Tuesday, August 12, 2014

కన్నతల్లి--1972



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,సావిత్రి,చంద్రకళ,నాగభూషణం,రాజబాబు,సంధ్యారాణి,M.ప్రభాకర్‌రెడ్డి 

పల్లవి::

నువ్వు కావాలి..నీ నవ్వుకావాలీ
నీతోటి వుండాలీ..నే నవ్వుతు వుండాలీ

నువ్వు కావాలి..నీ నవ్వుకావాలీ
నీతోటి వుండాలీ..నే నవ్వుతు వుండాలీ

చరణం::1

అద్దమందు నాకు నేనే..ముద్దువచ్చే వేళలో
ఆపలేని పొంగులేవో..హద్దుమీరే వయసులో  
హద్దుమీరే పొంగులాపి..ముద్దుచేసేటందుకు 
ముద్దు వొచ్చే నీకు నేనే..అద్దమయ్యేటందుకు  
నువ్వు కావాలి..నీ నవ్వుకావాలీ
నీతోటి వుండాలీ..నే నవ్వుతు వుండాలీ

చరణం::2

దుడుకుచేసే దోరవయసు..వురకలెత్తే వేళలో
పడుచువానికి పండువెన్నెల..పగైపోయే జాములో
నిమిష నిమిషం వులికిపడుతూ..నిదుర చెదరే రేయిలో
నిన్నకలలే కన్నెమనసు..నెమరువేసే హాయిలో      
నువ్వు కావాలి..నీ నవ్వుకావాలీ
నీతోటి వుండాలీ..నే నవ్వుతు వుండాలీ

చరణం::3

వల్లమాలిన వలపులన్నీ..ఒళ్లు విరిచేటందుకు
ఆశలన్నీ అలసిపోయి..ఆవులించేటందుకు 
ఒకరి కొకరు వోడిపొయి..ఒక్కటయ్యేటందుకు
పగలురేయి ఒకటిచేసి..పరవశించేటందుకు     
నువ్వు కావాలి..నీ నవ్వుకావాలీ
నీతోటి వుండాలీ..నే నవ్వుతు వుండాలీ

నువ్వు కావాలి..నీ నవ్వుకావాలీ
నీతోటి వుండాలీ..నే నవ్వుతు వుండాలీ