Sunday, November 21, 2010

బంగారు మనసులు--1973






















సంగీత::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,జమున,సత్యనారాయణ,రాజసులోచన, ఛాయాదేవి,అల్లు రామలింగయ్య

పల్లవి::

నవ్వుతు...నువ్వుండాలి 
మీ నాన్న..మది నిండాలి 
నినుగన్నతల్లి..ఆశలే పండగా  

నవ్వుతు...నువ్వుండాలి 
మీ నాన్న..మది నిండాలి 
నినుగన్నతల్లి..ఆశలే పండగా 
నినుగన్నతల్లి..ఆశలే పండగా                     

చరణం::1

నెలవంక దీపం..నింగికే వెలుగు
కనుపాప దీపం..కంటికే వెలుగు
నెలవంక దీపం..నింగికే వెలుగు
కనుపాప దీపం..కంటికే వెలుగు
ఆకలిలోనైనా...చీకటిలోనైనా
పాపాయి చిరునవ్వు..ప్రతియింటి వెలుగు 
నవ్వుతు...నువ్వుండాలి 
మీ నాన్న..మది నిండాలి 
నినుగన్నతల్లి..ఆశలే పండగా  
నినుగన్నతల్లి..ఆశలే పండగా

చరణం::2

మనసైన దేదీ..మమకారమొకటే
కొనలేని దేదీ..కారుణ్యమొకటే
మనసైన దేదీ..మమకారమొకటే
కొనలేని దేదీ..కారుణ్యమొకటే
ఎవ్వరు ఏమన్నా..ఏ విధి ఎదురైనా
మనిషికి మిగిలేది..అనుబంధమొకటే  
నవ్వుతు...నువ్వుండాలి 
మీ నాన్న..మది నిండాలి 
నినుగన్నతల్లి..ఆశలే పండగా  
నినుగన్నతల్లి..ఆశలే పండగా 

No comments: