Thursday, August 23, 2012

చక్రధారి--1977





సంగీతం::G.K.వెంకటేష్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఆనంద్,S.P.బాలు

పల్లవి::

విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥
సర్వం మరచీ నీ స్మరణము సేయ
స్వర్లోక ఆనందమే॥
విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥

చరణం::1

అంబుజనాభా నమ్మిన వారికి
అంబుజనాభా నమ్మిన వారికి
అభయమునొసగీ ఆర్తిని బాపీ
ఉభయ తారకా పథమును చూపీ
ఉభయ తారకా పథమును చూపీ
ఉద్ధరించు కరుణా సింధో
విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥

చరణం::2

నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము
నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము
నిను స్మరియించే ధ్యానమే ధ్యానము
నిను కీర్తించే గానమే గానము
నిను కీర్తించే గానమే గానము
నీకర్పించే జన్మమే జన్మము

విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥
సర్వం మరచీ నీ స్మరణము సేయ
స్వర్లోక ఆనందమే॥
విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥

అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు--1989






















సంగీతం::చక్త్రవర్తి 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, S.జానకి  
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,వాణిశ్రీ.

పల్లవి::

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం
ఎలా వర్ణించను

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం
ఎలా వర్ణించను

చరణం::1

సందిట్లో పడి కాగే కాముడు గోల పెట్టగా
పూలే ఈల కొట్టగా కన్నెపిట్టకే కన్ను కొట్టుకోనా
ఓ..ఓ..ఓఓఓఓఓఓ
అందిట్లో పడి వెన్నెట్లో పడుచందమిచ్చుకోనా
ముచ్చట్లో ముడి ముద్దుల్లో తడి మేను దాచుకోనా
మంచుల్లో ఊరేసాను మల్లెపూలు
మంచంలో ఆరేస్తాను కన్నె పూలు
కొంగుల్లో దాచుంచాను కొత్త పూలు
కొత్తల్లో మొగ్గేసేవే సిగ్గు పూలు

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం
ఎలా వర్ణించను

చరణం::2

ఊపుల్లో పడి రేగే సొంపులు ఊగుతున్నవి
నాలో ఆగకున్నవి జాజి తీగెలా నిన్ను అల్లుకోనా
ఓ..ఓ..ఓఓఓఓఓఓ
చూపుల్లో సడి చేతల్లో పడి తప్పు చేసుకోనా
రాజీలే పడి సాగే దోపిడి నేను ఒప్పుకోనా
తాళాలే దాటించాలి తందనాలు
తాపాలే తగ్గించాలి చందనాలు
ఓ..ఇంతట్లో రగిలాయంటే ఇంధనాలు
ఓ..వాటేసి చేసేస్తాలే వందనాలు

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం
ఎలా వర్ణించను