Thursday, May 29, 2008

ఇద్దరూ ఇద్దరే--1976


సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::P.సుశీల,S.P.బాలు,V.రామకృష్ణ 
తారాగణం::శోభన్‌బాబు,కృష్ణంరాజు,ప్రభాకరరెడ్డి,పద్మనాభం,మంజుల,చంద్రకళ,రాజబాబు

పల్లవి::

గెలిచిందమ్మా గెలిచిందమ్మా పేదోళ్ళ పేట
ఓడిందమ్మా ఓడిందమ్మా  గొప్పోళ్ళ కోట
గెలిచిందమ్మా గెలిచిందమ్మా పేదోళ్ళ పేట
ఓడిందమ్మా ఓడిందమ్మా  గొప్పోళ్ళ కోట
రింజంతానానా ఛంగురెతానానా
రింజంతానానా ఛంగురెతానానా
పలికిందమ్మా పలికిందమ్మా  పగడాలబొమ్మా
కులికిందమ్మా కులికిందమ్మా పరువాలగుమ్మా
పలికిందమ్మా పలికిందమ్మా  పగడాలబొమ్మా
కులికిందమ్మా కులికిందమ్మా పరువాలగుమ్మా
రింజంతానానా ఛంగురెతానానా
రింజంతానానా ఛంగురెతానానా

చరణం::1

బొమ్మంటే బొమ్మకాదు బులిపించే చిలకమ్మా
బొమ్మంటే బొమ్మకాదు బులిపించే చిలకమ్మా
గుమ్మంటే గుమ్మకాదు గునశాలి గున్నమ్మా
గుమ్మంటే గుమ్మకాదు గునశాలి గున్నమ్మా
ఈ చిలకమ్మను పట్టుకునే వాడెవడో
ఈ గున్నమ్మను పట్టుకునే వాడెవడో
ఇక్కడే ఎక్కడో వున్నాడు
ఇప్పుడో ఎప్పుడో ఎగరేసుకు పోతాడు       
రింజంతానానా ఛంగురెతానానా
రింజంతానానా ఛంగురెతానానా

చరణం::2

ఎగరేసుకు పోయేవాడు ఏ మాయచేస్తాడో
ఎగరేసుకు పోయేవాడు ఏ మాయచేస్తాడో 
ఈ అన్న తోడుగ వుంటే ఎవ్వడేమి చేస్తాడు
ఈ అన్న తోడుగ వుంటే ఎవ్వడేమి చేస్తాడు
చెలియకు ప్రాణాలిస్తాడు ఈ చినవాడు
చెలియకు ప్రాణాలిస్తాడు ఈ చినవాడు 
చెలిమికి ప్రాణం పోస్తాడు ఈ మొనగాడు
చెలిమికి ప్రాణం పోస్తాడు ఈ మొనగాడు
ఎవ్వరికి ఎన్నటికీ లొంగములే
ఎవ్వరికి ఎన్నటికీ లొంగములే
ఇద్దరూ ఇద్ధరే తలవంచని సింగాలే      
రింజంతానానా ఛంగురెతానానా
రింజంతానానా ఛంగురెతానానా
గెలిచిందమ్మా గెలిచిందమ్మా పేదోళ్ళ పేట
ఓడిందమ్మా ఓడిందమ్మా  గొప్పోళ్ళ కోట
గెలిచిందమ్మా గెలిచిందమ్మా పేదోళ్ళ పేట
ఓడిందమ్మా ఓడిందమ్మా  గొప్పోళ్ళ కోట
రింజంతానానా ఛంగురెతానానా
రింజంతానానా ఛంగురెతానానా