సంగీతం::సత్యం
రచన::దేవులపల్లికృష్ణశాస్రీ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.R.,మంజుళ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,పండరీబాయ్,లీలారాణి.
పల్లవి::
వయసే ఒక పాఠం..వలపే ఒక పాఠం
గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది అదియే ప్రేమ పాఠం
వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం
గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది అదియే ప్రేమ పాఠం
అదియే ప్రేమ పాఠం..అదియే ప్రేమ పాఠం
చరణం::1
కొమ్మలపైని...గువ్వల జంటకు
గుస గుస...లెవ్వరు నేర్పారు
కొమ్మలపైని...గువ్వల జంటకు
గుస గుస...లెవ్వరు నేర్పారు
సరదా లెరిగిన..యీ దొరగారికి
సరసాలెవ్వరు నేర్పేరు..సరసాలెవ్వరు నేర్పేరు
వయసే ఒక పాఠం..వలపే ఒక పాఠం
గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది అదియే ప్రేమ పాఠం
చరణం::2
నీ కాటుక కన్నుల..మాటున దాగిన
కమ్మని..గాధలు...చదివాను
నీ కాటుక కన్నుల..మాటున దాగిన
కమ్మని..గాధలు...చదివాను
నీ మూగపెదవుల కదలికలోన మేఘ సందేశం
విన్నాను..మేఘ సందేశం..విన్నాను
వయసే ఒక పాఠం..వలపే ఒక పాఠం
గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది అదియే ప్రేమ పాఠం
చరణం::3
వలపురీతులూ..మనసులోతులూ
తెలుపలేవులే...ఏ గ్రంథాలు
ప్రణయమూర్తుల అనుభవాలే మరువలేని
ప్రబంధాలు..మరువలేని ప్రబంధాలు
వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం
గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది అదియే ప్రేమ పాఠం