Sunday, January 01, 2012

దేవుడు చేసిన మనుషులు--1973
సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::దాశరథి 
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::N.T.రామారావు,కృష్ణ,S.V.రంగారావు,జయలలిత,విజయనిర్మల,కాంచన. 
పల్లవి

ఏయ్..అబ్బో..దోరవయసు చిన్నదీ..లారార లహా  
భలే జోరుగున్నదీ..లారార లహా   
దీని తస్సాదియ్యా..కస్సుమంటున్నది కవ్విస్తూ వున్నదీ           
దోరవయసు చిన్నదీ..లారార లహా
భలే జోరుగున్నదీ..లారార లహా  
దీని తస్సాదియ్యా..కస్సుమంటున్నది కవ్విస్తూ వున్నదీ
దోరవయసు చిన్నదీ..లారార అహా..అహా 

చరణం::1

ఏయ్..ఒళ్ళేలా వుంది..ఒళ్ళా   
ఒళ్ళు జల్లు మంటుంది..నిన్ను చూస్తే
యేదోలా వుంటుందీ..నిన్ను తాకితే
ఒళ్ళు జల్లు మంటుంది..నిన్ను చూస్తే
యేదోలా వుంటుందీ..నిన్ను తాకితే
ఊహూ...వుంటది ఒక్కటిస్తె
గూబ గుయ్..ఈఈ..అంటది 
ఒక్కటిచ్చి ఒక్కసారి..నీవాణ్ణి చేసుకో 
యెన్నటికీ మరువలేని యేన్నో..సుఖాలందుకో ఛీ..ఫో..అబ్బో       
దోరవయసు చిన్నదీ..లారార లహా
భలే జోరుగున్నదీ..లారార లహా    
దీని తస్సాదియ్యా..కస్సుమంటున్నది కవ్విస్తూ వున్నదీ  
దోరవయసు చిన్నదీ..లారార..   
అహ...అహ...ఒహో

చరణం::2

ఒళ్ళు మండిపోతుంది..నిన్ను చూస్తే
చెంప చెళ్ళు మటుందీ..హద్దు మీరితే
ఒళ్ళు మండిపోతుంది..నిన్ను చూస్తే
చెంప చెళ్ళు మటుందీ హద్దు మీరితే..అహ..అలాగా 
అలాగిలా గనుకోకు..అందరిలా నన్ను
చడా మడా పేలావో..చెరిగేస్తా చూడు అబ్బో..నిజంగ 
ఏ తారలోను నీ తీరులేదు..ఏ పువ్వులోను నీ నవ్వులేదు
దోరవయసు చిన్నదీ..లారార లహా
భలే జోరుగున్నదీ..లారార లహా    
దీని తస్సాదియ్యా..కస్సుమంటున్నది..కవ్విస్తూ వున్నదీ  
దోరవయసు చిన్నదీ..లారార లహా

దేవుడు చేసిన మనుషులు--1973
సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::శ్రీశ్రీ 
గానం::ఘంటసాల  
తారాగణం::N.T.రామారావు,కృష్ణ,S.V.రంగారావు,జయలలిత,విజయనిర్మల,కాంచన. 
పల్లవి

దేవుడు చేసిన మనుషుల్లారా..మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి మనుషుల గోల..కనండి దేవుడి లీల
వినండి మనుషుల గోల..కనండి దేవుడి లీల   
దేవుడు చేసిన మనుషుల్లారా..మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి మనుషుల గోల..కనండి దేవుడి లీల   
గోవింద హరి గోవింద..గోవింద భజ గోవింద 
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద

చరణం::1

వెన్నదొంగ ఆ వెన్నదొంగ..మా తొలి గురువు..మా తొలి గురువు
తొలినుంచే మా కులగురువు..మా కులగురువు 
కోరిన కోరిక తీరాలంటే..కోరిక మోక్షం రావాలంటే
గోపాలునే సేవించాలి..గోవిందునే ధ్యానించాలి
గోవింద హరి గోవింద..గోవింద భజ గోవింద 
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద
గోవింద గోవింద హరి గోవింద..గోవింద గోవింద భజగోవింద

వినండి దేవుడి గోల..కనండి మనుషుల లీల 
వినండి దేవుడి గోల..కనండి మనుషుల లీల     
దేవుడు చేసిన...మనుషుల్లారా
మనుషులు చేసిన...దేవుళ్ళారా  
వినండి దేవుడి గోల..కనండి మనుషుల లీల

చరణం::2

పేదల నెత్తురు తాల్చిన రూపం..బలిసిన జలగలు దాచిన పాపం
పేదల నెత్తురు తాల్చిన రూపం..బలిసిన జలగలు దాచిన పాపం
మానవులను పీడించే జబ్బు..దేవతలను ఆడించే డబ్బు 
మానవులను పీడించే జబ్బు..దేవతలను ఆడించే డబ్బు
తెలుపో నలుపో జాన్ దేవ్..ఆ తేడా లిక్కడ లేనేలేవ్ 
తెలుపో నలుపో జాన్ దేవ్..ఆ తేడా లిక్కడ లేనేలేవ్
లేనేలేవ్ వినండి డబ్బుల గోల..కనండి మనుషుల లీల
వినండి డబ్బుల గోల..కనండి మనుషుల లీల

చరణం::3

హేఏఏఏఏ..య్యా..  
గాలిబుడగ జీవితం..ఓటి పడవ యవ్వనం 
గాలిబుడగ జీవితం..ఓటి పడవ యవ్వనం
నిన్న మరల రాదు...రాదు రాదు
నేడే నిజం నేడే...నిజం నేడే నిజం
రేపు మనది...కాదు కాదు
నేడే సుఖం నేడే సుఖం..సుఖం సుఖం నేడే సుఖం
కాసే బ్రహ్మానందం..అహ డోసే పరమానందం 
కాసే బ్రహ్మానందం..అహ డోసే పరమానందం
ఆనందం పరమానందం..ఆనందం బ్రహ్మానందం
ఆనందం పరమానందం..ఆనందం బ్రహ్మానందం 
ఆనందం పరమానందం..ఆనందం బ్రహ్మానందం
ఆనందం పరమానందం..ఆనందం బ్రహ్మానందం 
వినండి గ్లాసుల గోల..కనండి మనుషుల లీల
వినండి గ్లాసుల గోల..కనండి మనుషుల లీల 
దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి గ్లాసుల గోల..కనండి మనుషుల లీల
    
చరణం::4

ఆలయాలలో వెలుతురు లేదు..ఆకాశంలో చీకటి లేదు 
ఆలయాలలో వెలుతురు లేదు..ఆకాశంలో చీకటి లేదు
విమానాలలో విహరిస్తుంటే..సముద్రాలనే దాటేస్తుంటే 
విమానాలలో విహరిస్తుంటే..సముద్రాలనే దాటేస్తుంటే
గుడిలో ఎందుకు రామయ్యా..విడుదలచెస్తాం రావయ్యా 
నిను విడుదలచేస్తాం...రావయ్యా 
గుడిలో ఎందుకు రామయ్యా..నిను విడుదలచేస్తాం రావయ్యా  
రామయ్యా రావయ్యా..రామయ్యా లేవయ్య
రామయ్యా రావయ్యా..రామయ్యా లేవయ్య

లేవయ్యా లేవయ్య లేవయ్య లేవయ్య లేవయ్య

డబ్బుకులోకం దాసోహం--1973సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::మాధవపెద్ది సత్యం 

పల్లవి

తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగని నాకొడుకెందుకు లోకంలో..సొరగలోక మగపడతది మైకంలో
తాగని నాకొడుకెందుకు లోకంలో..సొరగలోక మగపడతది మైకంలో
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా

చరణం::1

దేవేంద్రుడు తాగాడు..రంభతోటి ఆడాడు
బలరాముడు చుక్కేసి..బజార్లంట పడ్డాడు
కాళిదాసు తాగితాగి..కధలెన్నో పాడాడు
తాగినోడికున్న తెలివి..చెప్పడాని కెవిడికలివి         
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా

చరణం::2

తాటకి చాటుగవచ్చి..తాటిచెట్టు ఎక్కింది
విశ్వామిత్రుడు తనకు..లొట్టిడియ్యమన్నాడు
మారీచుడు సుబాహుడు..మాకెచాలదన్నారు..
మహా మహా వాళ్ళయినా..మందులేందే బతకలేరు      
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా

చరణం:3

యీవాడకెల్ల పేరుబడ్డ రౌడీగాణ్ణి..ఏయ్..కోపమొచ్చెనంటె చెడ్డతప్పుడోణ్ణి
ఎదురుచెప్పినోడి పీక నొక్కేస్తా..ఘుంటలోనబెట్టి గంటవాయిస్తా               
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా

చిల్లి గవ్వకైన గూడ చెల్లనివాళ్ళు
ఏసుకుంటె పెద్దమనుషులవుతారు
గవర్నమెంటు వాళ్ళుగూడా తాగమన్నరు
డబ్బులొస్తే అదే మాకు చాలునన్నారు..అందుకే

తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగుతా నీయవ్వ తాగుతా..తాగుబోతునాయాళ్ళ తల్లోదూరెల్లుతా
తాగని నాకొడుకెందుకు లోకంలో..సొరగలోక మగపడతది మైకంలో
సొరగలోక మగపడతది మైకంలో..సొరగలోక మగపడతది మైకంలో