Thursday, May 20, 2010

మా దైవం--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::రాజశ్రీ 
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,జయచిత్ర,నాగభూషణం,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,పండరీబాయి

పల్లవి::

కాలాత్మా సర్వభూతాత్మా..వేదాత్మా విశ్వతో ముఖ:
దీనబంధూ దయాసింధో..దివ్యాత్మా నమో నమ:

ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే
అందరిని కాపాడే..దేవుడొక్కడే
అందులకే అతనికి..తలవంచాలి
అనుదినమూ..ఆ దేవుని పూజించాలి

ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే
అందరిని కాపాడే..దేవుడొక్కడే
అందులకే అతనికి..తలవంచాలి
అనుదినమూ..ఆ దేవుని పూజించాలి
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే
అందరిని కాపాడే..దేవుడొక్కడే

చరణం::1

భగవంతుని ప్రతిరూపం..కరుణయందురు
ఆ కరుణతో భగవంతుని..చూడమందురు
భగవంతుని ప్రతిరూపం..కరుణయందురు
ఆ కరుణతో భగవంతుని..చూడమందురు
కరుణయే మనిషికి..దేవుని వరము
అది పరులయెడల చూపినపుడే..బ్రతుకు ధన్యము
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే

చరణం::2

పాపాలకు వేనవేలు..దారులున్నవి
ధర్మగోపురాని..కొక్కటే ద్వారమున్నది
పాపాలకు వేనవేలు..దారులున్నవి
ధర్మగోపురాని..కొక్కటే ద్వారమున్నది
నీతియే వూపిరిగా..నిలపాలి
న్యాయమే బాటగా..సాగాలి
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే

చరణం::3

చెడుపనులు చేయకు..చెడును చూడకు
చెడుమాటలు..నీ నోటను మాటలాడకు
చెడుపనులు చేయకు..చెడును చూడకు
చెడుమాటలు..నీ నోటను మాటలాడకు
పగయే నీ శత్రువనే..నిజము తెలుసుకో
ప్రేమతో పగను గెలిచి..బ్రతుకు దిద్దుకో
మన బాపూజీ..మాట నిలుపుకో 
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే
అందరిని కాపాడే..దేవుడొక్కడే
అందులకే అతనికి..తలవంచాలి
అనుదినమూ..ఆ దేవుని పూజించాలి
ఒకే కులం ఒకే మతం..అందరు ఒకటే

అల్లుడొచ్చాడు--1976....


సంగీతం::T.చలపతిరావ్ 

రచన::ఆచార్య-ఆత్రేయ

గానం::S.P.బాలు

తారాగణం::రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య


పల్లవి::


వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా


కోరిక నీలో ఎంతవున్నా..తీర్చే మొనగాడేదుట వున్నా

కోరిక నీలో ఎంతవున్నా..తీర్చే మొనగాడేదుట వున్నా

వేడి ఎక్కడో పుట్టాలి..నీ వేడుక అప్పుడు తీరాలి


వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా


చరణం::1


పొదలో దుమ్మెద రొద పెడితే..మొగ్గకు తేనె వచ్చేనా

ఎదలో ఏదో సొద పెడితే..ఎంకి పాటగా పలికేనా


పొదలో దుమ్మెద రొద పెడితే..మొగ్గకు తేనె వచ్చేనా

ఎదలో ఏదో సొద పెడితే..ఎంకి పాటగా పలికేనా


పెదవులూ రెండూ కలవాలి..నీ ఎదలోని కుతి తీరాలి

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా


చరణం::2


పదహారేళ్ళ ప్రాయంలోన ఫైటజారక నిలిచేనా

పదహారేళ్ళ ప్రాయంలోన ఫైటజారక నిలిచేనా 


ఎదిగే పొంగు ఏనాడైనా..ఎదిగే పొంగు ఏనాడైనా..అదిమిపట్టితే ఆగేనా

ఆగని వన్నీ రేగాలి..అప్పుడు మన కథ సాగాలి


వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా

నువ్వు వేగిరపడితే రాదమ్మా తెరగ వచ్చేదైనా

వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా