సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::K.V.సోమయాజులు,సవిత,గిరీష్,అల్లు రామలింగయ్య,రమణమూర్తి,సాక్షి రంగారావు
పల్లవి::
అయిగిరి నందిని నందితమోహిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంభిని భూరికుటుంభిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే
అయి జగదంబ కదంబవనప్రియవాస విలాసిని వాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకేతవభంజిని కైఠవభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే
ఝణ ఝణ ఝింఝిమిఝింక్రితనూపుర సింజిత మోహిత భూతపతే
నటిత నటార్ధనటినటనాయక నటితనాటక నాట్యరసే
పదనత పాలిని బాల విలోచని పద్మవిలాసిని విశ్వధురే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే
కలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజిల మంజురతే
మిళిత మిళింద మనోహరగుంభిత రంజితశైలని కుంజగతే
మృగగణభూత మహాషభరీగణ రింగణసంభ్రుత కేళిభ్రుతే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే
రమ్యకపర్దిని శైలశుతే రమ్యకపర్దిని శైలశుతే
సంగీతం:K.V.మహదేవన్
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.జానకి
మోహన::రాగం
తారాగణం::రామమూర్తి,సబిత,రవికాంత్
పల్లవి::
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ
చూడాలి నా నాట్యలీల
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ
చూడాలి నా నాట్యలీల
నెమలికి నేర్పిన ఆ ఆ ఆ ఆ
నెమలికి నేర్పిన నడకలివి
చరణం::1
కలహంసలకిచ్చిన పదగతులు
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు
కలహంసలకిచ్చిన పదగతులు
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు
ఏవేవో కన్నుల కిన్నెరలు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు
ఏవేవో కన్నుల కిన్నెరలు!!
కలిసి మెలిసి కళలు విరిసి
మెరిసిన..కాళిదాసు కమనీయ
కల్పనా వల్ప శిల్పమణి మేఖలను
శకుంతలను
ఓ ఓ ఓ..నెమలికి నేర్పిన నడకలివి
చరణం::2
చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారడే చూపుల్లో చంద్రికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారడే చూపుల్లో చంద్రికలు
కురులు విరిసి మరులు కురిసి మురిసిన
రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను
శశిరేఖను
ఓ ఓ ఓ..నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ
చూడాలి నా నాట్యలీల
నెమలికి నేర్పిన నడకలివి