Saturday, January 18, 2014

రంగులరాట్నం--1967::సింధుభైరవి::రాగం

















సంగీతం::S.రాజేశ్వరరావు మరియు B. గోపాలం 
రచన::దాశరథి
గానం:: S.జానకి,ఘంటసాల 
దర్శకత్వం::బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి
తారాగణం:::అంజలీదేవి,రాంమోహన్,చంద్రమోహన్వి(తొలిపరిచయము),జయనిర్మల,వాణిశ్రీ,నీరజ,త్యాగరాజు,
రాధారాణి.
సింధుభైరవి::రాగం 

పల్లవి::

నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో
నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో

మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా

చరణం::1

ఏడేడు శిఖరాలు నే నడువలేను 
ఏపాటి కానుక అందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి నా బాధ వినిపించలేను

అమ్మా..ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
మముగన్న మాయమ్మ అలిమేలుమంగా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ..
మముగన్న మాయమ్మ అలిమేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా 

చరణం::2

కలవారినేకాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు
స్వామి కరుణమయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగవల్లి 
అడగవే మాయమ్మా అలిమేలుమంగా

నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో

RangularaaTnam--1967
Music::S.Rajeswara Rao &B.Gopal
Lyrics::Kosaraaju
Singer's::S.Janaki,B.Gopal
CAST::Anjalidevi,Ram Moha, Vanisree,Neeraja,ChandraMohan,Tyagaraju

SindhuBhairavi::Raagam

:::

nadireyi E jaamulo swaami ninuchera digivachchuno
tirumala Sikharaalu digivachchuno
nadireyi E jaamulo swaami ninuchera digivachchuno
tirumala Sikharaalu digivachchuno

mamuganna maayamma alivelu mangamma
mamuganna maayamma alivelu mangamma
patidevu odilona muriseti vela
swaami chirunavvu vennelalu kuriseti vela
vibhuniki maa maata vinipinchavammaa
prabhuniki maa manavi vinipinchavammaa

:::1

Ededu Sikharaalu ne naduvalenu 
aepaati kaanuka andinchalenu
venkanna paadaalu darSinchalenu
nenu vivarinchi naa baadha vinipinchalenu

ammaa..aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
mamuganna maayamma alimelumangaa
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa..
mamuganna maayamma alimelumangaa
vibhuniki maa maata vinipinchavammaa
prabhuniki maa manavi vinipinchavammaa 

:::2

kalavaarinekaani karuninchaledaa
nirupeda moralevi vinipinchukodaa
kanneeti bratukula kanaleninaadu
swaami karunamayundanna birudelanammaa
adagave maa talli anuraagavalli 
adagave maayammaa alimelumangaa

nadireyi E jaamulo swaami ninuchera digivachchuno
tirumala Sikharaalu digivachchuno

రంగులరాట్నం--1967




సంగీతం::S.రాజేశ్వరరావు మరియు B. గోపాలం 
రచన::కోసరాజురాఘవయ్య 
దర్శకత్వం::బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి
గానం:: S.జానకి, B.గోపాలం 
తారాగణం::అంజలీదేవి,రాంమోహన్,వాణిశ్రీ,నీరజ, చంద్రమోహన్ (తొలి పరిచయము),త్యాగరాజు

పల్లవి::

ఆహా హా ఆహహా..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
వెన్నెల రేయి చందమామ వెచ్చగా ఉన్నది మామ 
మనసేదోలా గున్నది నాకేదోలాగా ఉన్నది 

హేయ్..తీరికి వెన్నెల కాయు వేళ 
దొర వయసులో పిల్ల 
నీ కాలాగే ఉంటది మనసాఅలాగే ఉంటది 

చరణం::1

చల్లని గాలి తోడుగ రాగ సైగలతో నువ్వు చూడగా 
కను సైగలతో వల ఏయగా 

గుండెలదరగా నీతో పాటుగా  
గుస గుస లాడగా సిగ్గౌతున్నది 

వెన్నెల రేయి చందమామ వెచ్చగా ఉన్నది మామ 
మనసేదోలా గున్నది నాకేదోలాగా ఉన్నది

చరణం::2

అహా నడకల తోటి వియ్యమంది 
నవ్వులతో నను పిల్వగ 
చిరు నవ్వులతో పక్క నిల్వగ 
చిన్ననాటి ఆ సిగ్గు ఎగ్గులు చిన్న బుచ్చుకొని చిత్తై పొవటె 

తీరికి వెన్నెల కాయు వేళ 
దొర వయసులో పిల్ల 
నీ కాలాగే ఉంటది మనసాఅలాగే ఉంటది

చరణం::3

తీయ తీయగా సరస మాడి చేయి చేయి కల్పుతూ 
మన చేయి చేయి కల్పుతూ 
మాటలతో నువ్వు మత్తెక్కించితే  
మనసే నాతో రాలెదన్నదోయీ

వెన్నెల రేయి చందమామ వెచ్చగా ఉన్నది మామ 
మనసేదోలా గున్నది నాకేదోలాగా ఉన్నది 


RangularaaTnam--1967
Music::S.Rajeswara Rao &B.Gopal
Lyrics::Kosaraaju
Singer's::S.Janaki,B.Gopal
CAST::AnjalidEvi,Ram Moha, Vanisree,Neeraja,ChandraMohan,Tyagaraju

:::

aahaa haa aahahaa..mm mm mm mm
vennela reyi chandamaama vechchaga unnadi maama 
manasedOlaa gunnadi naakedOlaagaa unnadi 

hey..teeriki vennela kaayu veLa 
dora vayasulO pilla 
nee kaalaage unTadi manasaaalaage untadi 

:::1

challani gaali tOduga raaga saigalato nuvvu choodagaa 
kanu saigalato vala eyagaa 

gundeladaragaa neeto paatugaa  
gusa gusa laadagaa siggautunnadi 

vennela reyi chandamaama vechchagaa unnadi maama 
manasedolaa gunnadi naakedolaagaa unnadi

:::2

ahaa nadakala tOti viyyamandi 
navvulato nanu pilvaga 
chiru navvulato pakka nilvaga 
chinnanaati aa siggu eggulu chinna buchchukoni chittai povate 

teeriki vennela kaayu veLa 
dora vayasulo pilla 
nee kaalaage untadi manasaaalaage untadi

:::3

teeya teeyagaa sarasa maadi cheyi cheyi kalputoo 
mana cheyi cheyi kalputoo 
maatalato nuvvu mattekkinchite  
manase naato raaledannadoyee

vennela reyi chandamaama vechchagaa unnadi maama 
manasedolaa gunnadi naakedolaagaa unnadi 

రంగుల రాట్నం--1967::కానడ::రాగం




సంగీతం::S.రాజేశ్వర రావ్ గోపాలం
రచన::దాశరధి
దర్శకత్వం::బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి
గానం::P.సుశీల బృందం
తారాగణం::అంజలీదేవి,రాంమోహన్,వాణిశ్రీ,నీరజ, విజయనిర్మల,చంద్రమోహన్ (తొలి పరిచయము),త్యాగరాజు
కానడ::రాగం 

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కనరాని దేవుడే కనిపించినాడే 
కనిపించి అంతలో..కన్నుమరుగాయే 
కన్నుమరుగాయే
కనరాని దేవుడే కనిపించి నాడే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::1

అలనీలి గగనాన వెలిగె నీరూపు
అలనీలి గగనాన వెలిగె నీరూపు
ఆనంద భాష్పాల మునిగె నా చూపు
మనసార నిను చూడలేనైతి స్వామి
కరుణించి ఒకసారి కనిపించవేమీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

చరణం::2

అందాల కన్నయా కనిపించగానే
బృందావనమెల్ల పులకించిపోయే

యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే
నవ్వులో రాధమ్మ స్నానాలు చెసే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

చరణం::3

వలపుతో పెనవేయు పారిజాతమునై
వలపుతో పెనవేయు పారిజాతమునై
ఎదమీద నిదురించు అడిఆశలేదు 
గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై 
నీ చరణ కమలాల నలిగిపోనీవా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కనరాని దేవుడే కనిపించినాడే
కనిపించి అంతలో కన్నుమరుగాయే
కన్నుమరుగాయే..

RangularaaTnam--
Music::S.Rajeswara Rao
Lyrics::Dasarathi
Singer'sP.Suseela,Brundam
Kanada::raagam

:::

aa aa aa aa aa aa aa 
kanaraani dEvuDE kanipinchinaaDE 
kanipinchi antalO..kannumarugaayE..
kannumarugaayE
aaaaaaaaaaaaaaaaaaaaaa
kanaraani dEvuDE kanipinchi naaDE

:::1

aa aa aa aa aa aa aa aa aa aa aa
alaneeli gaganaana velige neerUpu
alaneeli gaganaana velige neerUpu
aananda bhaashpaala munige naa chUpu
manasaara ninu chUDalEnaiti swaami
karuNinchi okasaari kanipinchavEmii
aa aa aa aa aa aa aa aa aa aa aa

:::2

andaala kannayaa kanipinchagaanE
bRndaavanamella pulakinchipOyE

yamunamma keraTaala nelaraaju navvE
navvulO raadhamma snaanaalu chesE
aa aa aa aa aa aa aa aa aa aa 

:::3

valaputO penavEyu paarijaatamunai
edameeda nidurinchu aDiASalEdu 
gaDDilO virabUyu kanne kusumamunai 
nee charaNa kamalaala naligipOneevaa
aa aa aa aa aa aa aa aa

kanaraani dEvuDE kanipinchinaaDE
kanipinchi antalO kannumarugaayE

kannumarugaayE..


ఆత్మ బంధువు--1962

















సంగీతం::K.V. మహదేవన్
రచన::కొసరాజు
గానం::P.సుశీల,K.జమునా రాణి 

తారాగణం::ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ, రేలంగి, గిరిజ

పల్లవి::

మారదు మారదు మనుషుల..తత్వం మారదు
మారదు మారదు మనుషుల..తత్వం మారదు
మాటలతోటి మారిందనుకుని..మాటలతోటి మారిందనుకుని
ఎవ్వరు భ్రమపడకూడదు..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
మారదు మారదు మనుషుల..తత్వం మారదు

చరణం::1

సూర్య చంద్రులూ మారలేదులే..చుక్కలు మొలవకా మానలేదులే
సూర్య చంద్రులూ మారలేదులే..చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం..మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం
మారటమంటే సుళువుకాదులే..మారటమంటే సుళువుకాదులే
మారదు మారదు మనుషుల..తత్వం మారదు

చరణం::2

పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు దగ్గర బంధువులంటారు
పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు దగ్గర బంధువులంటారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు..చెవులకు చేటలు కడతారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు..చెవులకు చేటలు కడతారు
మారదు మారదు మనుషుల..తత్వం మార

చరణం::3

కాసుపడనిదే తాళి కట్టరు..పెళ్ళిపీటపై వారు కాలుపెట్టరు
కాసుపడనిదే తాళి కట్టరు..పెళ్ళిపీటపై వారు కాలుపెట్టరు
కట్నములేనిదే ఘనతే లేదనీ..కట్నములేనిదే ఘనతే లేదనీ
చదువుకున్నవారే కలలుకందురూ..చదువుకున్నవారే కలలుకందురూ
మారదు మారదు మనుషుల..తత్వం మార

చరణం::4

ఆకలికన్నం పెట్టేవాడే..ఏఏఏ..ఆపదలో కాపాడేవాడే..ఏ
ఆకలికన్నం పెట్టేవాడే..ఆపదలో కాపాడేవాడే
బంధువూ అతడే..బంధువూ ఆత్మబంధువూ
ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ  
మారదు మారదు మనుషుల..తత్వం మార
మనుషుల..తత్వం మార

ఆత్మ బంధువు--1962





సంగీతం::K.V.మహదేవన్
రచన::కొసరాజు
గానం::ఘంటసాల

పల్లవి::

చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా..ఆఆఅ..హోయ్

చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే..చుక్కలాంటి చిన్నదానా

చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా..ఆఆఅ..హోయ్

చరణం::1

ఒయ్యారము ఒలకబోసినావా..వాలుచూపులతో గాలమ్ము వేసినావా
ఒయ్యారము ఒలకబోసినావా..వాలుచూపులతో గాలమ్ము వేసినావా
పెళ్ళికొడుకును పట్టినావా..పెళ్ళికొడుకును పట్టినావా 
ఓసి కోడలుపిల్లా..ఛాన్సు కొట్టినావా

చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే..చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా..ఆఆఅ..హోయ్

చరణం::2

చందమామవంటి భలే అందగాడు..బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు
చందమామవంటి భలే అందగాడు..బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు
నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు..నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు
ఏడాది తిరగకుండ వచ్చు..ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు

చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు..జేసే చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా..ఆఆఅ..హోయ్

చరణం::3

ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం
ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం
వలపు దాచావంటే పరితాపం..వలపు దాచావంటే పరితాపం
అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం

చీరగట్టి సింగారించి..చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే..చుక్కలాంటి చిన్నదానా
చిన్నదానా..ఆఆఅ..హోయ్