Monday, August 02, 2010

తరంగిణి--1982




సంగీతం::J.V.రాఘవులు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::సుమన్,శ్యామలాగౌరి,భానుచందర్,రామచంద్రరావు 

తరంగిణీ..ఓ..ఓ..ఓ.తరంగిణి
తరంగిణీ..ఓ ఓ..ఓ..తరంగిణి
ఏ ఒడిలో నీ జననం..ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం..ఏ కడలికో నీ పయనం
తరంగిణీ..ఓ..ఓ..ఓ..తరంగిణి

ఇసుక తిన్నెలెదురైనా..ఏ గిరులు తిరిగి పొమ్మన్నా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా
ఆగిపోదు నీ నడక..ఆ..
ఆగిపోదు నీ నడక..ఆ..గమ్యం చేరేదాకా
తరంగిణీ..ఓ..ఓ..ఓ..తరంగిణి

గుండె ముక్కలైపోయి..సుడిగుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా..ఆ
కల్లోలం విషమించినా..కాలమే వంచించినా
తరంగిణీ..ఓ..ఓ..ఓ.తరంగిణి
ఆగిపోదు నీ నడక..ఆ గమ్యం చేరేదాకా..ఆ
తరంగిణీ..ఓ..ఓ..ఓ..తరంగిణి

ఎదలోని రాపిడిలోన..కదలాడు నురగలపైన
కలకలనవ్వులున్నాయో ఓ..
కలకలనవ్వులున్నాయో..కన్నీళ్ళు పొంగుతున్నాయో
తెలిసేదెవరికి..ఆ దైవానికి

తరంగిణీ..ఓ..ఓ..ఓ..తరంగిణి
ఏ ఒడిలో నీ జననం..ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం..ఏ కడలికో నీ పయనం
తరంగిణీ..ఓ..ఓ..ఓ..తరంగిణి
ఓ తరంగిణి..ఓ..తరంగిణి


Tarangini--1982
Music::J.V.Raaghavulu
Lyrics::C.Naaraayana Reddy
Singer's::S.P.Baalu
Cast::Suman,SyamalaGouri,Bhanuchandar,Ramachandra rao

taraMgiNee..O..O..O.taraMgiNi
taraMgiNee..O O..O..taraMgiNi
ae oDilO nee jananaM..ae kaDalikO nee payanaM
ae oDilO nee jananaM..ae kaDalikO nee payanaM
taraMgiNee..O..O..O..taraMgiNi

isuka tinneledurainaa..ae girulu tirigi pommannaa
lOyallO digipOyinaa..paayalugaa viDipOyinaa
lOyallO digipOyinaa..paayalugaa viDipOyinaa
aagipOdu nee naDaka..aa..
aagipOdu nee naDaka..aa..gamyaM chaeraedaakaa
taraMgiNee..O..O..O..taraMgiNi

guMDe mukkalaipOyi..suDiguMDaalae chelaraegi
kallOlaM vishamiMchinaa..aa
kallOlaM vishamiMchinaa..kaalamae vaMchiMchinaa
taraMgiNee..O..O..O.taraMgiNi
aagipOdu nee naDaka..aa gamyaM chaeraedaakaa..aa
taraMgiNee..O..O..O..taraMgiNi

edalOni raapiDilOna..kadalaaDu nuragalapaina
kalakalanavvulunnaayO O..
kalakalanavvulunnaayO..kanneeLLu poMgutunnaayO
telisaedevariki..aa daivaaniki

taraMgiNee..O..O..O..taraMgiNi
ae oDilO nee jananaM..ae kaDalikO nee payanaM
ae oDilO nee jananaM..ae kaDalikO nee payanaM
taraMgiNee..O..O..O..taraMgiNi
O taraMgiNi..O..taraMgiNi

మాంగల్య బలం--1959




సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల, P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,ఎస్.వి.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి

పల్లవి::

పెనుచీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

చరణం::1

చిననాటి పరిణయ గాథ..ఎదిరించలేనైతినే
చిననాటి పరిణయ గాథ..ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాథ..తలదాల్చలేనైతినే

కలలే నశించిపోయే..మనసే కృశించిపోయే
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

పెనుచీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

చరణం::2

మొగమైన చూపలేదే..మనసింతలో మారెనా
మొగమైన చూపలేదే..మనసింతలో మారెనా
నా ప్రాణ సతివని తెలిపే..అవకాశమే పోయెనా

తొలినాటి కలతల వలన..హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

పెనుచీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

మాంగల్య బలం--1959




సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల, P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,ఎస్.వి.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి

పల్లవి::

వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ
వాడిన పూలే వికసించెనే

తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ
తీయని కలలే ఫలియించెనే

చరణం::1

వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము
లోటు లేదిక మనదే సుఖము 

తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ
తీయని కలలే ఫలియించెనే

చరణం::2

పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియాడెను నెలరేని వలెనే

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ
వాడిన పూలే వికసించెనే

చరణం::3

జీవితాలకు నేడే వసంతం
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకించగ మధురం మధురం 

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ
వాడిన పూలే వికసించెనే