Friday, August 24, 2007

ఆత్మబంధువు--1962



సంగీతం::KV. మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

చదువు రాని వాడవని దిగులు చెందకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

!! చదువు రాని వాడవని దిగులు చెందకు !!

యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను

!! చదువు రాని వాడవని దిగులు చెందకు !!

తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మ అని
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హౄదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హౄదయం ఉన్న చాలు
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

!! చదువు రాని వాడవని దిగులు చెందకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు !!

ఆత్మబంధువు--1962



రచన::ఆత్రేయ
సంగీతం::మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు వొట్టి చవటలయ్యారు

!! అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి !!

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివెయ నెంచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు భ్రమసెనొక్కడు

!! అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి !!

కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసేను
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసెను
కంటిపాప కంటె యెంతో గారవించేను
కంటిపాప కంటె యెంతో గారవించేను
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగేను తానుండసాగేను

!! అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి !!

నాది నాది అనుకున్నది నీది కాదుర
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
నాది నాది అనుకున్నది నీది కాదుర
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
కూరిమి గలవారంత కొడుకులేనురా
కూరిమి గలవారంత కొడుకులేనురా
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా కుక్క మేలురా

!! అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి !!