Friday, May 11, 2007

రాజు వెడలె-1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు 
తారాగణం::శోభన్ బాబు,జయసుధ,మురళీ మోహన్,జయప్రద,పండరీబాయి

పల్లవి::

పటపట పటలాడించింది పెటపెటలాడే చిన్నది 
కడకొక్క పిట్టయినా పడలేదు
నువ్వు వలలోన పడకుండ తప్పలేదు 
డిషుం డిషుం  డిషుం 
పటపట పటలాడించింది పెటపెటలాడే చిన్నది 
కడకొక్క పిట్టయినా పడలేదు 
నువ్వు వలలోన పడకుండ తప్పలేదు 

చరణం::1

అద్దాల మేడలో అపరంజి బొమ్మ 
అడవంటే ఏంటో తెలిసెనా అమ్మ
అద్దాల మేడలో అపరంజి బొమ్మా 
అడవంటే ఏంటో తెలిసెనా అమ్మ
ఎలుగుబంటి సంగతి ఎరగవల్లె వున్నది 
కన్నెపిల్ల కంటపడితే కౌగిలించుకుంటుంది 
అహ ఫట్ అహ ఫట్ పటపట 
పటలాడించింది పెటపెటలాడే చిన్నది 
కడకొక్క పిట్టయినా పడలేదు 
నువ్వు వలలోన పడకుండ తప్పలేదు           

చరణం::2
          
ఆడపిల్లకెందుకీ తుపాకులూ తూటాలూ 
ఓరచూపు చాలును ఒక్క నవ్వు చాలును
ఆడపిల్లకెందుకీ తుపాకులూ తూటాలూ 
ఓరచూపు చాలును ఒక్క నవ్వు చాలును
విసిరిచూడు మగసింహం పడే పాటులు 
విసిరిచూడు మగసింహం పడే పాటులు
వెర్రెత్తి నీ ముందు తిరుగుతుంది గింగిరాలు 
గిర్ గిర్ పటపట పటలాడించింది పెటపెటలాడే చిన్నది 
కడకొక్క పిట్టయినా పడలేదు 
నువ్వు వలలోన పడకుండ తప్పలేదు 
  
చరణం::3

పట్టబోయి పట్టుబడిన చిట్టి పిట్టా 
వలలోన చిక్కావా వలపులో పడ్డావా 
పట్టబోయి పట్టుబడిన చిట్టి పిట్టా 
వలలోన చిక్కావా వలపులో పడ్డావా
తెలుసుకోలేవు నువ్వు ఈ క్షణాన తెలుస్తుంది 
రాత్రికి తెలుస్తుంది పొద్దున అహ ఫట్  అహ ఫట్ 
పటపట పటలాడించింది పెటపెటలాడే 
చిన్నది కడకొక్క పిట్టయినా పడలేదు 
నువ్వు వలలోన పడకుండ తప్పలేదు 
పటపట పటలాడించింది పెటపెటలాడే 
చిన్నది కడకొక్క పిట్టయినా పడలేదు 
నువ్వు వలలోన పడకుండ తప్పలేదు డిషుం