Saturday, June 16, 2007

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::భాగేశ్వరి::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య
భాగేశ్వరి::రాగం  పల్లవి::

అలిగితివ సఖీ ప్రియ కలత మానవా
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏల జాలవా
అలిగితివ సఖి ప్రియా కలత మానవా

చరణం::1

లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా
లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయను జూడవా
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా

చరణం::2

నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని
నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని
సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా

చరణం::3

ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా కనికరించవా..ఆఆఆ

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్‌క బూని తాచిన అది నాకు మన్ననయ - చెల్వగు నీ పదపల్లవము మత్ తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద -
అల్క మానవుగదా యికనైన అరాళ కుంతలా..."

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::S.వరలక్ష్మి,కోరస్

వేయిశుభములు కలుగు నీకు పోయిరావే మరదలా
ప్రాణపదముగ పెంచుకుంటిమి నిన్ను మరవగలేములే
వేయిశుభములు కలుగు నీకు పోయిరావే మరదలా


వాసుదేవుని చెల్లెలా నీ ఆశయే ఫలియించెలే
వాసుదేవుని చెల్లెలా నీ ఆశయే ఫలియించెలే
దేవదేవుల గెలువజాలిన బావయే పతి ఆయెలే
వేయిశుభములు కలుగు నీకు పోయిరావే మరదలా


భరతవంశమునేలవలసిన వీరపత్నివి నీవెలే ఏ ఏ
భరతవంశమునేలవలసిన వీరపత్నివి నీవెలే
వీరధీర కుమారమణితో మరలవత్తువుగానిలే


వేయిశుభములు కలుగు నీకు పోయిరావే మరదలా
ప్రాణపదముగ పెంచుకుంటిమి నిన్ను మరవగలేములే
వేయిశుభములు కలుగు నీకు పోయిరావే మరదలా

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::ఆరభి::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు
గానం::ఘటసాల
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య

రాగం:::ఆరభి

తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా
తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా
ఎదుట నిలువమని మంత్రము వేసి
చెదరగనేలా జవరాలా
తపము ఫలించిన శుభవేళా..ఆ
బెదరగనేలా ప్రియురాలా


తెలిమబ్బులలో జాబిలి వలెనే
మేలి ముసుగులో దాగెదవేలా
తెలిమబ్బులలో జాబిలి వలెనే
మేలి ముసుగులో దాగెదవేలా
వలచి వరించీ మనసు
హరించీ నను దికురించగనేలా..ఆ..
తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా


చూపులతోనే పలుకరించుచు
చాటున వలపులు చిలకరించుచు
చూపులతోనే పలుకరించుచు
చాటున వలపులు చిలకరించుచు
కోరిక తీరే తరుణము రాగా
తీరా ఇపుడీ జాగేలా..ఆ..
తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::సింధుబైరవి::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘటసాల
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య

రాగం:::సింధుభైరవి!!

చాలదా ఈ పూజ దేవీ
చాలదా ఈ కొలువు దేవీ
నీ భక్తునింత నిరాదరణ చేయనేలా
చాలదా ఈ పూజ దేవీ


నీ వాలు చూపులే నా ప్రాణము
నీ మందహాసమే నా జీవము
తపము జపము చేసి అలసి సొలసి పోతినే
ఇక కనికరించి ఈ బాధను బాపవేలా
చాలదా ఈ పూజ దేవీ
చాలదా ఈ కొలువు దేవీ


నీ అందెల గల గలలే ప్రణవనాదము
నీ కంకణ రవళియే ప్రణయ గీతము
నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము
కరుణజూపి ఈ దీనుని కావవేలా
చాలదా ఈ పూజ దేవీ
చాలదా ఈ కొలువు దేవీ


నీవులేని నిముషాలే యుగములాయెనే
చెంతనుండి మాటలేని యోగమాయెనే
వరము కోరి ఈ చెరలో చిక్కుబడితినే
జాలి దలిచి ముక్తి నొసగ జాలమేలా
చాలదా ఈ పూజ దేవీ
చాలదా ఈ కొలువు దేవీ
నీ భక్తునింత నిరాదరణ చేయనేలా

చాలదా ఈ పూజ దేవీ

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::ఆభేరి::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::P.సుశీల,కోరస్
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B.సరోజాదేవి,S.వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య.
ఆభేరి::రాగం 

పల్లవి::

స్వాముల సేవకు వేళాయె వైలమ రారే చెలులార
స్వాముల సేవకు వేళాయె వైలమ రారే చెలులార
ఆశీర్వాదం లభించుగా చేసే పూజలు ఫలించుగా
స్వాముల సేవకు వేళాయె వైలమ రారే చెలులార


చరణం::1


ఎన్ని తీర్ధములు సేవించారో
ఎన్ని మహిమలను ఘనియించారో
విజయముచేసిరి మహానుభావులు
మనజీవితములు తరించగా
స్వాముల సేవకు వేళాయె వైలమ రారే చెలులార


చరణం::2


లీలాసుఖులో ఋష్యశృంగులో
మన యతీంద్రులై వెలసిరిగా
ఏమి ధ్యానమో మనలోకములో వుండరుగా
స్వాముల సేవకు వేళాయె వైలమ రారే చెలులార


ఏ ఏ వేళలకేవి ప్రియములో
ఆ వేళలకవి జరుపవలె
సవ్వడిచేయక సందడిచేయక
భయభక్తులతో మెలగవలె
వైలమ రారే చెలులార

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::మోహన::రాగ



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య.
రాగ:::మోహన :::

పల్లవి::

ఓ..ఓ..ఓ..ఓ..ఓ....
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంతగానముతో నీవు నటనసేయగనె


మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంతరాగముతో నీవు చెంతనిలువగనే

మనసు పరిమళించెనే తనువు పరవశించెనే

చరణం::1


నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.....
నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా


మనసు పరిమళించెనే ఆహాహా
తనువు పరవశించెనే ఓహోహో
నవవసంతరాగముతో నీవు చెంతనిలువగణె
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే


చరణం::2


క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
ఆ..హా..హా...ఆ..ఆ..
క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు ఘుమలు ఘుమలుగా జుంజుమ్మనిపాడగా
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే


చెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా
ఆహా..ఆహా...హా..ఆ..ఆ..
చెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా
రంగరంగ వైభవములతో ప్రకృతి విందుచేయగా


మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంతరాగముతో నీవు చెంతనిలువగనే
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::దేశ్:: రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు

రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,

అల్లు రామలింగయ్య.
రాగం:::దేశ్ 

పల్లవి::

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే


చరణం::1


నావలెనే నా బావకుడా నాకై తపములు చేయునులే
తపము ఫలించి నను వరియించి
తరుణములోనె విరాళ నన్ను చేరులే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే


అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే



చరణం::2

కుడికన్ను అదిరే కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచనులే
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే


చరణం::3


మల్లెతోరణముల మంటపమందె
కనులు మనసులు కలియునులే
కలసిన మనసుల కళరవళములతో
జీవితమంతా వసంతగానమౌనులే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే