Thursday, August 16, 2007

సిరి సంపదలు--1963



గానం::P.సుశీల, S.జానకి , జిక్కి
సంగీతం::మాస్టర్ వేణు
రచన::ఆత్రేయ


వేణు గానమ్ము వినిపించెనచిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..

దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను

అంత మొనగాడటే ఒట్టి కథలేనటే
ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే...

!! వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే...!!

మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలను చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలను చూపాడట~
అంత మొనగాడటే వింత కథలేనటే
ఏది కనపడితే కనులారా చూడాలి వానినే...

!! వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే.. !!

దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట

ఘల్లు గల్ గల్లన ఒళ్ళు ఝల్ ఝల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట

!! వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే.. !!

మనుషులు-మమతలు--1965



సంగీతం::T.చలపతిరావు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::జయదేవ్, S.జానకి 
తారాగణం::అక్కినేని,సావిత్రి,జయలలిత,జగ్గయ్య,ప్రభాకర్‌రెడ్డి,గుమ్మడి,రమణారెడ్డి,రాజశ్రీ,హేమాలత. 

పల్లవి::

భాస్కర్::మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
నీ కాలికి నే నందియనై..నీ కన్నులలో కాటుకనై
వుండి పోనా నీతోనే..నిండి పోనా నీలోనే 

నీ కాలికి నే నందియనై..నీ కన్నులలో కాటుకనై
వుండి పోనా నీతోనే..నిండి పోనా నీలోనే

చరణం::1

వాణి::ఉయ్యాల లూగించు..వయ్యారి బాల
సయ్యాట లాడింతు..చిన్నారి బాల
నీ ప్రియురాలి ఒడిలోన..శయనించవోయీ
సరదాల సరసాల..తేలించవోయీ 

భాస్కర్::కోరిక లూరే..తీయని రేయి
రమ్మని పిలిచే..నీ కనుదోయి..ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
కోరిక లూరే..తీయని రేయి 
రమ్మని పిలిచే..నీ కనుదోయి

నా మనసే వూగెనులే..నా జగమే మారెనులే
వుండి పోనా నీతోనే..ఏ..నిండి పోనా నీలోనే..ఏ 

చరణం::2

వాణి::పలు మారు రాదోయి..ఇటు వంటి రేయి
అధరాల మధురాలు..నిను కోరె నోయి
యీ చెలరేగు హృదయాలు..కలవాలి నేడే
వేయి దీపాలు నా యింట..వెలగాలి నేడే

భాస్కర్::నీ వే లే నా..మధుశాలా
నీవే లే నా మదిలో..జ్వాలా

వాణి::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

భాస్కర్::నీ వే లే నా..మధుశాలా
నీవే లే నా మదిలో..జ్వాలా
నీవేలే నా జీవితమూ..నీకే లే అంకితమూ
వుండి పోనా నీతోనే..నిండిపోనా నీలోనే 

నీ కాలికి నే నందియనై..నీ కన్నులలో కాటుకనై
వుండి పోనా నీతోనే..నిండి పోనా నీలోనే

Manushulu-Mamatalu--1965
Music::T.ChalapatiRao
Lyrics::Dasarathia
Singer's::Jayadev,jaanaki
Cast::Akkinaeni,Gummadi,PrabhaakarReddi,Jayalalita,saavitri,Jaggayya,Rajasree,Ramanareddi,Hemalata

:::::::

Bhaskar::mm mm mm mm mm mm mm mm mm 
nee kaaliki ne nandiyanai..nee kannulalO kaaTukanai
vunDi pOnaa neetOne..ninDi pOnaa neelOne 

nee kaaliki ne nandiyanai..nee kannulalO kaaTukanai
vunDi pOnaa neetOne..ninDi pOnaa neelOne 

::::1

Vaani::uyyaala looginchu..vayyaari baala
sayyaaTa laaDintu..chinnaari baala
nee priyuraali oDilOna..SayaninchavOyee
saradaala sarasaala..telinchavOyee 

Bhaskar::kOrika loore..teeyani reyi
rammani piliche..nee kanudOyi..aa
aa aa aa aa aa aa aa aa aa 
kOrika loore..teeyani reyi 
rammani piliche..nee kanudOyi

nee kaaliki ne nandiyanai..nee kannulalO kaaTukanai
vunDi pOnaa neetOne..ninDi pOnaa neelOne..ee 

::::2

Vani::palu maaru raadOyi..iTu vanTi reyi
adharaala madhuraalu..ninu kOre nOyi
yee chelaregu hRdayaalu..kalavaali neDe
veyi deepaalu naa yinTa..velagaali neDe

Bhaskar::nee ve le naa..madhuSaalaa
neeve le naa madilO..jwaalaa

Vaani::aa aa aa aa aa aa aa aa aa

Bhaskar::nee ve le naa..madhuSaalaa
neeve le naa madilO..jwaalaa
neevele naa jeevitamoo..neeke le ankitamoo
vunDi pOnaa neetOne..ninDipOnaa neelOne 

nee kaaliki ne nandiyanai..nee kannulalO kaaTukanai
vunDi pOnaa neetOne..ninDi pOnaa neelOne  

సిరి సంపదలు--1963



సంగీతం::మాష్టర్ వేణురచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

ఎందుకో....సిగ్గెందుకో..ఇంతలోనే అమ్మాయికి
అంత సిగ్గు ఎందుకో...ఎందుకో....సిగ్గెందుకో
పంతాలే తీరెనని తెలిసినందుకే..
మనసులు కలసినందుకే
అందుకే...సిగ్గందుకే....!!!!!

చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు
చిరునవ్వుల చిన్నారీ...చిరునవ్వుల చిన్నారి
ఇంకా సిగ్గెందుకే..ఎందుకో సిగ్గెందుకో... !!!!

కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
తనివారగ ఈ వేళా...తనివారగ ఈ వేళా
మనసే తూగాడెనే అందుకే సిగ్గందుకే !!!


నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
అనురాగం ఆనందం...అనురాగం ఆనందం
అన్నీ నీ కోసమే...
అందుకా ఆ...సిగ్గందుకా ఆ...
పంతాలు తీరెనని తెలిసినందుకా
మనసులు కలిసినందుకే...అందుకా సిగ్గందుకా..మ్మ్..హు...

సిరి సంపదలు--1963::చారుకేశి::రాగం





సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,S.జానకి

రాగం:::చారుకేశి:::

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ
మారినదేమి చెలీ ఆ కారణమేమి చెలీ..ఆ..ఊ..
వింత కాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలీ నిండు పున్నమి జాబిలీ
ఓ...ఓ...ఓ...ఓ.....



మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవులమీదికి రానీవు
ఆహా...ఓహో...అహా..ఆ..ఆహా..
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవులమీదికి రానీవు
పెదవికదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు..మ్మ్
వెండి వెన్నెల జాబిలీ నిండు పున్నమి జాబిలీ!!!


ఆ....ఓ.....ఆ....మ్మ్.....
కన్నులు తెలిపే కధలనెందుకు రెప్పలార్పి ఏమార్చేవు
ఆ...ఆ...ఓ...ఓ...ఓ...ఓ.ఓ..ఓ..
కన్నులు తెలిపే కధలనెందుకు రెప్పలార్పి ఏమార్చేవు

చెంపలు పూచే కెంపులు నాతో
నిజము తెలుపునని జడి సేవు..ఓహో..హో...
వెండి వెన్నెల జాబిలీ నిండు పున్నమి జాబిలీ!!!

అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకొని నవ్వేవు
అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకొని నవ్వేవు

నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వుల
కర్ధము చూపేనూ..ఆ..హా..
వెండి వెన్నెల జాబిలీ నిండు పున్నమి జాబిలీ
ఆహా..హ..హా..ఆ..హా..ఆ..మ్మ్..!!!