Monday, September 21, 2009

గీతాంజలి--1989

సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::SP.బాలు,చిత్ర

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
నంది కొండ వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన..సందె పొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా..నీతో వస్తున్నా..నా వూరేది..యేదీ
నా పేరేది..యేదీ..నా దారేది..యేదీ..నా వారేరి..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

యేనాడో ఆరింది నా వెలుగు..నీ దరికే నా పరుగూ
ఆనాడే కోరాను నీ మనసు..నీ వరమే నన్నడుగూ
మోహినీ పిసాచి నా చెలిలే..షాకినీ విషూచి నా సఖిలే
మోహినీ పిసాచి నా చెలిలే..షాకినీ విషూచి నా సఖిలే
విడవకురా..వదలను రా..ప్రేమే రా నీ మీదా
నంది కొండ వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో

భూత ప్రేత పిసాచ భేతాళ మారే డం డం
ఝడం భం భం..నంది కొండ వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన..సందె పొద్దు సీకట్లో..నీడల్లె ఉన్నా
నీతొ వస్తున్నా..నీ కభళం పడథా..నిను కట్టుకు పోతా
నీ భరతం పడతా..నిను పట్టుకు పోతా
ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..

ఢాకిని ఢక్క ముక్కల చెక్క..డంభో తినిపిస్తాన్
తాటకి కనిపిస్తే..తాటలు వలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కలొ చొక్క..అంభో అనిపిస్తాన్
నక్కను తొక్కిస్తాన్..చుక్కలు తగ్గిస్తాన్
రక్కిస మట్టా..తొక్కిస గుట్ట పంభే దులిపేస్తాన్
తీటువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
రక్కిస మట్టా..తొక్కిస గుట్ట పంభే దులిపేస్తాన్
తీటువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
వస్తాయ ఫట్ ఫట్ ఫట్ ఫట్..వస్తాయ ఝట్ ఝట్ ఝట్
ఫట్..కోపాల మసజస థథగా..సార్థులా

నంది కొండ వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన..సందె పొద్దు సీకట్లో
నీడల్లె ఉన్నా..న న న..ణీథొ వస్థునా
నీ కభళం పడతా..నిను కట్టుకు పోతా
నీ భరతం పడతా..నిను పట్టుకు పోతా
ఆఎ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…
నంది కొంద వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కొనల్లొన..సందె పొద్దు సీకట్లో

గీతాంజలి--1989

సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగ
కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల సద్దుకే నిదుర లేపే ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర స్మృతులకు ఓం

గీతాంజలి --- 1989

సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::చిత్ర

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకులు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి
వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
మాయదేవుడే మొగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికొసమ