Thursday, January 08, 2015

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

నగుమోము చూపించవా..గోపాలా
నగుమోము చూపించవా..గోపాలా
మగువల మనసుల..ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

చరణం::1

ఎదుట..ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట
ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట 
ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట
ఇక సైపలేను నీవే నా..ముద్దుల జంట
నగుమోము చూపించవా గోపాలా 

చరణం::2

వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ 
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ 
మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల 
నగుమోము చూపించవా గోపాలా  

చరణం::3

కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
నెలవంకలిడి నన్ను అలరించవేమయ్య
నగుమోము చూపించవా గోపాలా 

నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

దేవదాసు--1974


సంగీతం::రమేష్‌నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య 

పల్లవి::

కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ

చరణం::1

ఒక కంట గంగ..ఒక కంట యమునా 
ఒక్కసారే కలసి..ఉప్పొంగెనూ 
ఒక్కసారే కలసి..ఉప్పొంగెనూ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కన్నీటి వరదలో నువు మునిగినా
చెలి కన్నుల చెమరింపు..రాకూడదూ 
చెలి కన్నుల చెమరింపు..రాకూడదూ
కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 

చరణం::2

ఓఓఓఓఓఓఓఓ..ఆఆఆఆఆఆఆఆఆ
మనసొక చోట..మనువొక చోట 
మమతలు పూచిన..పూదోట 
మమతలు పూచిన..పూదోట
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కోరిన చిన్నది..కుంకుమ రేఖల 
కుశలాన ఉండాలి..ఆ చోట 
కుశలాన ఉండాలి..ఆ చోట
కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ