Friday, August 01, 2014

సూత్రధారులు--1989



సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,S.P.శైలజ  
తారాగణం::A.N.R. , భానుచందర్ , రమ్యకృష్ణ 

పల్లవి::

అయ్యా..రామయ్యా
కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ
కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ
కోటి దివ్వెలపాటి కొడుకూవైనావా
తలచినందుకు నిన్ను దశరథ రామా
వెండీ కొండల సాటి తండ్రివైనావా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

బుడి బుడి నడకల బుడతడివై
ఒడిలొ ఒదిగిన ఓరయ్యా
బుడి బుడి నడకల బుడతడివై
ఒడిలో ఒదిగిన ఓరయ్యా
కలల పంటగా బతుకు పండగా
కలల పంటగా బతుకు పండగా
కళ్యాణ రాముడిలా కదలి వచ్చావా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

నడిచే నడవడి ఒరవడిగా
నలుగురు పొగడగా ఓరయ్యా
నడిచే నడవడి ఒరవడిగా
నలుగురు పొగడగా ఓరయ్యా
నీతికి పేరుగా ఖ్యాతికి మారుగా
నీతికి పేరుగా ఖ్యాతికి మారుగా
సాకేత రాముడిలా సాగిపోవయ్యా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఆ తాటకిని చండాడినాడోయ్
యాదవును కాపాడినాడోయ్
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
మిథిలకు వచ్చీ రామయ్యా రాముడు
శివునివిల్లు విరిచీ రామయ్యా రాముడు
సీతను చేపట్టి రామయ్యా రాముడు
సీతను చేపట్టి రామయ్యా రాముడు
సీతారాముడు అయ్యేదెపుడో

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

ప్రేమమందిరం--1981


సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::P.సుశీల,S.జానకి
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్

పల్లవి::  

మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా
మహా జనానికి మరదలు పిల్లను
మహానుభావుల మరులకు మల్లెనుకో
అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో
మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా 

మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా
మహా జనానికి మరదలు పిల్లను
మహానుభావుల మరులకు మల్లెనుకో
అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో
మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా

రాజరంజనీ::

యదువంశ సుధాంబుధి చంద్ర సామిరారా
శతకోటి మన్మధాకారా ఇటురారా
నీ మనసులోని తనివితీరా
ముని మనుమరాలి నేలుకోరా
చేతకోకపోతే ఊరుకోరా
చేతకానీ లేక పోతే పోరా
మాది మన్మధ పురాగ్రహారం  
మాది రోజుకొక్క సంసారం
పరువాలమీద వ్యాపారం
పరువున్న పెద్ద వ్యవహారం
నీ దానరా..ఆ..నన్నేలరా 

మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా
మహా జనానికి మరదలు పిల్లను
మహానుభావుల మరులకు మల్లెనుకో
అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో
మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా

ఆంగ్లరంజని:: 

లండన్ దొరబాబురో ఎమ్డన్ గురిచూడరో
అన్నెం పున్నెం తెలియని కన్నెపిల్ల
దానికన్నీ తెలియాలీ తెల్లారేకల్లా
నీ జత కూడినాక అది జాణ కావాల
మగజాతికి దెబ్బతో మన్మధబాణమవ్వాల
రాజరంజని రక్తి ఈ ఆంగ్లరంజని యుక్తి
సభారంజని శక్తి మందార పువ్వంటి మధుర రంజనికి
శృంగార పురుషుడా నీతోనే విముక్తి

సభారంజని:: 

ఐవింటి తోశాక చిలుకేసి వచ్చాక
చీర నలిగే దెప్పుడో నాసామి
చిన్న దలిగే దెప్పుడో
పువ్వూ విరిసేవేళ పులకింతలవేళ
నువ్వు కాస్త నెమ్మది నా అల్లుడో
కెవ్వుమంటదయో నా కూతురు రాచవన్నెవాడివని
రగడ నువ్వు చెయ్యవని
నమ్మినా కన్నకడుపు నమ్మినాను
మా అందరితోడు మా అందెలతోడు మా అంతంతోడు
కోడిగొంతు నొక్కుతాను కోరికంత తీర్చుకో
సూరీణ్ణి ఆపుతాను సోకు సొమ్ముచేసుకో 

మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా
మహా జనానికి మరదలు పిల్లను
మహానుభావుల మరులకు మల్లెనుకో
అల్లుడో గిల్లుడో అల్లుడో గిల్లుడో
మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా

మధుర నెలవంక ఇలవంక దిగివచ్చింది 
నా చెక్కిలిపై నీ మక్కువ నిలిచింది
నెలవంక ఇలవంక దిగివచ్చింది
కౌగిలిలా వుంటుందని అనుకోలేదు
జాబిలింత వెచ్చనని అనుకొనేలేదు
ఇదే ఇదే ఇదే నా మొదటి అనుభవం
ఎన్న ఎన్ని జన్మలదో ఈ పరిచయం 
నెలవంక ఇలవంక దిగివచ్చింది

ఆఖరి పోరాటం--1988



సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.జానకి,S.P. బాలు
తారాగణం::నాగార్జున,శ్రీదేవి, సుహాసిని 

పల్లవి::

స్వాతి చినుకు సందె వేళలో..హోయ్
లేలేత వణుకు అందగత్తెలో..హోయ్
మబ్బే కన్నుగీటే..అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే చెలే ఉరుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చట..హ్హా
భలే కదా గాలి ఇచ్చట..ఆ
భలేగుంది పడుచు ముచ్చట..హోయ్
భలే కదా గాలి ఇచ్చట..

స్వాతి చినుకు సందె వేళలో..హోయ్ 
లేలేత వలపు అందగాడిలో..హోయ్
ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే
సరాగాలతోటే..స్వరాలల్లుకుంటే
పద అంది పడుచు పూపొద..హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా
పద అంది పడుచు పూపొద..హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా

చరణం::1

ఈ గాలితో ఒకే చలి..ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమతో ఒకే గిలి..ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక..నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి..పదాలెన్నో పాడ
వరాలిచ్చిపోరా..వరించానులేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు..సాగిన వేళ కురిసిన

స్వాతి చినుకు సందె వేళలో..హోయ్
లేలేత వణుకు అందగత్తెలో..హోయ్
మబ్బే కన్నుగీటే..అరె మతే పైట దాటే

సరాగాలతోటే..స్వరాలల్లుకుంటే
పద అంది పడుచు పూపొద..హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా

భలే కదా గాలి ఇచ్చట..ఆ
భలేగుంది పడుచు ముచ్చట..హోయ్
భలే కదా గాలి ఇచ్చట..

చరణం::2

లలలాలలలా..లలలాలలలా
లలలాలలలా..తకిట తకిట
తకిట తకిట తకిట తకిట
ఈ వానల కధేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీ కంటిలో కసేమిటో నా కంటిని తడెందుకో
తొలి వానల గిలిగింతలో పెనవేసిన కవ్వింతలో
ఎదే మాట రాక పెదాలందు ఆడ
శ్రుతే మించిపోయి లయె రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళ మెరిసిన

స్వాతి చినుకు సందె వేళలో..హోయ్ 
లేలేత వలపు అందగాడిలో..హోయ్
ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే

చలే కొరుకుతుంటే చెలే ఉరుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చట..హ్హా
భలే కదా గాలి ఇచ్చట..ఆ

భలేగుంది పడుచు ముచ్చట..హోయ్
భలే కదా గాలి ఇచ్చట..
పద అంది పడుచు పూపొద..హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా

ప్రేమమందిరం--1981



సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాసరి 
గానం::P.సుశీల,S.P.బాలసుబ్రహ్మణ్యం
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్

పల్లవి::  

అమరంఅమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం 
ఏ చరిత్ర వ్రాయని కావ్యం 

అమరంఅమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం 
ఏ చరిత్ర వ్రాయని కావ్యం 

సాకీ::
అమర ప్రేమికుల ఆత్మకథా
సమాధి రాళ్ళకు అంకితం

చరణం::1 

యుగాని కొకరు..ఆ యుగాన 
వారు ఏ యుగాన అయినా
ప్రేమజీవులు..ఒకరే  
ప్రేమకథలు ఒక్కటే 
ముగింపు విషాదమే 

అమరంఅమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం 
ఏ చరిత్ర వ్రాయని కావ్యం 

సాకీ::
ప్రేమ పవిత్రం..యువతీ యువకుల స్వార్జితం
రాతి గుండెల..స్వార్థానికి అర్పితం

చరణం::2 

ప్రేమకు జన్మలు ఏడు
పెళ్ళికి ముడులు మూడు
ఈ మూడు ముడుల బంధం
ఒకే జన్మ..అనుబంధం
ఆ ఏడు జన్మల బంధం
ఆ చంద్ర తారార్కం 
ఆ ఏడు జన్మల బంధం
ఆ చంద్ర తారార్కం
అది పరిమితం ఇది శాశ్వతం 

అమరంఅమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం 
ఏ చరిత్ర వ్రాయని కావ్యం 

సాకీ::

అనురాగానికి మారుపేరు..అపజయం
ప్రేమ కథలకు తుదిరూపు..పరాజయం

చరణం::2 

ప్రేమకే ప్రాణాలు పోశారు..ఎందరో
ఆ ప్రేమే ప్రాణాలు తీసింది..ఎందరివో
ప్రేమే ప్రణయమై..ఆ ప్రణయమే మరణమై
ఆ మరణమే అమరమై..అది అజరామరమై
ప్రేమ చరిత్ర తిరిగి వ్రాసిన..మన కథ 

అమరం అమరం..మన కథ అమరం
ఇది ధరిత్రి ఎరుగని ప్రణయం 
ఏ చరిత్ర వ్రాయని కావ్యం 

ఆలుమగలు--1977




సంగీతం::K.V. మహాదేవన్
రచన::వీటూరి
గానం::P.సుశీల, V.రామకృష్ణ 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,రాజబాబు,రమాప్రభ,సత్యనారాయణ

పల్లవి::

ఒక్కరిద్దరుగ మారేది..ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది..ముచ్చటగా ముగురవ్వాలనీ
అవ్వాలనీ..అవ్వాలనీ

ఒక్కరిద్దరుగ మారేది..ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది..ముచ్చటగా ముగురవ్వాలనీ
అవ్వాలనీ..అవ్వాలనీ

చరణం::1

కడలి పొంగులన్నీ..నీ కదలికలో ఉన్నవి
పడగెత్తే పరువాలే..నీ పైటదాగున్నవీ
నీనవ్వుల పువ్వులలో..నవవసంతమున్నదీ
నీనవ్వుల పువ్వులలో..నవవసంతమున్నదీ
నీ చూపులలోనే వలపూ పిలుపూ ఉన్నవీ

ఒక్కరిద్దరుగ మారేది..ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది..ముచ్చటగా ముగురవ్వాలనీ
అవ్వాలనీ..అవ్వాలనీ

చరణం::2

నీ సొగసులు ఝుమ్మంటే..నా ఊపిరి వేడెక్కింది
నే నిన్ను తాకగానే..ఏ..ఆ నీలిమబ్బు మెరిసింది
నీజంటగ నేనుంటే..నామనసే ఊగింది
నీజంటగ నేనుంటే..నామనసే ఊగింది
నీ కౌగిలిలోనా కలలే నిజమౌతున్నవీ

ఒక్కరిద్దరుగ మారేది..ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది..ముచ్చటగా ముగురవ్వాలనీ
అవ్వాలనీ..అవ్వాలనీ

చరణం::3

మరుమల్లెల బాటలో..నీ అడుగుల జాడలో 
మడుగులొత్తనా..ఎదను పరిచి ఈవేళ
నీవునేను ఒకటైతే..ఆకాశం అందింది
నీవునేను ఒకటైతే..ఆకాశం అందింది
మనకోసం తానే..చుక్కల ముగ్గులు వేసింది

ఒక్కరిద్దరుగ మారేది..ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది..ముచ్చటగా ముగురవ్వాలనీ
అవ్వాలనీ..అవ్వాలనీ

Alu Magalu--1977
Music::T.Chalapati Rao
Lyrics::SreeSree
Singer::P.Suseela,V.Ramakrishna
Film Directed By::Tatineni Rama Rao
Cast::Akkineni,Vanisree,Rajabaabu,Ramaaprabha,K.Satyanaraayana.

::::::::::::::::

okkariddaruga maarEdi..iddaru okaTavvaalani
iddaru okaTaipOyEdi..muchchaTagaa muguravvaalanii
avvaalanii..avvaalanii

okkariddaruga maarEdi..iddaru okaTavvaalani
iddaru okaTaipOyEdi..muchchaTagaa muguravvaalanii
avvaalanii..avvaalanii

::::1

kaDali pongulannee..nee kadalikalO unnavi
paDagettE paruvaalE..nee paiTadaagunnavii
neenavvula puvvulalO..navavasantamunnadii
neenavvula puvvulalO..navavasantamunnadii
nee choopulalOnE valapoo pilupoo unnavii

okkariddaruga maarEdi..iddaru okaTavvaalani
iddaru okaTaipOyEdi..muchchaTagaa muguravvaalanii
avvaalanii..avvaalanii

::::2

nee sogasulu jhummaMTE..naa oopiri vEDekkiMdi
nae ninnu taakagaanE..E..aa neelimabbu merisindi
neejanTaga nEnunTE..naamanasE oogindi
neejanTaga nEnunTE..naamanasE oogindi
nee kaugililOnaa kalalE nijamautunnavii

okkariddaruga maarEdi..iddaru okaTavvaalani
iddaru okaTaipOyEdi..muchchaTagaa muguravvaalanii
avvaalanii..avvaalanii

::::3

marumallela baaTalO..nee aDugula jaaDalO 
maDugulottanaa..edanu parichi eevELa
neevunEnu okaTaitE..aakaaSam andimdi
neevunEnu okaTaitE..aakaaSam amdimdi
manakOsam taanE..chukkala muggulu vEsindi

okkariddaruga maarEdi..iddaru okaTavvaalani
iddaru okaTaipOyEdi..muchchaTagaa muguravvaalanii
avvaalanii..avvaalanii


మగాడు--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,రామకృష్ణ,అంజలీదేవి,మంజుల,లత,కాంతారావు,జయమాలిని

పల్లవి::

కొట్టేసిండు జింజర జింజర జింజర కొట్టేసిండు 
బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు 
కొట్టేసిండు జింజర జింజర కొట్టేసిండు

చరణం::1

ఆహహా ఆహహా గాలి రెక్కలపై ఏవేల వస్తాడో 
పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
గాలి రెక్కలపై ఏవేల వస్తాడో 
పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
వాడు తుమ్మెదలంటాడు ఆ తుంటరిదంటాడు 
తుమ్మెదలంటాడు ఆ తుంటరిదంటాడు
ఒక రేకైన నలగకుండా దోచుకుపోయిండు 
తేనెలు దోచుకుపోయిండు
కొట్టేసిండు జింజర జింజర జింజర కొట్టేసిండు 
బంగారం లాంటి మనసు కొట్టేసిండు కొట్టేసిండు

చరణం::2

వాని చూపుల్లో కైపారు మెరిసింది  
వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది 
వాని చూపుల్లో కైపారు మెరిసింది  
వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది 
వాడు పగటిసందెరాడు ఇటు రాతిరి సూర్యుడు 
కదిలేటి వెన్నెల్లో సెగలు రేపుతాడు 
సెగలు..సెగలు..రేపుతాడు
కొట్టేసిండు జింజర జింజర జింజర కొట్టేసిండు 
బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు 
కొట్టేసిండు జింజర జింజర కొట్టేసిండు
జింజర జింజర జింజర జింజర

తలంబ్రాలు--1986




















సంగీతం::సత్యం
రచన::మల్లెమాల 
గానం::S.P.బాలు , P.సుశీల

పల్లవి::

లలలలలలలలలలలలలలా
లలలలలలలలలలలలలలా
లాలలలలలా లాలలలలలా

నిన్న నీవు నాకెంతొ దూరం..దూరం దూరం దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం..ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో వుండిపో..ఓ

నిన్న నీవు నాకెంతొ దూరం..దూరం దూరం దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం..ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో వుండిపో

చరణం::1

లలలలలాలలాలలలలలలలా
లలలలలాలలాలలలలలలలా

నీలాల నింగి వంగి నేల చేవిలొ ఇలా అంది 
నీలాల నింగీ వంగీ నేల చేవిలో ఇలా అందీ 
నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ

అ ప్రేమ నాలో ఉంది నీ పొందునె కొరుకుంది 
అ ప్రేమ నాలో ఉందీ నీ పొందునె కొరుకుందీ
ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ

పరువాల పందిట్లొ సరదాల సందిట్లొ పండాలి వలపన్నదీ హొయ్ 
సరిలేని సద్దుల్లొ విడిపొని ముద్దుల్లొ మునగాలి మనమన్నదీ

నిన్న నీవు నాకెంతొ దూరం..దూరం దూరం దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం..ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా నీడలా నా తో వుండిపో..హొ 

చరణం::2

లలలలలాలలాలలలలలలలా
లలలలలాలలాలలలలలలలా

గోదారి కెరటం లోన గోరంత సొగసె ఉంది  
హొయ్ గోదారి కెరటం లోన గోరంత సొగసె ఉందీ
నీరెండలాంటి నీ చుపులోన కొండంత సొగసున్నదీ 

కార్తీక పున్నమిలోనా కాసింత హాయె ఉందీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయె ఉందీ
ఏ వేలనైన నీ నీడలోన ఎనలేని హాయున్నదీ

కడసంద్య వాకిట్లొ కాపున్న చీకట్లొ కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లొ మురిపాల విందుల్లొ సాగాలి మనమన్నదీ హొయ్

నిన్న నీవు నాకెంతొ దూరం..దూరం దూరం దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం..ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా నీడలా నాతో వుండిపో

నిన్న నీవు నాకెంతొ దూరం..దూరం దూరం దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం..ప్రాణం ప్రాణం ప్రాణం

మంత్రిగారి వియ్యంకుడు--1983















సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి 
గానం::S.P.బాలు , S.జానకమ్మ 
తారాగణం::చిరంజీవి,సుధాకర్,అల్లు రామలింగయ్య,పూర్ణిమా జయరాం,
తులసి,నిర్మల, రావి కొండలరావు

పల్లవి::

ఏమని నే చెలి పాడుదును 
తిక మకలో..ఈ మక తికలో
తోటలలో పొదమాటులలో తెరచాటులలో..ఓ

ఏమని నే చెలి పాడుదును 
తిక మకలో..ఈ మక తికలో

చరణం::1

నవ్వు చిరినవ్వు..విరబూసే పొన్నల
ఆడు నడయాడు..పొన్నల్లో నేమిలిలా
పరువాలే పార్కుల్లో..ప్రణయాలే పాటల్లో 

నీ చూపులే నిట్టూర్పులై..నీ చూపులే ఒధర్పులై
నా ప్రాణమే నీ వేణువై..నీ ఊపిరే నా ఆయువై
సాగే తీగ సాగే రేగిపోయే ..లేత ఆశల కౌగిట

ఏమని నే చెలి పాడుదును 
తిక మకలో..ఈ మక తికలో

చరణం::2

లలలలాలలాలా..లలలాలలాలలాల
లలలాలహాహ్హహా..లలలాలలాలలాల

చిలక గోరింక..కలబోసే కోరిక
పలికే వలపంత..మనదేలే ప్రేమిక 
దడ పుట్టే పాటల్లో..ఈ దాగుడు మూతల్లో 

నవ్విందిలే బృందావని నా తోడుగా ఉన్నవని
ఊగే తనువులూగే వనకసాగె రాసలీలలు ఆడగా 
ఏమనినే మరి పాడుదును..తొలకరిలో తొలి అల్లరిలో 
మన అల్లికలో..ఓ..

ఏమని నే చెలి పాడుదును 
తిక మకలో..ఈ మక తికలో

అభినందన--1988




సంగీతం::ఇళయరాజా 
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.జానకి

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

పల్లవి:: 

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు 
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

చరణం::1

ఒక బంధువు వచ్చాడు..తానొంటరినన్నాడు
ఆ బంధం వేశాడు..సంబంధం చేశాడు
ఆ పిల్ల..అతనికి అనుకోకుండా
ఇల్లాలయ్యింది..ఈ..
అనుకోకుండా ఇల్లాలయ్యింది

ఇన్నాళ్లూ..ప్రేమించిన
పిల్లాడేమో..పిచ్చోడయ్యాడు
పిల్లాడేమో..పిచ్చోడయ్యాడు