Wednesday, March 07, 2012
మాతౄ దేవత--1969
సంగీతం::K.V.మహాదేవన్
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,B.వసంత
దర్శకత్వం::సావిత్రి
నిర్మాత::అట్లూరి పూర్ణచంద్రరావు,M.చంద్రశేఖర్
నటీనటులు::సావిత్రి, ఎన్.టి.రామారావు, శోభన్‌బాబు, చంద్రకళ, నాగభూషణం, రేలంగి, హేమలత, బేబిరాణి, రాజబాబు, మంజుల, సురభి బాలసరస్వతి, విజయలలిత, సాక్షి రంగారావు
మహిళాదినోత్సవం సందర్బంగా,
మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
|| మానవ జాతి ||
ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల వల్లి
ఒక రామయ్యకే కన్న తల్లి సకలావనికే కల్పవల్లి
ఆ ఆ ఆ....ఓ..ఓ.....
మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
సీతగా ధరణిజాతగా సహన శీలం చాటినది
రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటినది
సీతగా ధరణిజాతగా సహన శీలం చాటినది
రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటినది
మెల్లగా కవితలల్లగా తేనేజల్లు కురిసినది
మెల్లగా కవితలల్లగా తేనేజల్లు కురిసినది
లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా సమర రంగాన దూకునది
లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా సమర రంగాన దూకునది
మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
తరుణి పెదవిపై చిరునగ వొలికిన మెరయును ముత్యాల తరులు
కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవు ఆ సిరులు
కన్న కడుపున చిచ్చురగిలెనా కరువుల పాలౌను దేశం
కన్న కడుపున చిచ్చురగిలెనా కరువుల పాలౌను దేశం
తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం
తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం
ఆ...ఆ...ఆ...ఓ ఓ...
మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
తరగని పెన్నిధి మగువ
Labels:
మాతౄ దేవత--1969
విజృంభణ--1986
సంగీతం::సత్యం
నిర్మాతలు::కోనేరు రవీంద్రనాథ్,పాలపర్తి కోటేశ్వరరావు
దర్శకత్వం::రాజాచంద్ర
సంస్థ::విజయశ్రీ ఆర్ట్స్
గాత్రం::బాలు, చిత్ర (తొలి పాట)
తారాగణం::శోభన్బాబు, జయసుధ, శోభన, సీత
హిందిలో "Merijung"అనిల్‌కపూర్ హిరోగా
తెలుగులో "విజ్రుంభణ" శోభన్ హిరోగా నటియించిన
ఈ సినిమా పాటలు అన్నీ బాగున్నాయి
జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా దైర్యంతో
ముందుకు వెళ్ళి విజయం సాధించాలనే నిజాన్ని చెప్పే
పాట ఇది హింది,తెలుగులో రెండింటిలోనూ ఈ పాట చాలా బాగుంటుంది
మీరూ వినండి
పల్లవి:
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
చరణం1:
కమ్మని మనసులు కళకళలాడే కాపురం
తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం
మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం
పాపలు తిరిగే వాకిలి సుందర నందనం
నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైనా
తడబడక వడి వడిగా నడిచేదే జీవితం
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
చరణం2:
చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం
మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం
చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం
మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం
పదుగురు ఏమన్నా విధి పగపడుతున్నా
ఎదసాచి ఎదిరించి కదిలేదే జీవితం
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం...జీవితం
ప్రతిపదం...ప్రతిపదం సమరమై సాగనీ
త్రిమూర్తులు--1987
సంగీతం::బప్పీలహరి
రచన::
దర్శకత్వం::K.మురళిమోహన్‌రావ్
నిర్మాత::శశిభూషణ్
గానం::బాలు,సుశీల
సంస్థ::మహేశ్వరీ,పరమేశ్వరీ ప్రొడక్షన్స్
పల్లవి::
ఓ ఓ ఓ ఓ శీతాకాలం శృంగారాలు
సాయంకాలం సంగీతాలు
పులకింతల పూదోటలో
కవ్వింతల కాపురం పెట్టుకుందామా చుట్టుకుందామా
చరణం::1
గోరంత నీ ముద్దు తాకే గోరింట నా నోట పండే
నా ఈడూ సూరీడులాగ ఎండెక్కే వేడిలో
కొండంత నీ ఎత్తు చూసా కోనంటి నీ లోతు చూసా
నీ ఎత్తులే చిత్తు చేసే కౌగిట్లో వాలనా
కసి కట్నమే చదివించనా కానిస్తే ఆ లాంచనం
రెచ్చిపోదామా రేగిపోదామా
చరణం::2
రెండితల బంతులాట రేయంత పూబంతులాట
చెక్కిళ్ళ చేమంతులాట ఆడిస్తా వాటంగా హోయ్
కూసంత నడుమిచ్చుకుంటా పువ్వంత మనసిచ్చుకుంటా
నీ సొంతమై తోడు ఉంటా అన్నిట్లో జంటగా
చలిమంటలే రగిలించనా సయ్యాటతో ఈ దినం
వద్దు అంటానా, అంటే వింటానా
Labels:
త్రిమూర్తులు--1987
Subscribe to:
Posts (Atom)