Sunday, December 05, 2010

దేవదాసు--1953


సంగీతం::C.R.సుబ్బరామన్ 
రచన::సముద్రాల సీనియర్ 
గానం::జమునారాణి,ఉడుతా సరోజిని
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,s.v.రంగారావు.  


పల్లవి::

ఓ..దేవదా..ఓ..పార్వతీ..
చదువు ఇదేనా..అయ్యవారూ నిదరోతే 
తమరూ ఇలాగే..దౌడో దౌడా..
ఓ..దేవదా..

ఓ..దేవదా..
చదువు ఇదేనా..అయ్యవారూ నిదరోతే 
తమరూ ఇలాగే..దౌడో దౌడా..
ఓ..దేవదా..చరణం::1

కూనలమ్మ మర్రిలో గిజిగాళ్లున్నాయే
పడితే వాటముగా పట్టుపడేనే
కూనలమ్మ మర్రిలో గిజిగాళ్లున్నాయే
పడితే వాటముగా పట్టుపడేనే
బడిమానే ఎడముంటే
ఎపుడూ ఇలాగే ఆటే ఆట
బడిమానే ఎడముంటే
ఎపుడూ ఇలాగే ఆటే ఆట
ఓ..పార్వతీ..

చరణం::2 

రెక్కరాని కూనలే..పడితే పాపమే
బడిలో నేర్పినదీ..ఈ చదువేనా
రెక్కరాని కూనలే..పడితే పాపమే
బడిలో నేర్పినదీ..ఈ చదువేనా

బడిలోనే చదువైతే
బ్రతుకూ ఇలాగే బెదురూ పాటే 
బడిలోనే చదువైతే
బ్రతుకూ ఇలాగే బెదురూ పాటే
ఓ..పిరికి పార్వతీ..

చరణం::3 

తేలెనులే నీ బడాయి
చాలునులే ఈ లడాయి
తేలెనులే నీ బడాయి
చాలునులే ఈ లడాయి
లడాయిలా సరే మనకు
జిలాయిలోయ్ జిలాయిలోయ్
లడాయిలా సరే మనకు
జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ..అన్నా ఊ..అన్నా
అలిగిపోయే ఉడుకుమోతా
ఆ..అన్నా ఊ..అన్నా
అలిగిపోయే ఉడుకుమోతా 
రా రా పిరికి పార్వతీ..
పో పో దుడుకు దేవదా..

దేవదాసు--1953సంగీతం::C.R.సుబ్బరామన్
రచన::సముద్రాల సీనియర్
గానం::ఘంటసాల
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,s.v.రంగారావు.

పల్లవి::

జగమే మాయ..బ్రతుకే మాయ
వేదాలలో..సారమింతేనయా
జగమే మాయ..బ్రతుకే మాయ
వేదాలలో..సారమింతేనయా..ఈ వింతేనయా
జగమే మాయ..బ్రతుకే మాయ
వేదాలలో..సారమింతేనయా..ఈ వింతేనయా

చరణం::1

కలిమి లేములు..కష్ట సుఖాలు
కలిమి లేములు..కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ..భయమేలోయి
కావడిలో కుండలనీ..భయమేలోయి
కావడికోయ్యేనోయ్..కుండలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి..ఈ వింతేనోయి
కావడికోయ్యేనోయ్..డలు మన్నేనోయ్
కనుగోంటే సత్యమింతేనోయి..ఈ వింతేనోయి
జగమే మాయ..బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా..ఈ వింతేనయా

చరణం::2

ఆశా మోహముల..దరిరానికోయి
ఆశా మోహముల..దరిరానికోయి
అన్యులకే నీ సుఖము..అంకితమోయి
అన్యులకే నీ సుఖము..అంకితమోయి
భాదే సౌఖ్యమనే..భావన రానివోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయి..బ్రహ్మానందమోయ్
భాదే సౌఖ్యమనే..భావన రానివోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయి..బ్రహ్మానందమోయ్

జగమే మాయ..బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా..ఈ వింతేనయా
జగమే మాయ..బ్రతుకే మాయ

దేవదాసు--1953


సంగీతం::C.R.సుబ్బరామన్ 
రచన::సముద్రాల సీనియర్ 
గానం::ఘంటసాల,కె.రాణి  
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,ఎస్వి,రంగారావు. 

పల్లవి::

ఓ..హొహొ..ఓ..హో..ఓ..హొహొఓహో.. 
ఓ..హొహొ..ఓ..హో..ఓ..హొహొఓహో.. 

ఓ దేవదా..ఓ పార్వతీ
చదువు ఇదేనా..మనవాసి వదిలేసి
అసలు దొరల్లే..సూటుబూటా
ఓ దేవద..చదువు ఇదేనా మనవాసి వదిలేసి
అసలు దొరల్లే సూటుబూటా
ఓ దేవద..

చరణం::1

పల్లెటూరి పిల్లకు..ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము..పట్టుబడిందే
పల్లెటూరి పిల్లకు..ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము..పట్టుబడిందే
పసికూన సిసలైన జాణ అయ్యిందే..బాగు బాగు
పసికూన సిసలైన జాణ అయ్యిందే..బాగు బాగు
ఓ పార్వతీ

చరణం::2

ఉన్న తీరు మారినా..ఊరు మారినా
తమరు ఎన్నటికీ..పసివారేనోయ్
ఉన్న తీరు మారినా..ఊరు మారినా
తమరు ఎన్నటికీ..పసివారేనోయ్
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా..నిజమయ్యేనా
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా..నిజమయ్యేనా
ఓ పార్వతీ

చరణం::3

నా ఎదుటే నీ బడాయి?
జీవితమే ఓ లడాయి!
నా ఎదుటే నీ బడాయి?
జీవితమే ఓ లడాయి!
లడాయిలా సరే మనకు..జిలాయిలోయ్ జిలాయిలోయ్
లడాయిలా సరే మనకు..జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా..ఉడుకూమోతా
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా..ఉడుకూమోతా
ఓ పిరికి పార్వతీ...
ఓ దుడుకు దేవద...

దేవదాసు--1953సంగీతం::C.R.సుబ్బరామన్ 
రచన::సముద్రాల సీనియర్ 
గానం::ఘంటసాల,కె.రాణి  
నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,ఎస్వి,రంగారావు. 

పల్లవి::

చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ
చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేలే
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేలే మిగిలింది నీవేలే
చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ 

చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
చేరదిసి సేవచేసే తీరూ కరువాయే
చేరదిసి సేవచేసే తీరూ కరువాయే నీ దారె వేరాయె
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె


చరణం::1

మరపురాని బాధకన్నా మధురమే లేదూ
మరపురాని బాధకన్నా మధురమే లేదూ
గతము తలచి వగచేకన్న సౌఖ్యమే లేదూ
గతము తలచి వగచేకన్న సౌఖ్యమే లేదూ
అందరాని పొందుకన్నా అందమేలేదు ఆనందమే లేదూ
చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ


చరణం::2

వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
దారిలేని బాధతో నేనారిపోయేనా కధ తీరిపోయేనా
చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె
ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేనే

దేవదాసు--1974


సంగీతం::రమేష్ నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల

:::

పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువా..
చిరుగింటి చినదానికి తగని మక్కువా..
ఇద్దరికీ..ఇద్దరికీ..కుదిరితే..ఏమితక్కువా..

:::1

ఈ మదికీ ఆ మదికీ అడ్డుగోడలేదూ..
ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడవుందీ..
ఈ మదికీ ఆ మదికీ అడ్డుగోడలేదూ..
ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడవుందీ..
గోడ నడుమ ఒకమూయని తలుపువుందిలే
ఆ తలుపు వెనుక రా రమ్మని పిలుపువుందిలే
పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువా..
చిరుగింటి చినదానికి తగని మక్కువా..
ఇద్దరికీ..ఇద్దరికీ..కుదిరితే..ఏమితక్కువా..

:::2

ఎంత అణచినా..మనసు అణగనన్నదీ
ఇంత వలపు ఇపుడిపుడే కూడదన్నదీ
ఎంత అణచినా..మనసు అణగనన్నదీ
ఇంత వలపు ఇపుడిపుడే కూడదన్నదీ
అనురాగం ఈ జన్మకు అధికమైనచో
మన ఇద్దరి ప్రేమకు మరుజన్మముందిలే
పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువా
చిరుగింటి చినదానికి తగని మక్కువా
ఇద్దరికీ..ఇద్దరికీ..కుదిరితే..ఏమితక్కువా

:::3

చదవేస్తే వున్నమతి జారిందేమో
మదినిండా వలపుంటే చదువులెందుకూ
చదవేస్తే వున్నమతి జారిందేమో
మదినిండా వలపుంటే చదువులెందుకూ
దొరవేషం వేసినా దుడుకుతనం పోదా
ఏయ్...ఎంత ఎదిగినా నీలో పిరికితనంపోదా
పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువా
చిరుగింటి చినదానికి తగని మక్కువా
ఇద్దరికీ..ఇద్దరికీ..కుదిరితే..ఏమితక్కువా

Devadasu--1974
Music::Ramesh Nayudu
Lyrics::Arudra
Singer's::S.P.Balu,P.Suseela

:::

poruginTi doragaariki pogaru ekkuvaa
chiruginTi chinadaaniki tagani makkuvaa
iddarikii..iddarikii..kudiritE..Emitakkuvaa

:::1

ii madikii aa madikii aDDugODalEdU
ii inTiki A inTiki aDDugODavundii
ii madikii aa madikii aDDugODalEdU
ii inTiki A inTiki aDDugODavundii
gODa naDuma okamUyani talupuvundilE
aa talupu venuka raa rammani pilupuvundilE
poruginTi doragaariki pogaru ekkuvaa
chiruginTi chinadaaniki tagani makkuvaa
iddarikii..iddarikii..kudiritE..Emitakkuvaa

:::2

enta aNachinaa..manasu aNaganannadii
inta valapu ipuDipuDE kUDadannadii
enta aNachinaa..manasu aNaganannadii
inta valapu ipuDipuDE kUDadannadii
anuraagam ii janmaku adhikamainachO
mana iddari prEmaku marujanmamundilE
poruginTi doragaariki pogaru ekkuvaa
chiruginTi chinadaaniki tagani makkuvaa
iddarikii..iddarikii..kudiritE..Emitakkuvaa  

:::3

chadavEstE vunnamati jaarindEmO
madininDaa valapunTE chaduvulendukU
chadavEstE vunnamati jaarindEmO
madininDaa valapunTE chaduvulendukU
doravEsham vEsinaa duDukutanam pOdaa
Ey...enta ediginaa neelO pirikitanampOdaa
poruginTi doragaariki pogaru ekkuvaa
chiruginTi chinadaaniki tagani makkuvaa

iddarikii..iddarikii..kudiritE..Emitakkuvaa

దేవదాసు--1953సంగీతం::C.R.సుబ్బరామన్ 

రచన::సముద్రాల సీనియర్ 
గానం::ఘంటసాల 

నిర్మాత::చక్రపాణి
దర్శకత్వం::వేదాంతం రాఘవయ్య
సంస్థ::వినొదా పిక్చర్స్
నటీ,నటులు::నాగేశ్వరరావు,సావిత్రి,ఎస్వి,రంగారావు.

పల్లవి::

కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే..ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే
పసితనపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే..బ్రతుకింతేనులే 
పసితనపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే..బ్రతుకింతేనులే..ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే 

చరణం::1

ఎవియో మురిపాలెటకో పయనాలు..దైవాల నీమాలింతే
ఎవియో మురిపాలెటకో పయనాలు..దైవాల నీమాలింతే..వరమింతే
చివురించిన పూదీవే విరియగా..విరితావులు దూరాలై 
చనేనులే ప్రేమ ఇంతేలే..పరిణామమింతేలే

కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే

చరణం::2

నెరవేరని ఈ మమకారాలేమో..ఈ దూరభారాలేమో..ఓ ఓ
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో..హితవేమో
ఎది నేరని ప్రాయానా చనువునా..రవళించిన రాగమ్మే 
స్థిరమ్మౌ యోగమింతేలే..అనురాగమింతేలే 

కల ఇదనీ నిజమిదనీ..తెలియదులే..బ్రతుకింతేనులే..ఇంతేనులే..ఇంతేనులే ఋష్య శృంగ--1961


సంగీతం::టి.వి.రాజు 
రచన::సముద్రాల (జూనియర్ ) 
గానం::ఘంటసాల

పల్లవి::

హే సురేశా! సుఖజీవన దాత!
పయోధర వాహనా! పర్జన్యా!పర్జన్యా!

నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
కావరా! మొరాలకించరా

నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
కావరా! మొరాలకించరా

చరణం::1 

ఘోడు ఘోడు ఘోషించె ప్రజల
గొంతు మీకు వినిపించలేదా
హాహాకారాలాల్లాడే ప్రజలా 
ఆర్తిమీకు కనుపించలేదా
ఓ ఋతుపవనమా నీల జలదమా
కనికరాన ఈధర చరించరే జలాలనించరే
సంకరా నైధరా చరించరే జలాలనించరే 

నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
కావరా! మొరాలకించరా

చరణం::2


బీటలు వారిన హృదయాల
ఆరాటాలు ఆలించవేల..ఆఆ 
కన్నీటి జాలే ప్రవహించునేల
పన్నీటి జల్లై వర్షింపనేల
ఓ వరుణా దేవతా వర్షదేవతా
కనికరాన ఈధరా చరించవా జలాలనించవా
కనికరాన ఈధరా చరించవా జలాలనించవా

నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
కావరా! మొరాలకించరా

చరణం::3

దళం ధళస్మనోనోజ్ఞ చంచలా ప్రకాశమా
ఫెళఫెళమని గర్జించు ఘనాఘన నిర్ఘోషమా 
జలజలజల గలగలగల గల ఘల్లున వర్షించరే  
ఈ ఇలతనియించగ తరియించగ వర్షించరే
వర్షించరే..వర్షించరే..వర్షించరే..