Wednesday, June 15, 2011
రావణుడే రాముడైతే--1979
సంగీతం::GK.వేంకటేష్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,P.సుశీల
రాగం::శివరంజని::
(హిందుస్తాని కర్నాటక)
కనులలో నీ రూపం..మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం..మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే
కనులలో నీ రూపం..మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం..మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే
నీ గీతి నేనై..నా అనుభూతి
నీవైతే చాలు..పదివేలు
కోరుకోనింక ఏ నందనాలు
ఏ జన్మ కైనా
నీవే నాకు తోడుంటే చాలు అంతే చాలు
ఎదలో కోటి రస మందిరాలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ హా హో హో హో హో
కనులలో నీ రూపం..మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం..మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే
ఆ కొండపైనే
సాగే మబ్బు తానే ఏమంది ఏమంటుంది
కొండ ఒడిలోనే ఉండాలంటుంది
నీ కళ్ళలోనే ఒదిగే బొమ్మ తానే
ఏమంది ఏమంటుంది
పదికాలాలుంటానంటుంది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ హా హో హో హో హో
కనులలో నీ రూపం..మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం..మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే
Labels:
Hero::A.N.R,
P.Suseela,
SP.Baalu,
రావణుడే రాముడైతే--1978
డాక్టర్ చక్రవర్తి--1964
సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,ఘంటసాల
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుకా ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక
ఆఆఆఆఅఆఆఆ.....ఆఆఆఆఆఆ
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా
ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక అహ ఒహొ..ఆ
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువరించు ప్రణవ భావ గీతిక..ఆ..ఆ..ఆ
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుకా
ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక..ఆఆఆఆఆఆఆఆ.....ఆఆఆఅఆఆ
ఈ మౌనం..ఓహో..ఈ బిడియం..మ్మ్హు
ఇదేనా ఇదేనా చెలియ కానుకా
..ఓహో..ఈ బిడియం..మ్మ్హు
ఇదేలే ఇదేలే మగువ కానుకా ఈ మౌనం
డాక్టర్ చక్రవర్తి--1964::ఖామాస్::రాగం
సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
రాగం:::ఖామాస్::
ఆఆఆఆఆఆఆఆ
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా..
కృష్ణా..పదుగురెదుటా పాడనా..
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా
పొదల మాటున పొంచి పొంచి యెదను దోచిన వేణుగానము
వొలకపోసిన రాగసుధకు మొలకలెత్తిన లలిత గీతి
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా
చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు
చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు
మెచ్చలేరీ వెచ్చని హృదయాల పొంగిన మధుర గీతి
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా
యెవరూ లేని యమునా తటినీ ఎక్కడో ఏకాంతమందున
నేను నీవై నీవు నేనై..ఆ..ఆ..ఆనేను నీవై నీవు నేనై
పరవశించే ప్రణయ గీతి
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా
కృష్ణా..పదుగురెదుటా పాడనా......
Labels:
Hero::A.N.R,
P.Suseela,
Veena Patalu,
డాక్టర్ చక్రవర్తి--1964
డాక్టర్ చక్రవర్తి--1964::జైజైవంతి::రాగం
సంగీతం::Sరాజేశ్వరరావు
గాత్రం:ఘంటసాల
రచన::శ్రీ శ్రీ
డైరెక్టర్::ఆదుర్తి సుబ్బారావు
ప్రొడ్యుసర్::D.మధుసూధనరావు
సంస్థ:అన్నపూర్ణా పిక్చర్స్
విడుదల::1964
నటీనటులు::నాగేశ్వరరావు,జగ్గయ్య,సావిత్రి,షావుకారు జానకి,కృష్ణకుమారి
రాగం:::జయ్‌జయ్‌వంతి
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
చెలిమియే కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిలయైపోగా
నీ వ్యధ తెలిసి నీడగ నిలిచే
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము
డాక్టర్ చక్రవర్తి--1964::యమున్ కల్యాణి::రాగం
సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల
రాగం::యమున్ కల్యాణి::
నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది ఆ ఆ ఆ అ
నీవు లేఖ వీణ
జాజి పూలు నీకై రోజు రోజు పూచే
చూచి చూచి పాపం సొమ్మసిల్లి పోయే
చందమామ నీకై తొంగి తొంగి చూచి
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసను లేవని అలుకలు బోయే
నీవు లేఖ వీణ
కలలనైన నిన్ను కన్నుల చూదమన్న
నిదుర రాని నాకు కలలు కూడ రావే
కధ లేని కాలం విరహ గీతి రీతి
కధ లేని కాలం విరహ గీతి రీతి
పరువము వృధగా బరువుగ సాగే
నీవు లేఖ వీణ
తలుపులన్ని నీకై తెరచి వుంచినాను
తలపులేన్నో మదిలో దాచి వేచినాను
తాపం ఇంక నేను ఓపలేను స్వామి
తాపం ఇంక నేను ఓపలేను స్వామి
తరుణిని కరుణను ఏలగ రావా
నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది ఆ ఆ ఆ అ
నీవు లేఖ వీణ
Labels:
Hero::A.N.R,
P.Suseela,
Veena Patalu,
డాక్టర్ చక్రవర్తి--1964
Subscribe to:
Posts (Atom)