సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.జానకి
లాలిలాలో..ఆఆఆ..లాలిలాలో..ఓ..ఓ..
లలిలాలిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
నా మావయ్య వస్తాడంట.....
మావయ్య వస్తాడంట..మనసిచ్చిపోతాడంటా
మావయ్య వస్తాడంట..మనసిచ్చిపోతాడంటా
మరదల్ని మెచ్చీ..మరుమల్లెగుచ్చీ
ముద్దిచ్చిపోతాడంటా..ఆ ముద్దర్లు పోయేదెట్టా
నా బుగ్గలే ఎరుపెక్కెనే..
మొగ్గేసినా నును సిగ్గులు
ఆ..మొగ్గేసినా తొలిసిగ్గులు
పడుచోడు నావాడంట..
పగలంత ఎన్నెల్లంట
వలపల్లె వచ్చి
వరదల్లె ముంచి
వాటేసుకొంటాడంటా..
ఆణ్ణి పైటేసుకొంటానంట
మావయ్య వస్తాడంట..మనసిచ్చిపోతాడంట
కల్లోకి వచ్చీ..కన్నుకొట్టాడే
కన్నెగుండెల్లో..చిచ్చుపెట్టడే
కల్లోకి వచ్చీ..కన్నుకొట్టాడే
కన్నెగుండెల్లో..చిచ్చుపెట్టడే
గుండెల్లోవాడు..ఎండల్లుకాసే
కాన్నుల్లో నేడు..ఎన్నెల్లుకురిసే
వన్నెల్లుతడిసే..మేనేల్ల మెరిసే
పరువాలే పందిళ్ళంట..కవ్వించె కౌగిళ్ళంట
మురిసిందివళ్ళు..ఆమూడుముళ్ళూ
ఎన్నాళ్ళకేస్తడంటా..ఇంకెన్నాళ్ళకొస్తాడంట
మావయ్య వస్తాడంట..మనసిచ్చిపోతాడంట
కల్యాణవేళా..సన్నాయిమ్రోగ
కన్నె అందాలే..కట్ణాలుకాగా
కల్యాణవేళా..సన్నాయిమ్రోగ
కన్నె అందాలే..కట్ణాలుకాగా
మనసిచ్చినోడు..మనువాడగానే
గోరింకనీడ ఈ చిలకమ్మ పాడే
చిలకమ్మ పాడే..చిలకమ్మ పాడే
ఇంటల్లుడౌతాడంట..ఇక నా ఇల్లువాడేనంటా
ఇంటల్లుడౌతాడంట..ఇక నా ఇల్లువాడేనంటా
మదిలోనివాడూ..గదిలోకివస్తే
కన్నీరు రావాలంటా..అదే పన్నీరైపోవాలంటా
కన్నీరు రావాలంటా..అదే పన్నీరైపోవాలంటా