Friday, August 08, 2014

మారిన మనిషి--1970



సంగీతం::T.V.రాజు
రచన::కోసరాజురాఘవయ్య
గానం::B.వసంత
తారాగణం::N.T.రామారావు,విజయనిర్మల,రామకృష్ణ,చలం,సత్యనారయణ,హేమలత.

పల్లవి::

చక్కని దొంగోడా..చిక్కని చిన్నోడా
ఎపుడో చిక్కేవు..నాకే చిక్కేవు
నేను నీదాన్నయా..వదిలి పోనీనయా
చక్కని దొంగోడా..చిక్కని చిన్నోడా

చరణం::1

నీకై వస్తే నే..తీపి మిఠాయి తెస్తే
రుచి చూడకుండా నిలిచి
మాటాడకుండ పోయేవా
చల్లకు వచ్చి..ముంతనుదాచి
చల్ల చల్లగా..జారేవయ్యా రాజా
ఆగవోయి రాజా

చరణం::2 

నిన్ను చూచి..ఆనందంలో మైమరచి
నా వాడవంటూ..తగిన సరి జోడువంటూ వలచాను
వలచిన చిన్నది..పిలుస్తు ఉంటే
చిలిపిగ ప్రుగులు..తీస్తావేమి రాజా తెలుసుకో రాజా

Maarina Manishi--1970
Msic::T.V.Raaju
Lyrics::KosaraajuRaaghavayya
Singer::B.Vasanta
Cast::N.T.Ramaravu,Vijayanirmala,Ramakrishna,Chalam,Satyanarayana,Hemalata.

:::::

chakkani dongODaa..chikkani chinnODaa
epuDO chikkEvu..naakE chikkEvu
nEnu needaannayaa..vadili pOniinayaa
chakkani dongODaa..chikkani chinnODaa

:::1

neekai vastE nE..teepi miThaayi testE
ruchi chUDakunDaa nilichi
maaTaaDakunDa pOyEvaa
challaku vachchi..muntanudaachi
challa challagaa..jaarEvayyaa raajaa
AgavOyi raajaa

:::2 

ninnu chUchi..AnandamlO maimarachi
naa vaaDavanTuu..tagina sari jODuvanTuu valachaanu
valachina chinnadi..pilustu unTE
chilipiga prugulu..teestaavEmi raajaa telusukO raajaa

మౌనరాగం--1987




సంగీతం::ఇళయరాజా
రచన::రాజశ్రీ
గానం::S.జానకి

ఓహో మేఘమొచ్చెను..ఏదో లాలి పాడెను
చినుకే పూల గాలులే..పలికె పసిడి గాథలే
పువ్వులపై అందాలే..వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం..ముచ్చటలే విరిసేను

ఓహో మేఘమొచ్చెను..ఏదో లాలి పాడెను

చరణం::1

నాలో ఊగేను సోయగం
రేగే ఊరేగే ఆశలే
నన్నే ఉడికించేనే బృందావనం
వయసు బంధాలు మీరెనే
ఈ పన్నీటిలో గారాలే చిందవా
ఓ అందాల గనికి పూమాలే వెయ్యరా
ఈ అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం
ఈ ఒయ్యారమంతా వలపించే జ్ఞాపకం
పులకరించి పలకరించెనే

ఓహో మేఘమొచ్చెను..ఏదో లాలి పాడెను

చరణం::2

కలలో ఈ నాటి జీవితం
ఆమని రాగాల బంధనం
వెండి మేఘాలలో ఊరేగుదాం
మధుర సంగీతం పాడుదాం
లే చిగురాకులై ఈనాడు మారుదాం
రా వినువీధిలోన నవ్వుల్లో పాకుదాం
ఈ పరువాలలోన శంఖాలై ఊగుదాం
రయ్ సెలయేరులై ఉరికురికి పొంగుదాం
ఇంత వింత వగలు పంచగా

ఓహో మేఘమొచ్చెను..ఏదో లాలి పాడెను
చినుకే పూల గాలులే..పలికె పసిడి గాథలే
పువ్వులపై అందాలే వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం ముచ్చటలే విరిసేను
ఓహో మేఘమొచ్చెను..ఏదో లాలి పాడెను
ఆహాఆఅపపపప్పప్పా.ఆహా

మగాడు--1976



సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు.P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,రామకృష్ణ,అంజలీదేవి,మంజుల,లత,కాంతారావు,జయమాలిని

పల్లవి::

సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది
సల సల సల సల కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే  ఊపిరి అవుతుంది
లలల లలల లలల..ఎందుకలా..ఏమిటలా   
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది

చరణం::1

విత్తనం..మొలకవుతుంది 
మొలకేమో..మొక్కవుతుంది 
మొక్కముదిరితే చెట్టవుతుంది చెట్టవుతుంది
విత్తనం..మొలకవుతుంది 
మొలకేమో..మొక్కవుతుంది 
మొక్కముదిరితే చెట్టవుతుంది చెట్టవుతుంది
ముద్దు పెరిగితే..పెరిగితే 
ముద్దు పెరిగితే..మోజవుతుంది మోజవుతుంది
లలల లలల లలల..ఎందుకలా..ఏమిటలా  
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే..ఊపిరి అవుతుంది

చరణం::2

కోరికేదో పులకిస్తుంది గుండెలోన కలకేస్తోంది 
కోరికేదో పులకిస్తుంది గుండెలోన కలకేస్తోంది
కొత్త కొత్తగా విసురోస్తుంది మెత్త మెత్తగా మెరుపొస్తుంది 
కొత్త కొత్తగా విసురోస్తుంది మెత్త మెత్తగా మెరుపొస్తుంది
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది

చరణం::3

మెరుపుంటే మబ్బుంటుంది మబ్బుంటేనే మెరుపుంటుంది 
మెరుపు మబ్బు ఒకటైతేనే..ఒకటైతేనే జల్లుకురుస్తుంది
మెరుపుంటే మబ్బుంటుంది మబ్బుంటేనే మెరుపుంటుంది 
మెరుపు మబ్బు ఒకటైతేనే జల్లుకురుస్తుంది
హరివిల్లు...పొడుస్తుంది
లలల లలల లలల..ఎందుకలా..ఏమిటలా 
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది
సల సల సల సల..కాగిన కొద్ది నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్ది వలపే ఊపిరి అవుతుంది