Thursday, November 20, 2008

రామాలయం--1971


















సంగీత::ఘంటసాల
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::జగ్గయ్య,శోభన్‌బాబు,జమున,విజయనిర్మల,చంద్రమోహన్,సూర్యకాంతం

పల్లవి::

జగదభి రామా..రఘుకుల సోమా
శరణము నీయవయా...రామా 
కరుణను....చూపవయా..ఆ

జగదభి రామా...రఘుకుల సోమా
శరణము నీయవయా...రామా 
కరుణను...చూపవయా..ఆ

చరణం::1

కౌశికు యాగము...కాచితివయ్యా
రాతిని..నాతిగ...చేసితివయ్యా
రాతిని..నాతిగ...చేసితివయ్యా
హరివిల్లు విరిచీ..మురిపించి సీతను
పరిణయమాడిన...కళ్యాణ రామా  
శరణము నీయవయా..రామా 
కరుణను....చూపవయా..ఆ 

చరణం::2

ఒకటే బాణం...ఒకటే మాట
ఒకటే సతి అని..చాటితివయ్యా
ఒకటే సతి అని..చాటితివయ్యా 
కృజనులనణచీ..శుజనుల..బ్రోచిన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
ఆదర్శమూర్తివి...నీవయ్యా 
శరణము నీయవయా..రామా 
కరుణను...చూపవయా..ఆ
జగదభి రామా..రఘుకుల సోమా
శరణము నీయవయా..రామా 
కరుణను...చూపవయా..ఆ 
జయ జయ రాం..జానకి రాం
జయ జయ రాం..జానకి రాం
పావన నాం....మేఘశ్యాం
జయ జయ రాం...జానకి రాం
జయ జయ రాం...జానకి రాం
జయ జయ రాం...జానకి రాం
జయ జయ రాం...జానకి రాం

రాజ కోట రహస్యం--1971























సంగీత::విజయా కృష్ణమూర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,దేవిక,మిక్కిలినేని,సత్యనారాయణ,మిక్కిలినేని,
జ్యోతిలక్ష్మి,రమణారెడ్డి

పల్లవి::

తొలిసిగ్గుల తొలకరిలో..తలవాల్చిన చంద్రముఖీ
తెరలెందుకు నీకు నాకు..దరి జేరవే ప్రియసఖీ

నను మరువని...దొరవని తెలుసూ
నను మరువని...దొరవని తెలుసూ
నా మదిలోన ఏముందో..అది నీకు తెలుసూ

నను వలచిన...చెలివని తెలుసూ
నను వలచిన...చెలివని తెలుసూ
నా యదలోన ఏముందో..అదినీకు తెలుసూ

చరణం::1

చెంపల కెంపులు...దోచాలనీ
సంపంగి నవ్వులు...దుయ్యాలనీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
చెంపల కెంపులు...దోచాలనీ
సంపంగి నవ్వులు...దుయ్యాలనీ
నడుమున చెయ్ వేసి...నడవాలనీ
నా నడుమున చయ్ వేసి...నడవాలనీ
అంటుంది అంటుంది..నీ కొంటె వయసూ
నను వలచిన...చెలివని తెలుసూ 
నా యదలోన ఏముందో..అదినీకు తెలుసూ
నను వలచిన...చెలివని తెలుసూ

చరణం::2

నీ రాజు తోడుగ...నిలవాలనీ
ఈ రేడు లోకాల...గెలవాలనీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీ రాజు తోడుగ...నిలవాలనీ
ఈ రేడు లోకాల...గెలవాలనీ
బ్రతుకే పున్నమి...కావాలనీ
నీ బ్రతుకే పున్నమి...కావాలనీ 
కోరింది కోరింది..నీ లేత మనసూ
నను మరువని..దొరవని తెలుసూ 
నా మదిలోన ఏముందో..అది నీకు తెలుసూ
నను వలచిన..చెలివని తెలుసూ

రాజ కోట రహస్యం--1971




















సంగీత::విజయా కృష్ణమూర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల

పల్లవి::

కరుణించవా వరుణదేవా..కరుణించవా వరుణదేవా 
నిరుపమ కరుణా సురగంగా కురిపించి
కరుణించవా వరుణదేవా 

చరణం::1

అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు
ఆరని జ్వాలల అలమటించగా
అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు
ఆరని జ్వాలల అలమటించగా
మాతృదేవియై మము నడిపించిన
విద్యానిలయము విలవిలలాడగా
మాతృదేవియై మము నడిపించిన
విద్యానిలయము విలవిలలాడగా
అంబరవీధుల దాగున్నావా
అంబరవీధుల దాగున్నావా
ఆర్తనాధమే వినకున్నావా
కరుణించవా వరుణదేవా 
నిరుపమ కరుణా సురగంగా కురిపించి
కరుణించవా వరుణదేవా 

చరణం::2

పెళ పెళ పెళ పెళ జలతరాలు ఘర్జించగా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తళ తళ తళ తళ తపిళ్ళతలు వీపించగా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దుంభుని ఆనందాభుదిలో విహరించగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కుంభవృస్ఠి...కురిపించవా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
గురుదేవుని...కరుణించవా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కరుణించవా...కరుణించవా