Wednesday, May 23, 2007

రాజు వెడలె-1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::శోభన్ బాబు,జయసుధ,మురళీ మోహన్,జయప్రద,పండరీబాయి

పల్లవి::

అమ్మ నీ అమ్మ..
అమ్మ నీ సోకుమాడ ఏం సిగ్గు ఏం సిగ్గు 
నిన్న మొన్న లేనిదీ ఏమైందీ ఈ పొద్దు
అమ్మ నీ సోకుమాడ ఏం సిగ్గు ఏం సిగ్గు 
నిన్న మొన్న లేనిదీ ఏమైందీ ఈపొద్దు
అమ్మ నీ అమ్మ నీ సోకుమాడ ఏం ముద్దు
ఏం ముద్దు నిన్న మొన్న లేనిది ఏమైందీ ఈపొద్దు
అమ్మ నీ సోకుమాడ ఏం ముద్దు ఏం ముద్దు 
నిన్న మొన్న లేనిదీ ఏమైందీ ఈ పొద్దు

చరణం::1

వయసేమో నీ వైపే మొగ్గుతున్నది 
మనసేమో జంకుతో తగ్గుతున్నది 
వయసేమో నీ వైపే మొగ్గుతున్నది 
మనసేమో జంకుతో తగ్గుతున్నది 
సొగసు లోలోపలే గొణుగుతున్నది 
సొగసు లోలోపలే గొణుగుతున్నది 
చూపులలో ఆ శోభ తొణుకుచున్నది
అందుకే ఈ సిగ్గు అందుకే ఈ ముద్దు 
అందుకే మనకిది తొలిపొద్దు తొలిపొద్దు తొలిపొద్దు 
అమ్మ నీ అమ్మ నీ సోకుమాడ ఏం సిగ్గు  
ఏం సిగ్గు నిన్న మొన్న లేనిదీ ఏమైందీ ఈపొద్దు?

చరణం::2

లల లల లల 
చిగురాకు బుగ్గల్లో ఎంత సిగ్గు 
వగలమారి ఒళ్ళు విరుపులెంతముద్దు 
చిగురాకు బుగ్గల్లో ఎంత సిగ్గు 
వగలమారి ఒళ్ళు విరుపులెంతముద్దు 
అదురుతున్న పెదవులకు ఎంత సిగ్గు 
అదురుతున్న పెదవులకు ఎంత సిగ్గు
అక్కడే ఆడుకునే నీ చూపులెంత ముద్దు
చిదిమి చూడు ఈ సిగ్గు 
వొదిగి చూడు ఓ ముద్దు రమ్మన్న రాదు 
మళ్ళీ తొలిపొద్దు తొలిపొద్దు తొలిపొద్దు
అమ్మ నీ అమ్మ నీ సోకుమాడ ఏం ముద్దు
ఏం ముద్దు నిన్న మొన్న లేనిది ఏమైందీ ఈపొద్దు 

చరణం::3

ఇవ్వాలని వురుకుతుంది పడుచుతనం 
ఇవ్వలేక నసుకుతుంది కన్నెతనం 
ఇవ్వాలని వురుకుతుంది పడుచుతనం 
ఇవ్వలేక నసుకుతుంది కన్నెతనం
పదారేళ్ళదాక నేను నాకే సొంతము 
పదారేళ్ళదాక నేను నాకే సొంతము 
అదేమాట అనలేను ఈ క్షణము 
అందుకే ఈ సిగ్గు అందుకే ఈ ముద్దు 
అందుకే మనకిది తొలిపొద్దు తొలిపొద్దు తొలిపొద్దు  
అమ్మ నీ అమ్మ నీ సోకుమాడ ఏం సిగ్గు  ఏం సిగ్గు 
నిన్న మొన్న లేనిదీ ఏమైందీ ఈ పొద్దు   
అమ్మ నీ అమ్మ నీ సోకుమాడ ఏం ముద్దు 
ఏం ముద్దు నిన్న మొన్న లేనిది ఏమైందీ ఈపొద్దు