహము
నువ్వే నిలబెట్టాలి నీతీ న్యాయమూ లేదా నువ్వే శూన్యము
ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా
ఎంత పనిచేశావు తిరుమలేశ శ్రీనివాసా

చరణం::3

మాటమీద నిలబడే మనిషినీ 
మనసు మార్చుకోను చేతకాని వాడినీ
మాటమీద నిలబడే మనిషినీ 
మనసు మార్చుకోను చేతకాని వాడినీ
చేపట్టి విడువలేను ఆడదానిని 
నీ మీద ఒట్టు నేనొంటరివాడ్ని ఒంటరివాడ్ని
ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా
ఎంత పనిచేశావు తిరుమలేశ
చెట్టు మీద కాయను సముద్రంలో వుప్పును 
కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా
కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా