సంగీతం::కోటి
రచన::J.సుధాకర్
గానం::K.J.ఏసుదాసు
సినిమా దర్శకత్వం::కామేశ్వరరావు బోయపాటి
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,సంఘవి.
పల్లవి::
ఏమి చేయగలదు ఏ సాగరమైనా
తన మీదే అలక బూని అలలు వెళ్ళి పోతుంటే
ఏమి చేయగలదు..ఏ హృదయమైనా
కంటిలో నలకుందని కలలు జారి పోతుంటే
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈ
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈఈ
జన్మనిచ్చి పెంచినా ప్రేమ ఎంత పంచినా
కడుపు కోత తప్పదు..ఈ దేవుడికీ..ఓ
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈ
చరణం::1
ఏడడుగులు వెనక నడిచీ ఎదలో సగమైన మనిషీ
ఇరుసు లేని బండినెక్కీ ఇల్లు విడిచి వెల్లిందా
ఇంటి దీపమౌతుందనీ..కంటి పాపలా చూస్తే
కన్న పేగు బంధమేమో..కన్ను పొడిచి పోయిందా
కొరివి తలకు పెట్టినోడు..కొడుకౌతాడింటా
కొరివి తలకు పెట్టినోడు..కొడుకౌతాడింటా
కొంపకు నిప్పెట్టినోడు..ఏమౌతాడంటా
ఏమౌతాడంటా?
బొమ్మలెన్ని చేసినా..ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు..ఆ బ్రహ్మయ్యకీ..ఈ
చరణం::2
కలి కాలపు జూదంలో కడుపు తీపి ఓడితే
వంచన తల తుంచైనా మంచి గెలవకుంటుందా
నావ తోడు లేదనీ..ఏరు ఒంటరౌతుందా
పొద్దు వాలి పోయిందనీ నింగి దిగులు పడుతుందా
కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు
కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు
నిప్పులాంటి నిజం విప్పి చెప్పేది ఎవరూ
చెప్పేది ఎవరూ?
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈ
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ..ఈ
జన్మనిచ్చి పెంచినా..ప్రేమ ఎంత పంచినా
కడుపు కోత తప్పదు..ఈ దేవుడికీ..ఓ
బొమ్మలెన్ని చేసినా..ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు..ఆ బ్రహ్మయ్యకీ..ఈ