Sunday, January 30, 2011

జగన్మోహిని--1978

సంగీతం::విజయకృష్ణమూర్తి
గాత్రం::బాలు,సుశీల
నిర్మాత & దర్శకత్వం::బి.విఠలాచార్య
సంస్థ::విఠల్ ప్రొడక్షన్స్
నటీ,నటులు::నరసింహరాజు,ప్రభ,జయమాలిని,సావిత్రి

పల్లవి::

సాగే అలలపైన..ఊగే చందమామ
సాగే అలలపైన..ఊగే చందమామ
మనసు కనులలో..చూడు దాగున్నాడు..ఈ చందమామ
మనసు కనులలో..చూడు దాగున్నాడు..ఈ చందమామ
సాగే అలలపైన..ఊగే చందమామ

చరణం::1

ఎగిసే చినుకులలో..అర తడిసిన వెన్నెలలో
ఎగిసే చినుకులలో..అర తడిసిన వెన్నెలలో
ఆ తడిసిన వెన్నెల..ముడిలేయించిన సడలని కౌగిలిలో
చలిలో నులివేడి..కలలు కందామా
సాగే అలలపైన..ఊగే చందమామ

చరణం::2

వలచిన గుండెలలో..వెలికుబికిన పొంగులలో
వలచిన గుండెలలో..వెలికుబికిన పొంగులలో
ఆ ఉబికిన పొంగుల మాటున..దాగని ఊహల అలజడిలో  
జడిలో చెలరేగి..రేగి పోదామా

సాగే అలలపైన..ఊగే చందమామ
మనసు కనులలో చూడు..దాగున్నాడు..ఈ చందమామ
సాగే అలలపైన..ఊగే చందమామ

Friday, January 28, 2011

హారతి--1974సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణం రాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి,రమాప్రభ,నిర్మల,హలం 

పల్లవి::

ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే చూడాలి
ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే చూడాలి
చప్పుడు చేయని నీ కనురెప్పల సరిగమలే వినాలి..వినాలి ఆహాహా
ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే..ఏఏఏ..చూడాలి

చరణం::1
              
ఒకే..ఏ..అడుగులో ఇద్దరి అడుగులు ఒద్దికగా ఇమడాలి
ఒకే..ఏ..గొంతులో ఇద్దరి మనసులు ఊసులాడుకొవాలి
బాస చేసుకోవాలి..ఆహా..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్ హూ     
చప్పుడు చేయని నీ కనురెప్పల సరిగమలే వినాలి..వినాలి   
ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే..ఏఏఏ..చూడాలి

చరణం::2
                 
తెలుగులోని తేనెలన్నీ నీ జీలుగు పెదవులు అందివ్వాలి 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
తెలుగులోని తేనెలన్నీ నీ జీలుగు పెదవులు అందివ్వాలి
చైత్ర పూర్ణిమల కళలన్నీ..ఈ..మ్మ్..నీ చిరునవ్వులలో 
విరబూయాలి..విరబూయాలి..ఆహా..ఆహా..ఆహా..హ్హా..హా 
చప్పుడు చేయని నీ కనురెప్పల సరిగమలే వినాలి..వినాలి   
ఎప్పుడూ నిన్నే ఇలాగే చూడాలి ఇలాగే..ఏఏఏ..చూడాలి

Monday, January 24, 2011

అన్వేషణ--1985


సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి 
గానం::S.జానకి 

:::::::::


పపగ..పపగ..పపగ..పపగ   
పపగ పస..పపగ పస..ఎదలో లయ
ఎగసే లయ..ససమ..నినిరి 
ససమ నినిరి..గగగ..మమమ..ససస..ససస..ససస 
ఎదలో లయ..ఎగసే లయ..యెగసే ఎగిరి..ఎదలో వొదిగీ
సుకమా..స్వరమ..హికమ..పదమ..సుకమ

గా...గ...హా...హ...
దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం
సొదనే నా జీవనం సాధనేలే జీవితం
వ్యతలే శృతులై కలిసే ఆలాపన 
వెతికి వెతికి బ్రతికె అన్వేషణ
నాలో నేడే విరులవాన

ఎదలో లయ ఎగసే లయ యెగసే ఎగిరి 
ఎదలో ఒదిగీ..స్వరమ హికమ పదమ సుఖమ

చరణం::1

కోకిల దీపం తుమ్మెద నాదం 
కోకిల దీపం తుమ్మెద నాదం 
జలజల పాడే సెలగానం 
ఘుమఘుమలాడే సుమరాగం
అరెరె..ఆ.ఆ.ఆ.ఆ..ఆ..ఆ.
కొండకోన..ఎండవాన..ఏకమైన ప్రేమగీతం
అవునా..మైన..నీవే..నేనా..
సుక పికముల కలవరముల స్వరలహరులలో

సససస..దదదద..పపపప..రిరిరిరి ..ఇనినిని సససస
రిరిరిరి ..ఇనినిని సససస

చరణం::2

కలికి చిలక పలకేదేమో..ఒడిలోప్రియుడే వొదిగినవేళ
విరుల తెరలో జరిగేదేమో..మరులే పొంగి పొరలిన వేళ 
కలికి చిలక పలకేదేమో..ఒడిలోప్రియుడే వొదిగినవేళ

సససస..సససస..విహంగమా..సంగీతమా..

విహంగమా..సంగీతమా....  
సంగీతమే విహాంగమై చరించగా
స్వరాలతో..వనాంతమే జ్వలించగా..
ఎన్నాళ్ళు సాగాలి ఏకాంత అన్వేషణ 
అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో

కలికి చిలక పలకేదేమో..ఒడిలోప్రియుడే వొదిగినవేళ
విరుల తెరలో జరిగేదేమో..మరులే పొంగి పొరలిన వేళ 
కలికి చిలక పలకేదేమో..ఒడిలోప్రియుడే వొదిగినవేళ

సససస దదదద పపపప సససస దదదద పపపప AnwEshaNa--1985
Music::Ilayaraaja
Lyrics::Veturi
Singer::S.Janaki

:::::

papaga..papaga..papaga..papagaగ   
papaga pasa..papaga pasa edalO laya  
egasE laya..sasama niniri 
sasama niniri..gagaga..mamama..sasasa..sasasa..sasasa  
edalO laya..egasE laya..yegasE egiri..edalO vodigii
sukamaa..swarama..hikama..padama..sukama 

gaa...ga...haa...ha...
divyamE nee darSanam SraavyamElE spandanam
sodanE naa jeevanam saadhanElE jeevitam
vyatalE SRtulai kalisE Alaapana 
vetiki vetiki bratike anvEshaNa
naalO nEDE virulavaana

edalO laya egasE laya yegasE egiri 
edalO odigii..swarama hikama padama sukhama

::::1

kOkila deepam tummeda naadam 
kOkila deepam tummeda naadam 
jalajala paaDE selagaanam 
ghumaghumalaaDE sumaraagam
arere..aa.aa.aa.aa..aaa..aa.
konDakOna..enDavaana..Ekamaina prEmageetam
avunaa..maina..neevE..nEnaa..
suka pikamula kalavaramula swaralaharulalO

sasasasa..dadadada..papapapa..riririri ..ininini sasasasa
riririri ..ininini sasasasa

::::2

kaliki chilaka palakEdEmO..oDilOpriyuDE vodiginavELa
virula teralO jarigEdEmO..marulE pongi poralina vELa 
kaliki chilaka palakEdEmO..oDilOpriyuDE vodiginavELa

sasasasa..sasasasa..vihangamaa..sangeetamaa..

vihangamaa..sangeetamaa....  
sangeetamE vihaangamai charinchagaa
swaraalatO..vanaantamE jwalinchagaa..
ennaaLLu saagaali Ekaanta anwEshaNa 
alikiDi erugani tolakari velugulalO

kaliki chilaka palakEdEmO..oDilOpriyuDE vodiginavELa
virula teralO jarigEdEmO..marulE pongi poralina vELa 
kaliki chilaka palakEdEmO..oDilOpriyuDE vodiginavELa

sasasasa dadadada papapapa sasasasa dadadada papapapa 

Friday, January 21, 2011

వేట--1986సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P. సుశీల


ఎదురు చూసిన జాబిలీ..నిదురలేచిన రాతిరీ
కలవరింతల ఆకలీ..కలువ కన్నుల కౌగిలీ
ఎదలపొదల్లో..వలపులయల్లో మోగే సన్నాయీ
ఎదురు చూసిన జాబిలీ..నిదురలేచిన రాతిరీ

పున్నమొచ్చెను నాగులబుసతో..పూవులుపూచెను గాలుల ఖసితో
వేసుకో..పెనవేసుకో..ముద్దుగా..ముడివేసుకో..
చెరకు చేనుల ఇడుపు నీడల..చెరిసగమౌదమొ..
మరచిపోయిన మనసులోతుల..ఒకటైపోదామే..
తీపిగా తాపమారగా..తీరగా చపలతీరగా..
ఎదురు చూసిన జాబిలీ..నిదురలేచిన రాతిరీ

నాకు నచ్చిన సొగసులరుచితో..ఈడువచ్చిన ఇద్దరి జతలో
జంటనే..జడలల్లుకో..వంటితో..వలవేసుకో..
తనివితీరగా..తనువు అంచులు చెరిపేసేద్దామూ..
వలపుతీరక వలపు మంచులు దులుపేసేద్దామో..
పూవులో తుమ్మెదలాడగా..తేనేలో తానమాడగా

ఎదురు చూసిన జాబిలీ..నిదురలేచిన రాతిరీ
కలవరింతల ఆకలీ..కలువ కన్నుల కౌగిలీ
ఎదలపొదల్లో..వలపులయల్లో మోగే సన్నాయీ

Thursday, January 20, 2011

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్--1976
సంగీతం::పెండ్యల నాగేశ్వరరావ్ 
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::S.P.బాలు,L.R.ఈశ్వరీ 
దర్శకత్వం::బాపు 
తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,జగ్గయ్య,G.వరలక్ష్మి,రమాప్రభ,కాంతారావు,
అల్లు రామలింగయ్య

పల్లవి::

ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్నుఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ
ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్ను ఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ
కన్నెర్ర చెయ్యవద్దు నీ కత్తి నూరవద్దు
కన్నతల్లివని నిన్ను తలుచుకుందుమేపొద్దు         
ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్ను ఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ

చరణం::1

గుండె ఝల్లు మనిపించు..నీ రూపు
అమ్మ కొట్టవచ్చినట్టుండు..నీ చూపు
అమ్మో..అమ్మా..అమ్మో..అమ్మా
అమ్మా..అమ్మా..అమ్మా..అమ్మా
అమ్మలగన్నమ్మ ఆంకాళ శక్తివమ్మ
నీ కన్నా దైవం ఈ లోకంలో లేదమ్మా
నీ కన్నా దైవం ఈ లోకంలో లేదమ్మా                
అమ్మ ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్ను ఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ

చరణం::2

ముడుపులుగట్టీ మొక్కేవాళ్ళను
ముందు నిలిచి కాపాడేవమ్మా
అమ్మో..అమ్మో..అమ్మో..అమ్మో 
కుంభాలను చెల్లించే వాళ్ళకు కోరిక లిచ్చేనమ్మా
అమ్మా..అమ్మా..అమ్మా..అమ్మా..అమ్మా
ముడుపులుగట్టీ మొక్కేవాళ్ళను
ముందు నిలిచి కాపాడేవమ్మా
కుంభాలను చెల్లించే వాళ్ళకు కోరిక లిచ్చేనమ్మా
ఆపదలను దీర్చేవమ్మా మమ్మాదుకునే దేవతవమ్మా
సంబరాలతో చిందులు తొక్కీ జాతర చేస్తామే మాయమ్మా  
ఏటిగట్టు పోలేరమ్మో..ఓఓఓ 
నిన్ను ఏటేటా కొలిచెవమ్మో..ఓఓ
నీకు ఏటపోతు నిచ్చేవమ్మో..ఓఓ

చరణం::3

మహిషాసురుని బట్టి మర్ధించినావు
ఊరూరా నీ మహిమ చూపించినావు
మహిషాసురుని బట్టి మర్ధించినావు
ఊరూరా నీ మహిమ చూపించినావు
నిన్ను గొల్వనివాళ్ళ నిన్ను నమ్మనివాళ్ళ
బలిబలోయని పట్టి తలలు రాల్చేవమ్మో..ఓఓ

Wednesday, January 19, 2011

కులదైవం--1960


సంగీతం::మాస్టర్ వేణు
రచన::కొసరాజు
గానం::ఘంటసాల, జమునారాణి
తారాగణం::జగ్గయ్య,కృష్ణకుమారి,అంజలీదేవి,గుమ్మడి,చలం,గిరిజ,పేకేటి

పల్లవి::

పదపదవే వయ్యారి గాలిపటమా 
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి 
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం::1

ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
ఓ..ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా 

పదపదవే వయ్యారి గాలిపటమా 
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి 
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం::2

అహహా హా హా..ఓహో..హో..
నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక
ఆ..నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక
రాజులెందరూడినా మోజులెంత మారినా 
తెగిపోక నిల్చె నీ తోక 

పదపదవే వయ్యారి గాలిపటమా 
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి 
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం::3

అహహా..అహహా..అహహాఆఆ  
అహహా..ఆహహా..ఆఆ 
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో 
వగలాడివిలే జగదంతవులే
దిగిరాకుండా ఎటులుందువులే

పదపదవే వయ్యారి గాలిపటమా 
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి 
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

Kula Daivam--1960
Music::Master Venu
Lyrics::Kosaraju, Samudrala Jr
Singer's::Ghantasaala & Jamuna Rani
Dir::Kabir Das

Cast::Gummadi, Jaggayya, Chalam, 
Anjali Devi, Krishna Kumari, Girija


:::

padapadave vayyaari gaalipatamaa 
padapadave vayyaari gaalipatamaa
paina pakshilaagaa egiripoyi 
pakkachoopu choosukuntoo
tirigedave gaalipatamaa
padapadave vayyaari gaalipatamaa

:::1

premagolalona chikkipoyinaavaa
nee priyudunna chotukai poduvaa
o.premagolalona chikkipoyinaavaa
nee priyudunna chotukai poduvaa
nee talukantaa nee kulukantaa
adi enduko telusunu antaa 

padapadave vayyaari gaalipatamaa 
padapadave vayyaari gaalipatamaa
paina pakshilaagaa egiripoyi 
pakkachoopu choosukuntoo
tirigedave gaalipatamaa
padapadave vayyaari gaalipatamaa

:::2

ahahaa haa haa..oho..ho..
neeku evarichchaare birudu toka
koni techchaavemo antegaaka
aa..neeku evarichchaare birudu toka
koni techchaavemo antegaaka
raajulendaroodinaa mojulenta maarinaa 
tegipoka nilche nee toka 

padapadave vayyaari gaalipatamaa 
padapadave vayyaari gaalipatamaa
paina pakshilaagaa egiripoyi 
pakkachoopu choosukuntoo
tirigedave gaalipatamaa
padapadave vayyaari gaalipatamaa

:::3

ahahaa..ahahaa..ahahaaaaaa  
ahahaa..aahahaa..aaaa 
neeli mabbullo aadukunduvemo
minta chukkalto navvukunduvemo
neeli mabbullo aadukunduvemo
minta chukkalto navvukunduvemo 
vagalaadivile jagadantavule
digiraakundaa etulunduvule

padapadave vayyaari gaalipatamaa 
padapadave vayyaari gaalipatamaa
paina pakshilaagaa egiripoyi 
pakkachoopu choosukuntoo
tirigedave gaalipatamaa
padapadave vayyaari gaalipatamaa

Tuesday, January 18, 2011

నాకు ఇస్టమైన మన తెలుగుదేశం పాట
( ఈ పాట వినే ముందు నన్ను క్షమించి పాట వినండి

నా రైటింగ్ లో బోలేడు తప్పులున్నట్లు అనిపించాయి
నా నెట్టు స్పీకర్లు కాస్త గరగర సౌండు చేసి
వినేందుకు చాలా ఇబ్బంది కలిగించి నందుకు సరిగ్గా రాయలేక పోయాను
మీకు తప్పులు తెలిస్తే మెస్సెజి మూలముగా తెలిపినారంటే
నాకు సరిదిద్దుకొనే అవకాషం ఇచ్చిన వారవుతారు
ధన్యవాదాలు... )


పోంగరా ఉప్పోంగి ఓ తెలుగు బిడ్డా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
ఓహో......హరహరం ప్రణవమున ఓంకార నాదాన

త్వర ప్రభుత్వపు నీడ సీమదొరలాజాడా..ఆ..
కుంటుతూ..బ్రతుకుటే జాతికే సిగ్గురా..ఆ..జాతికే సిగ్గురా..
ముక్కోటి తమ్ములను ఒక్కటిగ నిలబెట్టీ..
మెడబట్టి తెల్లోళ్ళ నెట్టి గెంటాలిరా..
మెడబట్టి తెల్లోళ్ళ నెట్టి గెంటాలిరా..

పోంగరా ఉప్పోంగి ఓ తెలుగు బిడ్డా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
ఓహో......హరహరం ప్రణవమున ఓంకార నాదాన
హరహరం ప్రణవమున ఓంకార నాదాన

పలనాటి చంద్రునీ వెలుగు విప్లమ ధాటీ..ఈ..
నాగులేటీ నాద పుగఫుగల పగ ఖాటూ ..
రాణి రుద్రమ రౌద్ర రోషాన లజ్జానా...ఆ..
స్త్రీ మహా శక్తిరా..ఆ..శ్రీరామ రక్షరా..ఆ..
స్త్రీ మహా శక్తిరా..ఆ..శ్రీరామ రక్షరా..

పోంగరా ఉప్పోంగి ఓ తెలుగు బిడ్డా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
స్వాతంత్ర విప్లవ సమర రంగానా..
ఓహో......హరహరం ప్రణవమున ఓంకార నాదాన
హరహరం ప్రణవమున ఓంకార నాదాన

గోదావరీ పరుగు..క్రిష్ణవేణీ ఉరకా..ఆ..
పర్వతాలే రగులు..మన్యతేజముతో..
తెలుగు గద్దే నీకు నివ్వాలులెట్టా..ఆ..
తొడగొట్టి జైకొట్టు జయముకొనరారా...ఆ...
తొడగొట్టి జైకొట్టు జయముకొనరారా...ఆ...5

ప్రమీలార్జునీయము--1965
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల
నటీ నటులు::N.T.R, B.సరోజ, కాంతారావు
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీ.శే.ఎన్.టి.రామారావు గారి 15వ వర్థంతిని (జనవరి 18, 2011)

పల్లవి::

అతి ధీరవే గాని, మాట మాట
అతి ధీరవే గాని, అపురూప రమణివే
అతి ధీరవే గాని, అపురూప రమణివే
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త

చరణం::1

నీ సుకుమార ఠీవికి మురిసి ఓ...
నీ సుకుమార ఠీవికి మురిసి
నీ అసమాన ధాటికి దడిసి
ఎవని కనులు చెదరునో,
నీకు దిష్టి తగులునొ తరుణీ
అతి ధీరవే గాని, అపురూప రమణివే
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త

చరణం::2

నీ నయగారమే సెలయేరుగా,
నీ అనురాగమే సుడిగాలిగా ఆ..ఆ..
నీ నయగారమే సెలయేరుగా,
నీ అనురాగమే సుడిగాలిగా
ఎవడు మూర్ఛ మునుగునో,
నీ మనసు కరుగునొ జవ్వనీ
అతి ధీరవే గాని, అపురూప రమణివే
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త

చరణం::3

నీ క్రీగంట విరిసిన చూపులు ఓ..ఓ..
నీ క్రీగంట విరిసిన చూపులు
అహ ప్రాణాల నొరిసే చూపులే
ఎవని గుండెలదరునో
నీకు జాలి కలుగునొ రమణీ
అతి ధీరవే గాని, అపురూప రమణివే
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త

Friday, January 14, 2011

బంగారు తల్లి--1971సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::P.సుశీల,పిఠపురం,శ్రీహరిరావు
తారాగణం::జగ్గయ్య,జమున,శోభన్‌బాబు,కృష్ణంరాజు,వెన్నిరడై నిర్మల,నాగభూషణం,బేబి శ్రీదేవీ   

పల్లవి::

ఒహోహో..ఒహోహో
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ

చరణం::1

చిచ్చుబుడ్లతో మతాబాలతో..చీకటి చిత్తయి పోయేనురా  
చిచ్చుబుడ్లతో మతాబాలతో..చీకటి చిత్తయి పోయేనురా  
చితికిపోయినా మన బ్రతుకులో..ఆశల వెన్నెల కాసెనురా  
చితికిపోయినా మన బ్రతుకులో..ఆశల వెన్నెల కాసెనురా
ఆశల వెన్నెల..కాసెనురా     
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ

చరణం::2

ఒక్కడు పదిమందిని దోచు తిను 
టక్కు టమారం సాగదురా..ఇక సాగదురా
ప్రజాశక్తి నెదిరించేవాడికి..పలికేదిక్కే ఉండదురా
పలికే దిక్కే..ఉండదురా    
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ

చరణం::3

అన్యాయ కాలమ్ము..మారాలి మారాలి
అక్రమాల ఆటలింక..అందరు అరికట్టాలి
పల్లెటూళ్లు భాగ్యంతో..కలకలలాడాలయ్యా
కలకలలాడాలయ్యా
ఆనందం పొంగి పొరలి..చిందులు వెయాలయ్యా            
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
ఎంతో కన్నుల పండగ..ఎంతో కన్నుల పండగ..ఎంతో కన్నుల 

బ్లాగ్ మిత్రులందరికి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు...

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా …. రావమ్మా !!!

1:గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
తెల్లారి పోయింది పల్లె లేచింది
తెల్లారి పోయింది పల్లె లేచింది
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది

2:కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా … రావమ్మా… కృష్ణార్పణం ….పాడిచ్చే గోవులకు పసుపు కుంకం ..


పనిచేసే బసవనికీ పత్రీ పుష్పంగాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం …కలకాలం సౌఖ్యం
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం …కలకాలం సౌఖ్యం


పల్లె తల్లికి వందనం- పసిడి తల్లికి వందనం
భాగ్య రాసులు పంచిపెట్టే పల్లె తల్లికి వందనం


।పల్లె తల్లికి వందనం |

ఏరు తల్లికి వందనం-హోరు తల్లికి వందనం
ఏటిఊటలు పంచిపెట్టే ఏటి తల్లికి వందనం

।పల్లె తల్లికి వందనం |

శాంతి తల్లికి వందనం- కాంతి తల్లికి వందనం
శాంతి కాంతులు పంచిపెట్టే పల్లె తల్లికి వందనం

।పల్లె తల్లికి వందనం |
ఆత్మీయుడు--1977


సంగీతం::J.V.రాఘవులు 
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.P.బాలు, P.సుశీల 

పల్లవి:: 

అల్లో మల్లో..ఓ..ఆకాశంలో..ఓ..చల్లని వెన్నెల్లో 
ఆశలెన్నో..ఊసులెన్నో అల్లరి కన్నుల్లో..నీ అల్లరి కన్నుల్లో 

అల్లో మల్లో..ఓ..ఆకాశంలో..ఓ..చల్లని వెన్నెల్లో 
ఆకలెంతో..దూకుడెంతో..పోకిరి కన్నుల్లో..నీ పోకిరి కన్నుల్లో

చరణం::1 

ఎర్రని సిగ్గు ఎగబాకింది..నున్నని బుగ్గల్లో 
చిలిపి కోరికా చెడుగుడాడినది..జిలిబిలి చూపుల్లో..ఓ.. 
ఎర్రని సిగ్గు ఎగబాకింది..నున్నని బుగ్గల్లో 
చిలిపి కోరికా చెడుగుడాడినది..జిలిబిలి చూపుల్లో 

దోబూచాడే నవ్వుల్లో..తొందర తెలిపే పెదవుల్లో 
దోబూచాడే నవ్వుల్లో..తొందర తెలిపే పెదవుల్లో 
తొణుకుతున్నది తొలకరి వలపు..ముద్దుల ముడుపుల్లో..ఓ..ఓ.. 

అల్లోమల్లో..ఓ..ఆకాశంలో..ఓ..చల్లని వెన్నెల్లో 
ఆశలెన్నో..ఊసులెన్నో అల్లరి కన్నుల్లో..నీ అల్లరి కన్నుల్లో 

చరణం::2 

తొలి హాయి చూడాలి..తొలి రేయిలో 
తొలి ముద్ర వెయ్యాలి..తొలి ముద్దులో 
తొలి హాయి చూడాలి..తొలి రేయిలో 
తొలి ముద్ర వెయ్యాలి..తొలి ముద్దులో 

మరుపొద్దు పొడవాలి..నీ మోములో..ఓ.. 
మరుపొద్దు పొడవాలి..నీ మోములో..ఓ.. 
మైమరచిపోవాలి..ఆ గోములో..ఆ గోములో 

అల్లోమల్లో..ఓ..ఆకాశంలో..ఓ..చల్లని వెన్నెల్లో 
ఆకలెంతో..దూకుడెంతో..పోకిరి కన్నుల్లో..నీ పోకిరి కన్నుల్లో

చరణం::3

విరబుయ్యాలి మోజుల జాజులు..వెచ్చని కౌగిళ్ళో
ఆ వెచ్చదనాలు వెంటపడాలి..ఒంటరి వేళల్లో..ఓ.. 
విరబుయ్యాలి మోజుల జాజులు..వెచ్చని కౌగిళ్ళో 
ఆ వెచ్చదనాలు వెంటపడాలి..ఒంటరి వేళల్లో 

నలిగిన పువ్వుల గుసగుసలో..నాలుగు కన్నుల అలసటలో 
నలిగిన పువ్వుల గుసగుసలో..నాలుగు కన్నుల అలసటలో 
ఇద్దరి ఒద్దిగ కనిపించాలి..పొద్దుటి వెలుగుల్లో..ఓ.. 

అల్లో మల్లో..ఓ..ఆకాశంలో..ఓ..చల్లని వెన్నెల్లో 
ఆశలెన్నో..ఊసులెన్నో..అల్లరి కన్నుల్లో 
ఆకలెంతో..దూకుడెంతో..పోకిరి కన్నుల్లో 
నీ అల్లరి కన్నుల్లో..నీ పోకిరి కన్నుల్లో


Atmeeyudu--1977
Music::J.V.Raghavulu
Lyrics::Acharya - Atreya
Singer's::S.P.Baalu,P.Suseela

:::: 

allo mallo..o..aakaasamlo..o..challani vennello 
aasalenno..oosulenno allari kannullo..nee allari kannulloO 

allo mallo..o..aakaasamlo..o..challani vennello 
aasalenno..oosulenno allari kannullo..nee allari kannullo
aakalento..dookudento..pOkiri kannullo 
nee allari kannullo..nee pokiri kannullo

::::1 

errani siggu egabaakindi..nunnani buggallo 
chilipi korikaa chedugudaadinadi..jilibili choopullo..o.. 
errani siggu egabaakindi..nunnani buggallo 
chilipi korikaa chedugudaadinadi..jilibili choopullo

doboochaade navvullo..tondara telipe pedavullo 
doboochaade navvullo..tondara telipe pedavullo 
tonukutunnadi tolakari valapu..muddula mudupullo..o..o.. 

allo mallo..o..aakaasamlo..o..challani vennello 
aasalenno..oosulenno allari kannullo..nee allari kannullo

::::2 

toli haayi choodaali..toli reyilo 
toli mudra veyyaali..toli muddulo 
toli haayi chooDaali..toli raeyilo 
toli mudra veyyaali..toli muddulo 

marupoddu podavaali..nee momulo..o.. 
marupoddu podavaali..nee momulo..o.. 
maimarachipovaali..aa gomulo..aa gomulo 

allo mallo..o..aakaasamlo..o..challani vennello 
aasalenno..oosulenno allari kannullo..nee allari kannullo

::::3

virabuyyaali mojula jaajulu..vechchani kaugillo
aa vechchadanaalu ventapadaali..ontari velallo..o.. 
virabuyyaali mojula jaajulu..vechchani kaugiLLo 
aa vechchadanaalu veMTapaDaali..ontari velallo 

naligina puvvula gusagusalo..naalugu kannula alasatalo 
naligina puvvula gusagusalo..naalugu kannula alasatalo 
iddari oddiga kanipinchaali..podduii velugullo..o.. 

allo mallo..o..aakaasamlo..o..challani vennello 
aasalenno..oosulenno allari kannullo..nee allari kannullo
aakalento..dookudento..pOkiri kannullo 

nee allari kannullo..nee pokiri kannullo

Thursday, January 13, 2011

భోగిమంటలు--1981


సంగీతం::రమేష్‌నాయుడు
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల,బృందం
Film Directed By::Vijayanirmala
తారాహణం::కృష్ణ,సుధాకర్,గుమ్మడి,సత్యనారాయణ,రతి,గీత,అంజలీదేవి,జయమాలిని,జ్యోతిలక్ష్మీ,హెలన్.

పల్లవి::

భోగుల్లో భోగుల్లో..భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల..భోగుల్లో

భోగుల్లో భోగుల్లో..భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల..భోగుల్లో

చరణం::1

గొబ్బియల్లో గొబ్బియల్లో..
గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు 
గొబ్బియల్లో గొబ్బియల్లో..
గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు 

గుమ్మడంటే గుమ్మడు..మాయదారి గుమ్మడు
కొప్పులో పూలెట్టి..కుపర్లోకి లాగాడు  

గొబ్బియల్లో గొబ్బియల్లో..
గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు 

కుప్పల్లో ఇల్లున్న అల్లుణ్ణే..కొప్పమ్మ
అత్తింటి కెళదాము రమ్మంటే..తప్పమ్మా?

తప్పొప్పులిప్పుడే..తలబోసుకొందామా
తలలంటుకొన్నాక..తలబోసుకొందామా

గొబ్బియల్లో గొబ్బియల్లో..
గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలు 

భోగుల్లో భోగుల్లో..భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల..భోగుల్లో

చరణం::2

హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరికోసమైతే..తపస్సులు హరి హరీ
హరిదాసుకైతే..కాసులు హరి హరీ
దాసుని తప్పులు దండంతో సరి..ఈ.. 
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి
హరిలోరంగ హరి..హరిలోరంగ హరి..మ్మ్ 

సరిలో రంగ సరి..సరిలో రంగ సరి
సరిలో రంగ సరి..సరిలో రంగ సరి
దండం అంటే రెండర్థాలు..
చేతులు రెండు కలిపేదొకటి..మాటలు నిండుగ వేసేదొకటి
యేయ్..చేతులు రెండు కలిపేదొకటి..మాటలు నిండుగ వేసేదొకటి
సరిలో రంగ సరి..సరిలో రంగ సరి
సరిలో రంగ సరి..సరిలో రంగ సరి
సరా హరా..సరా హరా..మ్మ్..హు..సరి సరీ
హరిలోరంగ హరీ..

భోగుల్లో భోగుల్లో..భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల..భోగుల్లో

చరణం::3

బావలవీపుల తప్పెట్లోయ్..కాగినకొద్ది చప్పట్లోయ్
బావలవీపుల తప్పెట్లోయ్..కాగినకొద్ది చప్పట్లోయ్ 
అవి ఊగిన కొద్దీ..ముచ్చట్లోయ్..ఊగిన కొద్దీ..ముచ్చట్లోయ్

మరదళ్ళు బుగ్గలు బొబ్బట్లోయ్..కొరికినకొద్ది దిబ్బట్లోయ్
హోయ్..మరదళ్ళు బుగ్గలు బొబ్బట్లోయ్..కొరికినకొద్ది దిబ్బట్లోయ్
అవి దొరికేదాకా ఇక్కట్లోయ్..దిబ్బట్లోయ్..బొబ్బట్లోయ్

భోగుల్లో భోగుల్లో..భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల..భోగుల్లో
తెల్లారకుండానె..పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల..భోగుల్లో

Bhogi Mantalu--1981
Music::RameshNayudu
Lyrics::Avharya - Atreya
Singer's::S.P.Balu,P.Suseela
Film Directed By::Vijayanirmala
C::Krishna,Sudhaakar,Gummadi,Satyanaaraayana,Rati,Geeta,Anjaliidevi,Jayamaalini,Jyotilakshmii,Helan.

::::::::::::::::::::::::::::::::::

bhOgullO bhOgullO..bhOgabhaagyaala bhOgullO
bhOgimanTala..bhOgullO
tellaarakunDaane..pallepallantaanu
errani kaantula..bhOgullO
tellaarakunDaane..pallepallantaanu
errani kaantula..bhOgullO

bhOgullO bhOgullO..bhOgabhaagyaala bhOgullO
bhOgimanTala..bhOgullO
tellaarakunDaane..pallepallantaanu
errani kaantula..bhOgullO

::::1

gobbiyallO gobbiyallO..
gobbemma koppuna gummaDipoolu 
gobbiyallO gobbiyallO..
gobbemma koppuna gummaDipoolu 

gummaDanTE gummaDu..maayadaari gummaDu
koppulO pooleTTi..kuparlOki laagaaDu  

gobbiyallO gobbiyallO..
gobbemma koppuna gummaDipoolu 

kuppallO illunna alluNNE..koppamma
attinTi keLadaamu rammanTE..tappammaa?

tappoppulippuDE..talabOsukondaamaa
talalanTukonnaaka..talabOsukondaamaa

gobbiyallO gobbiyallO..
gobbemma koppuna gummaDipoolu 

bhOgullO bhOgullO..bhOgabhaagyaala bhOgullO
bhOgimanTala..bhOgullO
tellaarakunDaane..pallepallantaanu
errani kaantula..bhOgullO
tellaarakunDaane..pallepallantaanu
errani kaantula..bhOgullO

::::2

harilOranga hari..harilOranga hari
harilOranga hari..harilOranga hari
harikOsamaitE..tapassulu hari harii
haridaasukaitE..kaasulu hari harii
daasuni tappulu danDamtO sari..ii.. 
harilOranga hari..harilOranga hari
harilOranga hari..harilOranga hari..mm 

sarilO ranga sari..sarilO ranga sari
sarilO ranga sari..sarilO ranga sari
danDam anTE renDarthaalu..
chEtulu renDu kalipEdokaTi..maaTalu ninDuga vEsEdokaTi
yEy..chEtulu renDu kalipEdokaTi..maaTalu ninDuga vEsEdokaTi
sarilO ranga sari..sarilO ranga sari
sarilO ranga sari..sarilO ranga sari
saraa haraa..saraa haraa..mm..hu..sari sarii
harilOranga harii..

bhOgullO bhOgullO..bhOgabhaagyaala bhOgullO
bhOgimanTala..bhOgullO
tellaarakunDaane..pallepallantaanu
errani kaantula..bhOgullO
tellaarakunDaane..pallepallantaanu
errani kaantula..bhOgullO

::::3

baavalaveepula tappeTlOy..kaaginakoddi chappaTlOy
baavalaveepula tappeTlOy..kaaginakoddi chappaTlOy 
avi Ugina koddii..muchchaTlOy..Ugina koddii..muchchaTlOy

maradaLLu buggalu bobbaTlOy..korikinakoddi dibbaTlOy
hOy..maradaLLu buggalu bobbaTlOy..korikinakoddi dibbaTlOy
avi dorikEdaakaa ikkaTlOy..dibbaTlOy..bobbaTlOy

bhOgullO bhOgullO..bhOgabhaagyaala bhOgullO
bhOgimanTala..bhOgullO
tellaarakunDaane..pallepallantaanu
errani kaantula..bhOgullO
tellaarakunDaane..pallepallantaanu

errani kaantula..bhOgullO

తిరుపతి--1974::బౌళీ::రాగంసంగీతం::చక్రవర్తి  
రచన::కోసరాజురాఘవయ్యా   
గానం::S.జానకి,చక్రవర్తి 
తారాగణం::రాజబాబు,సత్యనారాయణ,మురళీమోహన్,జయసుధ,నిర్మల,జయలక్ష్మి,అల్లు రామలింగయ్య
బౌళీ::రాగం   

పల్లవి::

పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ         
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ         
తిరిగి రాకుంటే తిరపతీ..ఏమిటయ్యా మాగతీ తిరపతీ  
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ         

చరణం::1

బచ్చాలాట లాడుకొని..చొక్కాలను చింపుకున్నాం
గోలీకాయ దెబ్బలతో..గుండ్లు పగల గొట్టుకున్నాం
చిట్ట చివరికిలా నిన్ను ఒక్కణ్ణే..పంపుతున్నాం..ఓ 
తిరపతీ..ఈ..తిరపతీ..ఈ..తిరపతీ..ఈ  
చిట్ట చివరికిలా నిన్ను..ఒక్కణ్ణే పంపుతున్నాం   
బిక్క మొగం బెట్టకుండ..భీముడల్లే ఎల్లిరారా    
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ         

చరణం::2

గట్టిగట్టి గోలీలు గుట్టలు..గుట్టలు వుంటాయంట
గుట్టుచప్పుడు కాకుండా నాలుగు..నాలుగు
నాలుగు..నాలుగు..గోలీలు..గోలీలు కొట్టుకొస్తావా
బొమ్మల సిగరెట్టు పెట్టెలూ..బజారునిండా వుండేనంటా
బరువని నువ్వనుకోకుండా..దొరికినవన్నీ తెస్తావా
బస్తీ రుచి మరిగి..మా నేస్తం వదిలేస్తావా
పోయిరారా తిరపతీ..పట్నం పోయిరారా తిరపతీ

చరణం::3

మీ రడిగినవన్నీ తేస్తా..నా కొక మాటిస్తారా
ఇస్తాం...  
నాన్నిచ్చిన కర్రలు ఆకులు..కాపాడుతు వుంటారా
ఓ....ఉంటాం  
మా అమ్మను చెల్లిని..వెయ్యికళ్ళ చూస్తారా..ఆఆఆ 
ఒరేయ్ చలపతీ..నాయనా గణపతీ..కాస్త చూస్తూ వుండండి
మా అమ్మను చెల్లిని..వెయ్యికళ్ళ చూస్తారా
చేతిలో చెయ్యెయ్యండి..వెళ్ళొస్తా వుండండి
పోయిరారా తిరపతీ..పొయొస్తా వుండరా చలపతీ   
పోయిరారా తిరపతీ..పొయొస్తా వుండరా గణపతీ   


Monday, January 10, 2011

ఇంటి కోడలు--1974
సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు 
Film Directed By::Lakshmii Deepak
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,గుమ్మడి,చంద్రమోహన్,మిక్కిలినేని,రావికొందలరావు,సాక్షిరంగారావు,మాడా,K.K.శర్మ,రమణారెడ్డి(అతిధి),ప్రమీల,S.వరలక్ష్మి,P.R.వరలక్ష్మీ,రోజారమణి,శ్రీరంజని,మాలతి,సూర్యకళ,సుశీల,సుధామాల,
  
పల్లవి::

ఓ..ఓ..ఓ..ఆ ఆ ఆ ఆ 
రావా..ఆ..ననుచేరలేవా
రావా..ఆ..ననుచేరలేవా   
ఎటుచూసినా పడుచు జంటలే
ఎటుచూసినా వలపు పంటలే
ప్రతినిమిముషం నినుచూసీ
నీ కోసం చెయిసాచీ 
విధిలేక లోలోన విలపించుటేనా  
రావా..రావా..రావా..రావా..ననుచేరలేవా 

చరణం::1

నిను నిన్నుగా నేను వలచాను..ఊ
నా మనసంతా నీ చేత నిలిపాను
ఆ మూగ మనసే విసిరేసినావు
అనురాగ బంధం తెగగోసినావు
ఇంకా..ఆఆఆఆఆ..కసితీర లేదా 
ఎన్నాళ్ళు యీ నరక బాధ  
ఎన్నాళ్ళు యీ నరక బాధ  
రావా..రావా..రావా..రావా..ననుచేరలేవా

చరణం::2

ఉన్నాము ఒక యింటిలోన..ఆ 
కాని ఎన్నెన్ని కనరాని పరదాలో 
చేరుకున్నాము ఒక పానుపుపైన..ఆ 
కాని ఎన్నెన్ని దరిలేని దూరాలో..ఓఓ
నువ్వు ఎదటుండి ఎంతెంత విరహం
నేను బతికుండి ఇది వింత మరణం

Sunday, January 09, 2011

భక్తతుకారం --- 1973
సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::D.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల

సరిసరీ..వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా..ఆ..ఆ..ఆ..ఆ..2


చెంతకు రమ్మని చేరనంటినా..ఆ..ఆ..
చెక్కిలి నొక్కిన కూడదంటినా..ఆ..ఆ..ఆ..2
తొలిఝామైనా కానిదే..తొలిఝామైనకానిదే
తొదర ఎందుకు ఎందుకంటిరా...ఆ..ఆ..
సరిసరీ....

ఆ..ఆ..ఆ..మంచిగంధం పూయకముందే..
మల్లెమొగ్గలు చల్లకముందే...2
కులుకుటందెలు మొగకముందే...
కొత్తజావళి పాడకముందే...
గరిస నిపమప...ససని ససనిసని...
నినిప నినిపనిప..మగప మనిప..పపని పమగమ...
గపమగననిస...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కొత్తజావళి పాడకముందే...
కంటిగిలుపుల..జంట తలుపుల..కొంటిచేతల..
కవ్వింత లింకేల...చలించవేరా...ఆ...ఆ...
సరిసరీ.....

పండువెన్నెల పానుపుచేసి..పైట కొంగున వీవన చేసి
వేడిముద్దులు కానుక చేసి..వీడనికౌగిట బంధీ చేసి
ఎన్నడెరుగని..వన్నె తరగని..కన్నెవలపులు అందించి
అందాలు చిందింతులేరా.....ఆ..ఆ..ఆ...

భక్తతుకారం --- 1973


సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::వేటూరి
గానం::రామక్రిష్ణ

పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..అదే మోక్షతీరం
వేదసారం..మధురం..మధురం
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..

ఎంతపాడుకొన్నా..అంతులేని కావ్యం..2
ఎన్నిమార్లు విన్నా..నవ్యాతి నవ్యం ..
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..

పాండురంగ సన్నిధీ..మాసిపోని పెన్నిధీ..2
ప్రభువుని కరుణ లేనిదీ..జగతిని ఏమివున్నదీ..
పాండురంగ నామం..పరమపుణ్యధామం
పాండురంగ నామం..

దాసులైనవారికీ..దాసుడీవుకాదా..2
ధన్యజీవులారా..అందుకొండి రాం రాం
అందుకొండి రాం రాం..అందుకొండి రాం రాం
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..
పాండురంగ హరిజగ..రామక్రిష్ణ హరిజగ..4

పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ..విఠల విఠల పాండురంగ
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం
జై జై తుకారాం..జై జై తుకారాం

మనుషులు - మట్టిబొమ్మలు--1974సంగీతం::B.శంకర్
రచన::C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం:కృష్ణ,జగ్గయ్య,గుమ్మడి,అల్లు రామలింగయ్య,జమున,సావిత్రి,రమాప్రభ,జ్యోతిలక్ష్మి 

పల్లవి::

నీలో విరిసిన అందాలన్నీ 
నాలో వీడని బంధాలాయె
ఓ..నీలో పలికిన రాగాలన్నీ
నాలో శ్రావణ మేఘాలాయె
మ్మ్ మ్మ్..నీలో విరిసిన అందాలన్నీ 
నాలో వీడని బంధాలాయె

చరణం::1

అల్లరి గాలి నిమిరే దాకా 
మల్లె మొగ్గకు తెలియదు..ఏమనీ
తానొక తుమ్మెదకై తపియించేననీ
తానొక తుమ్మెదకై తపియించేననీ
మూగ కోరికా ముసిరే దాకా
మూగ కోరికా ముసిరే దాకా
మూసిన పెదవికి తెలియదు .. ఏమనీ
తానొక ముద్దుకై తహతహలాడేనని
తానొక ముద్దుకై తహతహలాడేనని
ఆ కోరికలే ఇద్దరిలోనా 
ఆ కోరికలే ఇద్దరిలోనా
కార్తీక పూర్ణిమలై వెలగాలి

నీలో విరిసిన అందాలన్నీ 
నాలో వీడని బంధాలాయె
ఓఓఓఓ..

చరణం::2

మధుమాసం వచ్చే దాకా మామిడిగున్నకు తెలియదు...ఏమనీ
తానొక వధువుగా ముస్తాబైనాననీ 
తానొక వధువుగా ముస్తాబైనాననీ
ఏడు అడుగులు నడిచేదాకా
ఏడు అడుగులు నడిచేదాకా
వధూవరులకే తెలియదు..ఏమనీ
ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ 
ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ
ఆ బంధాలే ఇద్దరిలోనా 
ఆ బంధాలే ఇద్దరిలోనా
కార్తీక పూర్ణిమలై వెలగాలి

నీలో విరిసిన అందాలన్నీ 
నా..లో వీడని బంధాలాయె
ఓ..ఓ..ఓ..
నీలో పలికిన రాగాలన్నీ 
నా..లో శ్రావణ మేఘాలాయె

భక్తతుకారం--1973

సంగీతం::P.ఆదినారాయణ రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల


పూజకు వేళాయెరా!
రంగా..పూజకు వేళాయెరా..ఆ..ఆ..
పూజకు వేళాయెరా..

ఇన్నినాళ్ళు నే నెటుల వేచితినో..
ఇన్నిరేలు ఎంతెంత వేగితినో..2
పిలుపునువిని విచ్చేసితివని..నా..2
వలపులన్ని నీకొరకే దాచితిని
ఎవరూ..పోందని ఏకాంత సేవలో
ఈ వేళ తనిదీర గా నిన్నేఅలరించు

||పూజకు వేళాయెరా..ఆ..ఆ..ఆ
పూజకు వేళాయెరా..||

ఈ నీలి నీలి ముంగురులు ఇంద్రనీలాల మంజరులు
ఈ వికసిత సిత నయనాలు శతదళకోమల కమలాలు
అరుణారుణమీ అధరమూ...తరుణ మందార పల్లవము
ఆఆఆఆఆఆఆఆ....ఆఆఆఅ
ఎదలో పొంగిన ఈ రమణీయ పయొధరాలు..ఊ..ఊ..
ఫాలకడలిలో ఉదయించు సుధాకలశాలు..ఆఆఆఅ..
ఎంతసుందరము శిల్ప బంధురము
ఈ జఘన మండలము సృష్టి నంతటిని
దాచుకొన్న ఆ పృధివీ మండలము............

ఓ....అభినవ సౌదర్యరాశీ...
ఓ...అపూర్వ చాతుర్యమూర్తీ
నీ కటాక్షముల లాలనమ్ములో నీ మధురాధర చుంబనమ్ములో...
మధురిమలెన్నో పొదుగుకొన్న నీస్తన్య సుధల ఆస్వాదనమ్ములో
అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో...
హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున
జన్మించేభాగ్యమే లేదాయె తల్లీ...తల్లీ...తల్లీ.....

స్వామీ!!......

వచనం::: అవునమ్మ....నీవు ప్రదర్శించిన సౌదర్యము అనిత్యము
నీవు నమ్ముకొన్న యవ్వనము అసాస్వితము

దువ్వుకొన్న నీ నీలిముంగురులే దూదిపింజలై పోవునులే..
నవ్వుతున్న ఆకంటివెలుగులే..దివ్వెల పోలిక ఆరునులే..
వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే..వాడి వత్తులై పోవునులే..
పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే..
నడుము వంగగా...నీ ఒడలు క్రుంగగా..నడువలేని నీ బడుగు జీవితము
వడ వడ వణుకునులే...ఆశలురేపే సుందరహేహను అస్థిపంజరమౌనులే

సంసారం సాగరం--1974సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె
గానం::P.సుశీల
తారాగణం::S.V.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ. 

పల్లవి::

దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ

చరణం::1

చేతులు కాల్చుకునే..సిసింద్రీలకన్నా
కళ్ళు జిగేలనే..మతాబాలకన్నా
చేతులు కాల్చుకునే..సిసింద్రీలకన్నా
కళ్ళు జిగేలనే..మతాబాలకన్నా
నలుగురూ కిలకిల..నవ్వినపుడే పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్  
ఉన్నంతలో కడుపునిండ..తిన్నపుడే పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు 

చరణం::2

తారాజువ్వల్లా ఎగిరి ఎగిరి పడక
చిమ్మిన రవ్వల్లా చెల్లాచెదురుకాక
తారాజువ్వల్లా ఎగిరి ఎగిరి పడక
చిమ్మిన రవ్వల్లా చెల్లాచెదురుకాక
ఒకటిగా కలిసి మెలిసి ఉన్నపుడే పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్ 
ఉన్నంతలో కడుపునిండ..తిన్నపుడే పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ

చరణం::3

అమావాశ్య చీకటిలో ప్రమిదలే వెలుగులు
అమ్మకు నాన్నకూ పిల్లలే దివ్వెలు
అమావాశ్య చీకటిలో ప్రమిదలే వెలుగులు
అమ్మకు నాన్నకూ పిల్లలే దివ్వెలు
పరువుగా ఆ పిల్లలు బ్రతికినపుడె పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్  
ఉన్నంతలో కడుపునిండ తిన్నపుడె పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు

Saturday, January 08, 2011

భక్తతుకారం--1973::దర్భారు::రాగం
సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల


రాగం::దర్భారు

ఉన్నావా..అసలున్నావా..
ఉంటే కళ్ళుమూసుకొన్నావా..
ఈ లోకం కుళ్ళు చూడకున్నావా..
ఉన్నావని కనుగొన్నామని
మున్నెందరెందరో అన్నారు..
ఉన్నావని చూస్తున్నావని
నమ్మియెందరో ఉన్నారు....

||ఉన్నావా..అసలున్నావా..||

నీ పేరిట వంచన పెరుగుతువుంటే..
నీ ఎదుటే హింసలు జరుగుతువుంటే
మనిషిని మనిషి దోస్తూ వుంటే
మంచికి సమాధికడుతూ వుంటే
రాతిబొమ్మవై నిలిచావు చేతకాని వాడనిపించావు

||ఉన్నావా..అసలున్నావా..||

నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను
సేవలు చేసాను నా బ్రతుకే నైవేద్యం చేసాను
చేసిన మేలును మరిచేవాడ నువ్వాదేవుడివీ???
నువ్వొక వ్యర్థుడివీ.......
హూ...నీకొక పేరూలేదు...రూపంలేదు..
నీతీలేదు..నియమంలేదు..నిజానికి..నువ్వేలేవు..లేవు..లేవూ..

||ఉన్నావా..అసలున్నావా..|
|

కూతురు-కోడలు--1971సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల 
తారాగణం::శోభన్ బాబు,రామ్మోహన్,ప్రభాకర రెడ్డి,గీతాంజలి,జయలలిత,రావికొండలరావు

పల్లవి::

చిన్నారి బాలల్లారా..రారండి  
ఎన్నెన్నో వింతలున్నై..చూడండి

చరణం::1

తెలుగువారి రాజధాని..తెలుసా 
మీకు చెప్పండి..ఓ హైద్రాబాద్ 
ఆ ఇదే ఇదే మన..భాగ్యనగరం 
ఇదే..హైదరాబాదు
దేశమంతటా తిరిగి..చూసినా 
దీనికి ధీటేలేదు..దీనికి ధీటేలేదు
చిన్నారి బాలల్లారా..రారండి  
ఎన్నెన్నో వింతలున్నై..చూడండి

చరణం::2

చాచా నెహ్రూ పేరిట చల్లగ వెలసెను 
ఈ తోట...చాచా నెహ్రూ
చాచా నెహ్రూ పేరిట చల్లగ వెలసెను 
ఈ తోట పులులు..జింకలు చిలకలూ
పులులు జింకలు చిలకలూ..కలుసుకున్నవి ఈ చోట
చిన్నారి బాలల్లారా రారండి..ఎన్నెన్నో వింతలున్నై చూడండి

చరణం::3

అదిగో అదిగో అదిగో..కో అంటే ఓ అంటుంది 
గోలకొండఖిల్లా..గోలకొండఖిల్లా..కో కో కో కో
ఇదిగో ఇదిగో రాముని గుడికై బ్రతుకర్పించిన రామదాసు చెఱసాలా 
రామదాసు చెఱసాలా..మన రామదాసు చెఱసాలా

చరణం::4

బాల్యంలోనే భవితవ్యానికి..బంగరు బాటలు వేయాలి 
నేటి బాలలే రేపటి పౌరులు..నిజం తెలుసుకుని మెలగాలి 
నేటి బాలలే రేపటి పౌరులు..నిజం తెలుసుకుని మెలగాలి 
చిన్నారి బాలల్లారా రారండి..ఎన్నెన్నో వింతలున్నై చూడండి

Friday, January 07, 2011

ఇంటింటి రామాయణం--1979

సంగీతం::రాజన్ - నాగేంద్ర
రచన::కొంపల్లె శివరాం
గానం::S.P.బాలు,P.సుశీల
నవత ఆర్ట్స్ వారి
దర్శకత్వం::.P. సాంబశివరావు
 తారాగణం::రంగనాథ్,ప్రభ,చంద్రమోహన్,జయసుధ,నూతన్‌ప్రసాద్,గిరిబాబు,రమాప్రభ.  పల్లవి::

ఏ..హే..హే హే..ఏ..
ఆ..హా..ఆ..హా..ఆహా..ఆ ఆ

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా

చరణం::1

అరవిరిసిన పూలలోనే..నీ అందం తూచనా
ఊరించే మోవిలోనే..తేనియలే దోచనా
కలసిన మన చూపుతోనే..కాలాన్నే ఆగనీ
బంధించే చేతులందూ..ఊయలనై ఊగనీ
నీ దోరనవ్వు విరజాజిపూవు పరువాలు రువ్వు పాలపొంగులో

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా

చరణం::2

ఉసిగొలిపే కొండగాలీ..వేడంత పంచనా
కవ్వించే పొంగులన్నీ..రవికై బిగియించనా
చిరుచెమటలు పోయువేళా..గుండెల్లో నిండిపో
గుండెల్లో నిండిపోయీ..ఊపిరివై ఉండిపో
ఈ కొండకోన అందాలలోన..సుధలొలకబోవుపూలబాటలో

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
లలలలా..లలలలా..లలలలా  

Intinti Ramayanam--1979
Music:: Rajan-Nagendra 
Lyrics::Kompalle Sivaram 
Singer's::S.P.Baalu,P.Suseela
Cast : Chandra mohan, Ranganath, Jaya sudha,Nutan Prasad,Prabha.
Directed by::P.Sambasiva Rao 

:::

E..hE..hE hE..E..
A..haa..A..haa..Ahaa..A A

ii taruNamu..valapE SaraNamu
jagamulE sagamugaa..yugamulE kshaNamugaa
mounanga..saaganii..tanuvantaa rEganii
mounanga..saaganii..tanuvantaa rEganii
ii taruNamu..valapE SaraNamu
jagamulE sagamugaa..yugamulE kshaNamugaa

:::1

aravirisina poolalOnE..nee andam toochanaa
UrinchE mOvilOnE..tEniyalE dOchanaa
kalasina mana chooputOnE..kaalaannE Aganii
bandhinchE chEtulandoo..Uyalanai Uganii
nee dOranavvu virajaajipoovu paruvaalu ruvvu paalapongulO

ii taruNamu..valapE SaraNamu
jagamulE sagamugaa..yugamulE kshaNamugaa
mounanga..saaganii..tanuvantaa rEganii
mounanga..saaganii..tanuvantaa rEganii
ii taruNamu..valapE SaraNamu
jagamulE sagamugaa..yugamulE kshaNamugaa

:::2

usigolipE konDagaalii..vEDanta panchanaa
kavvinchE pongulannii..ravikai bigiyinchanaa
chiruchemaTalu pOyuvELaa..gunDellO ninDipO
gunDellO ninDipOyii..Upirivai unDipO
ii konDakOna andaalalOna..sudhalolakabOvupoolabaaTalO

ii taruNamu..valapE SaraNamu
jagamulE sagamugaa..yugamulE kshaNamugaa
mounanga..saaganii..tanuvantaa rEganii
mounanga..saaganii..tanuvantaa rEganii
ii taruNamu..valapE SaraNamu
jagamulE sagamugaa..yugamulE kshaNamugaa
lalalalaa..lalalalaa..lalalalaa  

Thursday, January 06, 2011

భక్తతుకారం--1973
సంగీతం::ఆదినారాయణరావ్
రచన::వేటూరి
గానం::ఘంటసాల


ఓ...నరుడా...పామరుడా..చిందులువేయకురా
శ్రీరంగ నీతులు చెప్పకురా..2
తెలిసీ తెలియని అజ్ఞానముతో..2
ప్రజలను వంచన చేయకురా..2

తనకంతా తెలుసునని తనమాటే వేదమని
తానే ఒక ఘనుడని తలచే నరుడా పామరుడా
తానెవరో తెలుసుకొనీ తన తప్పులు దిద్దుకొని
తన బాధ్యత గ్రహించువాడే జ్ఞాని విజ్ఞాని
విత్తముపై ఆశలు విడిచి చిత్తముతో రంగని కొలిచి
పరమార్థం గ్రహించరా..తత్వం తెలిసి తరించరా

|| చిందులు వేయకురా...||

తిరుచూర్ణం ధరింపగానే ...2
తీర్థాలే తరించగానే..
ఎంతటి వాడైన భక్తుడు కాలేడు కాబోడు
నీ మనసే మందిరమైతే నామాటే సుందరమైతే
తుకారామును బ్రోచినరంగడు నిత్యం నీలో వసించురా

|| చిందులు వేయకురా...||

బంట్రోతు భార్య--1974సంగీతం::రమేష్‌నాయుడు    
రచన::సినారె 
గానం::P.సుశీల,S.P.బాలు  
తారాగణం::చలం,కృష్ణంరాజు,అల్లు రామలింగయ్య,బాలకృష్ణ,విజయనిర్మల,సూర్యకాంతం,నిర్మల    

పల్లవి::

మల్లెపువ్వులా తెప్పగట్టీ..ఉల్లి పూల తెరచాపెత్తీ 
తెప్పమీద తేలిపోదామా..చల్ మోహన రంగా తెలియరానీ తీరం చూదామా
మల్లెపువ్వులా తెప్పగట్టీ..ఉల్లి పూల తెరచాపెత్తీ
తెప్పమీద తేలిపోదామా..చల్ మోహనాంగీ తెలియరానీ తీరం చూదామా 

చరణం::1
  
పైట చెంగు పందిరి కిందా..బాసలేవో చేసుకుంటూ
ఒకరి కంటి పాపలోనా..ఒకరి నీడ చూసుకుంటూ
పైట చెంగు పందిరి కిందా..బాసలేవో చేసుకుంటూ
ఒకరి కంటి పాపలోనా..ఒకరి నీడ చూసుకుంటూ
గోరువెచ్చని కలలే కందామా..చల్ మోహన రంగా ఊరి ఊసే మరచిపోదామా
మల్లెపువ్వులా తెప్పగట్టీ..ఉల్లి పూల తెరచాపెత్తీ
తెప్పమీద తేలిపోదామా..చల్ మోహన రంగా తెలియరానీ తీరం చూదామా 

చరణం::2

మనసే ఒక పానుపు చేసీ..వలపే ఒక తలగడ చేసీ
మనసే ఒక పానుపు చేసీ..వలపే ఒక తలగడ చేసీ
విదిపోని కౌగిలిలో పగలూ...రేయీ ముడివేసీ
కలకాలం కాపురముందామా..చల్ మోహనాంగీ ఇలనే ఒక స్వర్గం చేదామా
మల్లెపువ్వులా తెప్పగట్టీ...ఉల్లి పూల తెరచాపెత్తీ
తెప్పమీద తేలిపోదామా..చల్ మోహనాంగీ
చల్ మోహన రంగా..తెలియరానీ తీరం చూదామా 

Wednesday, January 05, 2011

సుమంగళి--1965


సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.B.శ్రీనివాస్,S.జానకి

పల్లవి::

అతడు::
ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది 
ఏవేవో..

ఆమె::
ఏవేవో వలపు తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో..

చరణం::1

అతడు::
కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి
అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది
కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి
అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది

ఆమె:
మరపురాని తొలిరేయి మరల రానిది
మరపురాని తొలిరేయి మరల రానిది
మగువ జీవితాన ఇదే మధురమన్నది

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది 
ఏవేవో

చరణం::2

అతడు:
ఒక్క క్షణం

ఆమె:
మ్మ్ మ్మ్ మ్మ్ 

అతడు:
ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది
కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది
ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది
కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది

ఆమె:
కన్నె మనసు ఏవేవో కలలు కన్నది
కన్నె మనసు ఏవేవో కలలు కన్నది
ఆ కలల రూపు ఈ రేయే కాంచమన్నది
అతడు::మ్మ్ మ్మ్హు..
ఆమె:ఆహా!

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది 
ఏవేవో

చరణం::3

అతడు::
తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి
తీసియున్న తలపులను మూయమన్నది
తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి
తీసియున్న తలపులను మూయమన్నది

ఆమె::
మనసు తోటి తనువుకూడ నీది కానున్నది
మనసు తోటి తనువుకూడ నీది కానున్నది
మనుగడ ఈ నాటితో మనది కానున్నది 

ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది 
ఏవేవో