Wednesday, February 26, 2014

చాణక్య చంద్రగుప్త--1977
























సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::P.సుశీల

తారాగణం::N.T. రామారావు, అక్కినేని, శివాజీ గణేషన్, జయప్రద,మంజుల,పద్మనాభం,రాజబాబు

పల్లవి:: 

ఎవరో అతడెవరో...?? 

ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ ఆ చంద్రుడు ఎవరో..ఓ..ఓ..ఓ 
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో

ఎవరో..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో

ఈ రాచ తోటలో ఓ..ఓ..వున్నాడో
ఏ..రతనాల కోటలో కొలువున్నాడో 
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ 

చరణం::1 

పదములలో..నా..ఆ..హృదయమున్నదో 

హృదయమే తడబడీ అడుగిడుతున్నదో

పదములలో..నా..ఆ..హృదయమున్నదో 
హృదయమే తడబడీ అడుగిడుతున్నదో
ఏ..పున్నమికై..ఈ కలువ వున్నదో

ఏ..పున్నమికై..ఈ..కలువ వున్నదో 
ఏ..రేని పూజకు ఈ చెలువ ఉన్నదో
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ 
ఆ చంద్రుడు ఎవరో
ఎవరో..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో

చరణం::2 

మనసు గీసినది కనరానీ రూపం 
కనులు అల్లినది అనుకోని గీతం మూ..మూ..మూ..మూ 

మనసు గీసినది కనరానీ రూపం 
కనులు అల్లినది అనుకోని గీతం 
చంద్ర.. 

తీయనీ ఏ తలపో..ఓ..ఓ..ఓ..ఈ కలవరింత 
తెలియని ఏ వలపో..ఓ..ఓ..ఓ.ఈ పులకరింతా 

ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

పరువు ప్రతిష్ట--1963




















సంగీతం::పెండ్యాల
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T. రామారావు, చలం, అంజలీదేవి,రేలంగి, గుమ్మడి, కన్నాంబ 

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ..ఆహాహా ఆహాహా..ఆ ఆ ఆహ్హా ఆ  ఆ మబ్బు..తెరలలోన..దాగుంది..చందమామ
ఈ సిగ్గుపొరలలోన..బాగుంది..సత్యభామ
ఏమంది..సత్యభామ

ఏమందో..ఏమో కాని..పరిహాసాలే..చాలునంది
శ్రీవారిని..ఐదారడుగుల..దూరాన..ఆగమంది
దూరాన..ఆగమంది

చరణం::1

ఈ గాలి..ఊయలా..ఊగించు..పయ్యెదా
ఈ గాలి..ఊయలా..ఊగించు..పయ్యెదా
ఊరించే..సైగలతోనే..ఏమంది..తియ్యగా

పరువాల..తొందరా..నెలరాజు..ముందరా
పరువాల..తొందరా..నెలరాజు..ముందరా
మర్యాదా..కాదని కాదా..పలికింది..చల్లగా
పలికింది..మెల్లగా

ఆ మబ్బు..తెరలలోనా..దాగుంది..చందమామ
ఈ సిగ్గుపొరలలోనా..బాగుంది..సత్యభామ
ఏమంది..సత్యభామ

ఏమందో..ఏమో కాని..పరిహాసాలే..చాలునంది
శ్రీవారిని..ఐదారడుగుల..దూరాన..ఆగమంది
దూరాన..ఆగమంది

చరణం::2

సిగలోని..పువ్వులు..చిలికించే నవ్వులు
సిగలోని... పువ్వులు ...చిలికించే నవ్వులు
ఓ......ఓ.....ఓ....ఓ.....ఓ....
మనకోసం..ఏ సందేశం..అందించే ప్రేయసీ

ఆనంద సీమలా..అనురాగ డోలలా
ఆనంద సీమలా..అనురాగ డోలలా
కలకాలం..తేలీసోలీ..ఆడాలి హాయిగా
అన్నాయి..తియ్యగా

ఆ మబ్బు..తెరలే తొలగి..ఆగింది..చందమామ
ప్రేమికుల..హృదయము తెలిసి..పాడింది..చందమామ
పాడింది..చందమామ

ఆహా..హా..హా..ఆ..ఆ..ఆ..