పల్లవి:: నేను నీకై పుట్టినానని నిన్ను పొందకా మట్టికానని చెమ్మగిల్లే కనులతో చేయి పట్టే మనసుతో చేసుకున్న బాసలో ఊసులే ప్రేమ..ఊపిరే ప్రేమ చరణం::1 నిన్ను చూడకా నిదురపోనీ..రెండు నేత్రాలు కలల హారతి నీకు పట్టే..మౌన మంత్రాలు నిన్ను తాకకా నిలవలేనీ..పంచ ప్రాణాలూ కౌగిలింతలా గర్భగుడిలో..మూగ దీపాలు ప్రేమ మహిమ..తెలుప తరమా ప్రేమే..జీవన..మధురిమా నేను నీకై పుట్టినానని నిన్ను పొందకా మట్టికానని చెమ్మగిల్లే కనులతో..చేయి పట్టే మనసుతో చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ..ఊపిరే ప్రేమ చరణం::2 స్త్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా ఓం..అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే గానమై నిన్నాలపించే..ప్రణవమై ఉంటా ప్రేమ మహిమ తెలియ తరమా ప్రేమే..జీవన మధురిమా నేను నీకై పుట్టినానని..నిన్ను పొందకా మట్టికానని చెమ్మగిల్లే కనులతో..చేయి పట్టే మనసుతో చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ..ఊపిరే ప్రేమ
సంగీతం::ఇళయరాజ రచన::రచన::రాజశ్రీ,వెన్నెలకంటి గానం::జమునారాణి,P.సుశీల. Director::Mani Ratnam తారాగణం::కమలహాసన్,శరణ్య,రవిబాబు,ప్రదీప్‌శక్తి,తిన్నుఆనంద్. పల్లవి:: నా నవ్వే దీపావళి హొయ్ నా నవ్వే దీపావళి హొయ్ నా పలుకే గీతాంజలి నా నవ్వే దీపావళి హొయ్ నా పలుకే గీతాంజలి అరవిందం నా వయసే అతి మధురం నా మనసే నా నవ్వే నా నవ్వే దీపావళి హొయ్ నా పలుకే గీతాంజలి చరణం::1 కనని వినని అనుభవమే ఇదిరా చెలి రేయి పగలు నీకై వున్నదిరా కనని వినని అనుభవమే ఇదిరా చెలి రేయి పగలు నీకై వున్నదిరా అందాలన్ని పూసెను నేడే ఆశల కోట వెలిసెను నేడే దేహం నాది దాహం నీది కొసరే రేయి నాదే నీది ఆడి పాడి నువ్వే రా నా నవ్వే నా నవ్వే దీపావళి హొయ్ నా పలుకే గీతాంజలి అరవిందం నా వయసే అతి మధురం నా మనసే నా నవ్వే దీపావళి హొయ్ నా పలుకే గీతాంజలి చరణం::2 కడలి అలలు నీ చెలి కోరికలే నా కలల కధలు పలికెను గీతికలే కడలి అలలు నీ చెలి కోరికలే నా కలల కధలు పలికెను గీతికలే వన్నెలు చిందే వెచ్చని ప్రాయం పలికించేను అల్లరి పాఠం పరువం నాలో రేగే వేళ వయసే బంధం వేసే వేళ ఆడి పాడి నువ్వే రా నా నవ్వే నా నవ్వే దీపావళి హొయ్ నా పలుకే గీతాంజలి అరవిందం నా వయసే అతి మధురం నా మనసే నా నవ్వే దీపావళి హొయ్ నా పలుకే గీతాంజలి