Tuesday, May 15, 2007

బందిపోటు --1963::మధుకౌంశ్::రాగం



సంగీతం:: ఘంటసాల
రచన :: ఆరుద్ర
గానం::ఘంటసాల
,P.సుశీల
రాగం::మధుకౌంశ్

ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే
ప్రియా....ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే

వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు
ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే

నను కోరి చేరిన బేల దూరాన నిలిచేవేల
నను కోరి చెరిన బేల దూరాన నిలిచేవేల
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే

దివి మల్లెపందిరి వేసే భువి పెళ్ళిపీటలు వేసే
దివి మల్లెపందిరి వేసే భువి పెల్లిపీటలు వేసే
సిరి వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుస గుసలాడేమన హృదయములూయలలూగే

బందిపోటు --1963::శివరంజని::రాగం



సంగీతం:: ఘంటసాల
రచన: Dr C.నారాయణ రెడ్డి
గానం:: ఘంటసాల


రాగం::శివరంజని

వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావె
వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావె

!! వగల రాణివి నీవె !!

పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం
!! వగల రాణివి నీవె !!
దోర వయసు చినదాన ఓర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన ఓర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే గాన
!! వగల రాణివి నీవె !!
కోపమంతా పైపైనె చూపులన్ని నాపైనె
కోపమంతా పైపైనె చూపులన్ని నాపైనె
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె
!! వగల రాణివి నీవె !!