సంగీతం::MS.విశ్వనాథన్
రచన::?
గానం::PB.శ్రీనివాస్,P.సుశీల
రాగం::శంకరాభరణం:::
అందాల ఓ చిలకా
అందుకో నా లేఖా
నా మదిలోని కలలన్నీ
ఇక చేరాలి నీదాకా
అందాల చెలికాడా
అందుకో నా లేఖా
నా కనులతొ రాసానూ..
నీ మదిలోన దాచాను
మిసమిసలాడే..వేందుకనీ
తళ తళలాడే వేమిటని
మిసమిసలాడే..వేందుకనీ
తళ తళలాడే వేమిటని
కురులు మోవిపై వాలే నేలనో
విరులు కురులలో నవ్వే నెందుకో
అడుగు తడబడే చిలక కేలనో
పెదవి వణికెనూ..చెలియ కెందుకో
అందాల ఓ చిలకా
అందుకో నా లేఖా
నా మదిలోని కలలన్నీ
ఇక చేరాలి నీదాకా
మిసమిసలాడే వయసోయి
తళతళలాడే కనులోయి
మిసమిసలాడే వయసోయి
తళతళలాడే కనులోయి
కురులు మోముపై మరులుగొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగు తడబడే సిగ్గుబరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో
అందాల చెలికాడా
అందుకో నా లేఖా
నా కనులతొ రాసానూ..
నీ మదిలోన దాచాను
అందాల ఓ చిలకా
అందుకో నా లేఖా
నా మదిలోని కలలన్నీ
ఇక చేరాలి నీదాకా
నీవే పాఠం నేర్పితివి
నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధురమార్గమూ మనసు చూపులే
నీవు పాడగా నీను ఆడగా
యుగము క్షణముగా గడచిపోవుగా
అందాల ఓ చిలకా..
అందుకో నాలేఖా
నా మదిలోని కలలన్నీ
ఇక చేరాలి నీదాకా