Sunday, January 09, 2011

భక్తతుకారం --- 1973




సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::D.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల

సరిసరీ..వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా..ఆ..ఆ..ఆ..ఆ..2


చెంతకు రమ్మని చేరనంటినా..ఆ..ఆ..
చెక్కిలి నొక్కిన కూడదంటినా..ఆ..ఆ..ఆ..2
తొలిఝామైనా కానిదే..తొలిఝామైనకానిదే
తొదర ఎందుకు ఎందుకంటిరా...ఆ..ఆ..
సరిసరీ....

ఆ..ఆ..ఆ..మంచిగంధం పూయకముందే..
మల్లెమొగ్గలు చల్లకముందే...2
కులుకుటందెలు మొగకముందే...
కొత్తజావళి పాడకముందే...
గరిస నిపమప...ససని ససనిసని...
నినిప నినిపనిప..మగప మనిప..పపని పమగమ...
గపమగననిస...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కొత్తజావళి పాడకముందే...
కంటిగిలుపుల..జంట తలుపుల..కొంటిచేతల..
కవ్వింత లింకేల...చలించవేరా...ఆ...ఆ...
సరిసరీ.....

పండువెన్నెల పానుపుచేసి..పైట కొంగున వీవన చేసి
వేడిముద్దులు కానుక చేసి..వీడనికౌగిట బంధీ చేసి
ఎన్నడెరుగని..వన్నె తరగని..కన్నెవలపులు అందించి
అందాలు చిందింతులేరా.....ఆ..ఆ..ఆ...

భక్తతుకారం --- 1973


సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::వేటూరి
గానం::రామక్రిష్ణ

పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..అదే మోక్షతీరం
వేదసారం..మధురం..మధురం
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..

ఎంతపాడుకొన్నా..అంతులేని కావ్యం..2
ఎన్నిమార్లు విన్నా..నవ్యాతి నవ్యం ..
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..

పాండురంగ సన్నిధీ..మాసిపోని పెన్నిధీ..2
ప్రభువుని కరుణ లేనిదీ..జగతిని ఏమివున్నదీ..
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..

దాసులైనవారికీ..దాసుడీవుకాదా..2
ధన్యజీవులారా..అందుకొండి రాం రాం
అందుకొండి రాం రాం..అందుకొండి రాం రాం
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..4

పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం

మనుషులు - మట్టిబొమ్మలు--1974







సంగీతం::B.శంకర్
రచన::C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం:కృష్ణ,జగ్గయ్య,గుమ్మడి,అల్లు రామలింగయ్య,జమున,సావిత్రి,రమాప్రభ,జ్యోతిలక్ష్మి 

పల్లవి::

నీలో విరిసిన అందాలన్నీ 
నాలో వీడని బంధాలాయె
ఓ..నీలో పలికిన రాగాలన్నీ
నాలో శ్రావణ మేఘాలాయె
మ్మ్ మ్మ్..నీలో విరిసిన అందాలన్నీ 
నాలో వీడని బంధాలాయె

చరణం::1

అల్లరి గాలి నిమిరే దాకా 
మల్లె మొగ్గకు తెలియదు..ఏమనీ
తానొక తుమ్మెదకై తపియించేననీ
తానొక తుమ్మెదకై తపియించేననీ
మూగ కోరికా ముసిరే దాకా
మూగ కోరికా ముసిరే దాకా
మూసిన పెదవికి తెలియదు .. ఏమనీ
తానొక ముద్దుకై తహతహలాడేనని
తానొక ముద్దుకై తహతహలాడేనని
ఆ కోరికలే ఇద్దరిలోనా 
ఆ కోరికలే ఇద్దరిలోనా
కార్తీక పూర్ణిమలై వెలగాలి

నీలో విరిసిన అందాలన్నీ 
నాలో వీడని బంధాలాయె
ఓఓఓఓ..

చరణం::2

మధుమాసం వచ్చే దాకా మామిడిగున్నకు తెలియదు...ఏమనీ
తానొక వధువుగా ముస్తాబైనాననీ 
తానొక వధువుగా ముస్తాబైనాననీ
ఏడు అడుగులు నడిచేదాకా
ఏడు అడుగులు నడిచేదాకా
వధూవరులకే తెలియదు..ఏమనీ
ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ 
ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ
ఆ బంధాలే ఇద్దరిలోనా 
ఆ బంధాలే ఇద్దరిలోనా
కార్తీక పూర్ణిమలై వెలగాలి

నీలో విరిసిన అందాలన్నీ 
నా..లో వీడని బంధాలాయె
ఓ..ఓ..ఓ..
నీలో పలికిన రాగాలన్నీ 
నా..లో శ్రావణ మేఘాలాయె

భక్తతుకారం--1973

























సంగీతం::P.ఆదినారాయణ రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల


పూజకు వేళాయెరా!
రంగా..పూజకు వేళాయెరా..ఆ..ఆ..
పూజకు వేళాయెరా..

ఇన్నినాళ్ళు నే నెటుల వేచితినో..
ఇన్నిరేలు ఎంతెంత వేగితినో..2
పిలుపునువిని విచ్చేసితివని..నా..2
వలపులన్ని నీకొరకే దాచితిని
ఎవరూ..పోందని ఏకాంత సేవలో
ఈ వేళ తనిదీర గా నిన్నేఅలరించు

||పూజకు వేళాయెరా..ఆ..ఆ..ఆ
పూజకు వేళాయెరా..||

ఈ నీలి నీలి ముంగురులు ఇంద్రనీలాల మంజరులు
ఈ వికసిత సిత నయనాలు శతదళకోమల కమలాలు
అరుణారుణమీ అధరమూ...తరుణ మందార పల్లవము
ఆఆఆఆఆఆఆఆ....ఆఆఆఅ
ఎదలో పొంగిన ఈ రమణీయ పయొధరాలు..ఊ..ఊ..
ఫాలకడలిలో ఉదయించు సుధాకలశాలు..ఆఆఆఅ..
ఎంతసుందరము శిల్ప బంధురము
ఈ జఘన మండలము సృష్టి నంతటిని
దాచుకొన్న ఆ పృధివీ మండలము............

ఓ....అభినవ సౌదర్యరాశీ...
ఓ...అపూర్వ చాతుర్యమూర్తీ
నీ కటాక్షముల లాలనమ్ములో నీ మధురాధర చుంబనమ్ములో...
మధురిమలెన్నో పొదుగుకొన్న నీస్తన్య సుధల ఆస్వాదనమ్ములో
అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో...
హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున
జన్మించేభాగ్యమే లేదాయె తల్లీ...తల్లీ...తల్లీ.....

స్వామీ!!......

వచనం::: అవునమ్మ....నీవు ప్రదర్శించిన సౌదర్యము అనిత్యము
నీవు నమ్ముకొన్న యవ్వనము అసాస్వితము

దువ్వుకొన్న నీ నీలిముంగురులే దూదిపింజలై పోవునులే..
నవ్వుతున్న ఆకంటివెలుగులే..దివ్వెల పోలిక ఆరునులే..
వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే..వాడి వత్తులై పోవునులే..
పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే..
నడుము వంగగా...నీ ఒడలు క్రుంగగా..నడువలేని నీ బడుగు జీవితము
వడ వడ వణుకునులే...ఆశలురేపే సుందరహేహను అస్థిపంజరమౌనులే

సంసారం సాగరం--1974



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె
గానం::P.సుశీల
తారాగణం::S.V.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ. 

పల్లవి::

దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ

చరణం::1

చేతులు కాల్చుకునే..సిసింద్రీలకన్నా
కళ్ళు జిగేలనే..మతాబాలకన్నా
చేతులు కాల్చుకునే..సిసింద్రీలకన్నా
కళ్ళు జిగేలనే..మతాబాలకన్నా
నలుగురూ కిలకిల..నవ్వినపుడే పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్  
ఉన్నంతలో కడుపునిండ..తిన్నపుడే పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు 

చరణం::2

తారాజువ్వల్లా ఎగిరి ఎగిరి పడక
చిమ్మిన రవ్వల్లా చెల్లాచెదురుకాక
తారాజువ్వల్లా ఎగిరి ఎగిరి పడక
చిమ్మిన రవ్వల్లా చెల్లాచెదురుకాక
ఒకటిగా కలిసి మెలిసి ఉన్నపుడే పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్ 
ఉన్నంతలో కడుపునిండ..తిన్నపుడే పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ

చరణం::3

అమావాశ్య చీకటిలో ప్రమిదలే వెలుగులు
అమ్మకు నాన్నకూ పిల్లలే దివ్వెలు
అమావాశ్య చీకటిలో ప్రమిదలే వెలుగులు
అమ్మకు నాన్నకూ పిల్లలే దివ్వెలు
పరువుగా ఆ పిల్లలు బ్రతికినపుడె పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్  
ఉన్నంతలో కడుపునిండ తిన్నపుడె పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు